Bigg Boss Telugu 6: ఫైమా, శ్రీసత్యకు ఫిట్టింగ్ పెట్టిన నాగార్జున.. భార్యాభర్తల ఫన్ గేమ్!

అత్యధికంగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. అమెరికాలో బిగ్ బ్రదర్ పేరుతో ముందుగా వచ్చిన ఈ షో సూపర్ డూపర్ హిట్ సాధించింది. దీంతో ఈ షోను ఇండియాలోకి తీసుకొద్దామన్న ఆలోచనతో భారత్ లో హిందీ భాషలో ముందుగా స్టార్ట్ చేశారు. హిందీలో ఈ షో సూపర్ హిట్ కావడంతో తెలుగులోకి సైతం తీసుకొచ్చి ఘన విజయం సాధించారు. తెలుగులో వరుసపెట్టి సీజన్లతో ముందుకు సాగుతోంది బిగ్ బాస్ రియాలిటీ షో. తాజాగా బిగ్ బాస్ హౌజ్ నుంచి 11వ వారం మరొక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే సమయం వచ్చింది. దీనికి సంబంధించిన నవంబర్ 20 ఆదివారం ఎపిసోడ్ నాటి రెండో ప్రోమోను విడుదల చేశారు.

76 రోజులు 77 ఎపిసోడ్ లు పూర్తి..

76 రోజులు 77 ఎపిసోడ్ లు పూర్తి..

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ దాదాపు పూర్తయ్యే దశకు వచ్చింది. ఇప్పటికి 76 రోజులు 77 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. ఇంకొన్ని రోజుల్లో టైటిల్ విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. అయితే ఇప్పటికీ పది వారాలకు గానీ 11 మంది ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ ను వీడి వెళ్లిపోయారు. వారిలో మొదటి వారంలో షానీ సల్మాన్, అభినయ శ్రీ ఎలిమినేట్ కాగా నేహా చౌదరి, ఆరోహి రావు, చంటి, సుదీప పింకీ, అర్జున్‌, సూర్య, చిత్తూరు చిరుత గీతూ రాయల్ తోపాటు బాలాదిత్య, వాసంతి కృష్ణన్ డబుల్ ఎలిమినేషన్ తో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు.

నామినేషన్లలో 8 మంది..

నామినేషన్లలో 8 మంది..


బిగ్ బాస్ ఏ సీజన్ లోనైనా నామినేషన్ల ప్రక్రియ రసవత్తరంగానే ఉంటుంది. కానీ పదకొండోవారం మాత్రం చాలా సాదాసీదాగా, సాఫీగా సాగింది. బిగ్ బాస్ హౌజ్ లో మిగిలిన 10 మంది ఇంటిసభ్యుల్లో ప్రస్తుతం 8 మంది నామినేషన్లో ఉన్నారు. అయితే ముందుగా కెప్టెన్ ఫైమా మినహా 9 మంది నామినేట్ అయ్యారు. ఆ తర్వాత ఇమ్యునిటీ సంపాదించిన రాజ్ నామినేషన్ నుంచి సేవ్ అయ్యాడు. ప్రస్తుతం ఇనయా సుల్తానా, రోహిత్, కీర్తి భట్, ఆదిరెడ్డి, శ్రీసత్య, శ్రీహాన్, మెరీనా, రేవంత్ నామినేషన్లలో ఉన్నారు.

 ఇంటి సభ్యులతో ఫన్ టాస్క్..

ఇంటి సభ్యులతో ఫన్ టాస్క్..

తాజాగా నవంబర్ 20 ఆదివారం నాటి ఎపిసోడ్ రెండో ప్రోమోను విడుదల చేసింది స్టార్ మా. ఈ ప్రోమోలో చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలోని సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు హోస్ట్ నాగార్జున. ఇక ఆదివారం ఫన్ డే అని నాగార్జున ఎప్పుడూ చెబుతుంటారు. ఇందులో భాగంగానే ఇంటి సభ్యులచేత ఫన్నీ గేమ్స్ ఆడించాడు హోస్ట్ నాగార్జున. ఒక సర్కిల్ లో ఒక ఎముక ముక్క పెట్టారు. రెండు టీమ్స్ నుంచి ఒకరు వచ్చి ఆ బోన్ తీసుకున్నవాళ్లు గెలిచినట్లు.

ఆదిరెడ్డి కన్ఫ్యూజన్..

ఆదిరెడ్డి కన్ఫ్యూజన్..

ఆదిరెడ్డి, రాజ్ పరిగెత్తుకుంటూ వచ్చారు. అయితే రాజ్ బోన్ తీసుకోగా.. ఆదిరెడ్డి ముందుకు పరిగెత్తాడు. దీంతో ఆదిరెడ్డి ఏం చేశావ్ అని అడిగారు నాగార్జున. దీనికి సార్ ఈ రౌండ్ క్యాన్సిల్ చేస్తారా అని అడిగాడు ఆదిరెడ్డి. ఆడియెన్స్ అంతా నవ్వుతున్నారు ఇక్కడ అని నవ్వుకుంటూ చెప్పాడు నాగార్జున. టీమ్ బీ నుంచి ఎవరు వస్తున్నారంటే ఫైమా పేరు చెబుతారు. టీమ్ ఏ నుంచి అడగ్గా.. రేవంత్.. నేను వస్తా సార్ అన్నాడు.

ఆడపిల్లపై గెలిచేద్దామనే..

ఆడపిల్లపై గెలిచేద్దామనే..

రేవంత్ వస్తా అనడంతో.. ఆడపిల్ల మీద గెలిచేద్దామనా అని నాగార్జున కౌంటర్ వేశాడు. ఆ తర్వాత టీమ్ ఏ నుంచి ఎవరస్తారని అడగ్గా.. రేవంత్ చేయి లేపాడు.. దీంతో రేవంత్ వస్తే రూల్స్ మార్చాలని నాగార్జున చెప్పాడు. అయితే మ్యూజిక్ ఆగినప్పుడు సర్కిల్ లోని బోన్ తీసుకోవాల్సిందిగా నాగార్జున చెప్పాడు. దీనికి వాడిని కొంచెం లేట్ గా రమ్మనండి అని శ్రీహాన్ అన్నాడు. తర్వాత శ్రీహాన్, రేవంత్ పోటి పడతారు. కానీ చివరిగా ఆ ఎముకను రేవంత్ దక్కించుకుంటాడు.

 ఫైమా దెయ్యంలా ఉంటుందా..

ఫైమా దెయ్యంలా ఉంటుందా..

అనంతరం రాజ్ నీకు దెయ్యాలంటే భయమట కదా అని అడిగితే లేదు సార్ అని రాజ శేఖర్ సమాధానం ఇస్తాడు. ఇవాళ నైట్ మెరీనా, ఫైమా, శ్రీసత్య దెయ్యం గెటప్ వేసుకుని రాజ్ ని భయపెట్టాలని చెబుతాడు నాగార్జున. దీంతో ఫైమాకు గెటప్ వేయాల్సిన అవసరం లేదు.. సాధారణంగానే ఫైమాకు రాజ్ భయపడతాడని శ్రీసత్య అంటుంది. దీనికి అంటే ఏంటి.. ఫైమా దెయ్యం లాగా ఉంటుందనా అని నాగార్జున ఫిటింగ్ పెట్టాడు. దీంతో సార్ సార్.. అంటూ చేతులతో మొక్కింది శ్రీసత్య.

మెరినా ఎలిమినేట్..

గేమ్ లో భార్యాభర్తలిద్దరూ పార్టిస్ పేట్ చేశారు. వీళ్ల గేమ్ కొంచెం ఫన్ తెప్పించింది. ఇక ఎలిమినేషన్ టైమ్ వచ్చేసరికి చివరిగా మెరీనా, ఇనయా సుల్తానా, శ్రీసత్య ముగ్గురు ఉన్నారు. వాళ్లకు కోన్ షేప్ లో ఉన్న వస్తువు ఏదో ఇచ్చారు. ఒకేసారి ఓపెన్ చేయమంటారు నాగార్జున. అక్కడ వచ్చిన ఫ్లాగ్ కలర్ ను బట్టి సేఫ్, అన్ సేఫ్ ఎవరనేది తెలుస్తుందని చెబుతారు. ప్రొమో చివర్లో శ్రీహాన్, ఆదిరెడ్డి ఫీల్ అయినట్లు చూపించారు. బిగ్ బాస్ తెలుగు 6 11వ వారం మెరీనా ఎలిమినేట్ అయిందన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X