twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: టీఆర్పీ రేటింగ్ కోసం 'బిగ్' బాస్ 'ప్లాన్'!.. ఫ్యామిలీ వీక్ తో ఎమోనల్ డ్రామా?

    |

    అమెరికాలో బిగ్ బ్రదర్ పేరుతో సూపర్ హిట్ అయిన రియాలిటీ షోను భారతదేశంలో ముందుగా హిందీ భాషలో బిగ్ బాస్ గా తీసుకొచ్చారు. ఈ రియాలిటీ షో నార్త్ ప్రేక్షకులను విపరీతంగా నచ్చడంతో మిగతా ప్రాంతీయ భాషల్లోకి సైతం అదే పేరుతో ఇంట్రడ్యూస్ చేశారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ బిగ్ బాస్ షో దూసుకుపోతోంది. తెలుగులో అయితే ఇప్పటికీ ఐదు టెలివిజన్, ఒక ఓటీటీ సీజన్ పూర్తవ్వగా ప్రస్తుతం ఆరో సీజన్ ప్రసారమవుతోంది. ఈ షోలో ఆటలు, టాస్క్ లు, బిహేవియరే కాకుండా ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తుంది బిగ్ బాస్ టీమ్. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో అదే చేయనుందని టాక్.

    11 మంది హౌజ్ నుంచి బయటకు..

    11 మంది హౌజ్ నుంచి బయటకు..

    అత్యంత ప్రేక్షకాదరణ పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో ఆరో సీజన్ లోకి కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహి రావు, రేవంత్‌‌లు 21 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరిలో 10 వారాల్లో షానీ సల్మాన్, అభినయ శ్రీ, నేహా చౌదరి, ఆరోహి రావు, చంటి, సుదీప పింకీ, అర్జున్‌, సూర్య, చిత్తూరు చిరుత గీతూ రాయల్, బాలాదిత్య, వాసంతి కృష్ణన్ ఎలిమినట్ అయి ఇల్లు విడిచి వెళ్లిపోయారు.

    ఇమ్యునిటీతో రాజ్ సేఫ్..

    ఇమ్యునిటీతో రాజ్ సేఫ్..

    బిగ్ బాస్ ఏ సీజన్ లోనైనా నామినేషన్ల ప్రక్రియ రసవత్తరంగానే ఉంటుంది. కానీ పదకొండోవారం మాత్రం చాలా సాదాసీదాగా, సాఫీగా సాగింది. బిగ్ బాస్ హౌజ్ లో మిగిలిన 10 మంది ఇంటిసభ్యుల్లో ప్రస్తుతం 8 మంది నామినేషన్లో ఉన్నారు. అయితే ముందుగా కెప్టెన్ ఫైమా మినహా 9 మంది నామినేట్ అయ్యారు. ఆ తర్వాత ఇమ్యునిటీ సంపాదించిన రాజ్ నామినేషన్ నుంచి సేవ్ అయ్యాడు. ప్రస్తుతం ఇనయా సుల్తానా, రోహిత్, కీర్తి భట్, ఆదిరెడ్డి, శ్రీసత్య, శ్రీహాన్, మెరీనా, రేవంత్ నామినేషన్లలో ఉన్నారు.

    బిగ్ బాస్ భారీ స్కెచ్..

    బిగ్ బాస్ భారీ స్కెచ్..

    అయితే బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 11వ వారం మదర్ ఇండియా మెరీనా అబ్రహం ఎలిమినేట్ అయి హౌజ్ నుంచి బయటకు వెళ్లనుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దాదాపుగా ఆమెనే బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. అయితే ఈవారం మెరీనాను హౌజ్ నుంచి తప్పించడం వెనుక బిగ్ బాస్ పెద్ద స్కెచ్ ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్ 6 11వ వారంలో డేంజర్ జోన్ లో రోహిత్, శ్రీసత్య, మెరీనా ఉన్నారు.

    వచ్చే వారం ఫ్యామిలీ వీక్..

    వచ్చే వారం ఫ్యామిలీ వీక్..

    హౌజ్ లో మిగతా కంటెస్టెంట్లపై శ్రీసత్య చూపే వెటకారం, యాటిట్యూడ్ నచ్చని ప్రేక్షకులు ఆమెను బయటకు పంపాలనుకున్నారు. అందుకోసం ఆపరేషన్ శ్రీసత్య పేరుతో పెద్ద ఉద్యమం కూడా నిర్వహించారు. కానీ బిగ్ బాస్ టీమ్ కు ఆమె ఈవారం వెళ్లిపోతే పెద్దగా లాభం ఉండదు. ఎందుకంటే వచ్చే వారం ఫ్యామిలీ వీక్ ఉండనుంది. అంటే కంటెస్టెంట్ల కుటుంబసభ్యులను హౌజ్ లోకి తీసుకొచ్చి ఎమోషనల్ గా ఎపిసోడ్ ను రక్తికట్టిస్తారు.

    టీఆర్పీ పెరిగే అవకాశం..

    టీఆర్పీ పెరిగే అవకాశం..

    బిగ్ బాస్ లో ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ లో భాగంగా శ్రీసత్య తల్లిని తీసుకురానున్నారు. శ్రీసత్య తల్లికి ఆరోగ్యం సరిగా లేదని తెలిసిందే. ఈ విషయం చాలాసార్లు శ్రీసత్య హౌజ్ లో మాట్లాడింది. ఆమె ప్రస్తుతం కదల్లేని స్థితిలో ఉన్నారు. వీల్ చైర్ లోనే ఉంటున్న ఆమెను బిగ్ బాస్ హౌజ్ కి తీసుకుస్తే కచ్చితంగా కంటెస్టెంట్స్ తోపాటు ఆడియెన్స్ కూడా ఎమోషనల్ అవుతారు. ఇది బిగ్ బాస్ షోకి బాగా ప్లస్ అవుతుంది. అలాగే టీఆర్పీ రేటింగ్ కూడా పెరిగే అవకాశం ఉంది.

    భార్యాభర్తలను విడగొట్టి..

    భార్యాభర్తలను విడగొట్టి..

    అలాగే ఈవారం మెరీనాను ఎలిమినేట్ చేస్తే వచ్చేవారం మళ్లీ ఫ్యామిలీ వీక్ లో భాగంగా ఆమెను తీసుకుని రావొచ్చు. ఆమె ఇప్పుడు వెళ్లడం.. అప్పుడు రావడం రోహిత్-మెరీనా అభిమానులతోపాటు ఆడియెన్స్ కు కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు కలిసి ఉన్న భార్యాభర్తలను విడగొట్టి.. అప్పటికి మళ్లీ తీసుకొస్తే ఆ ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అందుకే ఈవారం శ్రీసత్యకు బదులు మెరీనా పంపి.. టీఆర్పీ రేటింగ్ పెంచుకునేందుకు బిగ్ బాస్ బిగ్ ప్లాన్ వేసిందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

    English summary
    Marina Eliminated For Saving Sri Satya Because Bigg Boss Telugu 6 Team Planning To Increase TRP Rating With Family Week
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X