Bigg Boss Telugu 6: మెరీనాకు బిగ్ రెమ్యునరేషన్.. వెళ్లిపోవడానికి అసలు కారణాలు ఇవే!
బిగ్ బాస్ లో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఇక వాటికి తగ్గట్టుగా కంటెస్టెంట్స్ కూడా మారాల్సి ఉంటుంది. ఏమాత్రం కాస్త సైలెంట్ గా కనిపించినా కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా హౌస్ లో చాలా చలాకీగా కనిపిస్తూ ఉంటూ జనాల దృష్టిని కూడా ఆకర్షిస్తూ ఉండాలి. కానీ మెరినా ఆ విషయంలో తడబడింది. అయితే మెరీనా ఈ వారం ఎలిమినేట్ అవుతున్నట్లు ముందుగానే అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక బిగ్ బాస్ లో ఉన్న 11 వారాలకు ఆమె ఏ స్థాయిలో పారితోషికం అందుకుంది? అలాగే ఆమె వెళ్లిపోవడానికి గల కారణాలు ఏమిటి అనే వివరాల్లోకి వెళితే...

మొదట్లో ఒక్కటిగా
మెరీనా తన భర్త రోహిత్ తో కలిసి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మొదట వీరిద్దరిని ఒకే కంటెస్టెంట్ గా పరిగణిస్తూ నామినేషన్ లో కూడా ఒక ఓటుగానే చూసేవారు. అయితే హౌస్ లో ఎలిమినేషన్ సంఖ్య పెరిగిన తర్వాత మళ్ళీ విడదీసిన బిగ్ బాస్ ఎవరి ఆట వారిదే అన్నట్లు క్లారిటీ అయితే ఇచ్చాడు. దీంతో మెరినా రోహిత్ వారి సొంత ఆటతో ఓట్లు అందుకునే ప్రయత్నం చేశారు.

అలా ఉంటే ప్రమాదమే..
మొదట్లో కాస్త అనవసరమైన ఓవరాక్షన్ చేసినప్పటికీ కూడా ఆ తర్వాత రోహిత్ మెరినా చాలా హుందాతనంగా గేమ్ ఆడే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మెరీనా ఎవరితోను అంత పెద్దగా గొడవలు పెట్టుకున్నది లేదు. రెచ్చిపోయి ఓవరాక్షన్ అయితే చేసింది లేదు. ఉన్న 11 వారాలకు కూడా ఆమె దాదాపు అందరితో స్నేహంగానే మెలిగింది. అయితే అది కూడా అనుకోకుండా మైనస్ గా మారింది. బిగ్ బాస్ లో అలాంటి ఫ్రెండ్లీ వాతావరణంలో ఉంటే రేటింగ్స్ రావు. అలాంటివారిని బిగ్ బాస్ లో నుంచి ఏ క్షణమైన తీసేసే అవకాశం ఉంటుంది.

ఆ ఎఫెక్ట్ పడింది
ఇక బిగ్ బాస్ ఓట్ల విషయంలో మాత్రం మెరీనాకు తన భర్త కారణంగానే తక్కువ ఓట్లు పడ్డాయి. ఎందుకంటే సోషల్ మీడియా హడావిడిని బట్టి చూస్తే ఇద్దరికీ కూడా ఒకే తరహా లో సమానంగా ఓట్లు వేసే ఫాలోవర్స్ ఉన్నారు. కానీ కొన్నిసార్లు రోహిత్ బలమైన కంటెస్టెంట్స్ తో పోటీ పడ్డప్పుడు అతనికి ఎక్కువ మార్కులు వేయక తప్పలేదు. ఇక అలా చూసుకుంటే మెరీనా కొంత ఓట్లు తగ్గుతూ వచ్చాయి.

అప్పటికే ఫుల్ డ్యామేజ్
ఫిజికల్ టాస్క్ లో కూడా మెరీనా ముందుండి పెద్దగా పట్టు సాధించిన సందర్భాలు అయితే లేవు. ఆమె ఎక్కువగా వంటింట్లోనే ఉంటుంది అనే ముద్ర కూడా పడింది. ఆ విధంగానే చాలాసార్లు ఇతర కంటెస్టెంట్స్ అందరూ ఆమెను నామినేట్ చేయడం జరిగింది. ఆ ముద్ర నుంచి బయటపడేందుకు గత వారంలో బాగానే ప్రయత్నాలు చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన డామేజ్ అయితే జరిగిపోయింది.

మెరినా రెమ్యునరేషన్
ఇక బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్లో దాదాపు అందరికి కూడా మంచి రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆ రూట్లో చూసుకుంటే మెరీనాకు కూడా మంచి రెమ్యునరేషన్ దక్కినట్లు సమాచారం. ఇక వారానికి గాను ఆమెకు 35 వేల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక హౌస్ లో 11 వారాలు ఉన్న మెరీనా మొత్తంగా 3 లక్షల 8 వేల రూపాయల వరకు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక విధంగా ఆమె కెరీర్ లోనే ఇది ఒక బిగ్ రెమ్యూనరేషన్ అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











