twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: డైవర్ట్ అవుతున్నా మెరీనా కాల్స్.. లేడీ స్నేక్ ను సేవ్ చేసేందుకు బిగ్ బాస్ స్కెచ్?

    |

    బిగ్ బాస్ సీజన్ 6లో అన్ని షాకింగ్ గా జరుగుతున్నాయి. కంటెస్టెంట్ల నుంచి మొదలుకొని ఇటీవలిటీ ఎపిసోడ్స్ లలో ప్రైజ్ మనీని బిగ్ బాస్ తగ్గించడం వరకు అన్ని అనూహ్యమైన సంఘటనలతో విచిత్రంగా సాగుతోంది ఈ సీజన్. ఇప్పటికే విన్నర్ గెలిచే ప్రైజ్ మనీ నుంచి కంటెస్టెంట్ల చేతనే డబ్బు తగ్గించే పనిలో పడిన బిగ్ బాస్ తాజాగా ఒక కంటెస్టెంట్ ను సేవ్ చేసేందుకు మరొక కంటెస్టెంట్ కు అన్యాయం చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఆ కంటెస్టెంట్ ను నెక్స్ట్ జరిగే ఫ్యామిలీ వీక్ కోసం ఉంచనున్నాడని టాక్. దీంతో టీఆర్పీ రేటింగ్ పెరుగుతుందనే ఆలోచనలో ఉన్నాడని సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం.

    పదో వారంలో ఇద్దరు..

    పదో వారంలో ఇద్దరు..

    బిగ్ బాస్ తెలుగు 6 లోకి వచ్చిన 21 మంది కంటెస్టెంట్లలో పది వారాలకు గాను మొత్తం 11 మంది ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ వీడి వెళ్లిపోయారు. వారిలో మొదటి వారంలో షానీ సల్మాన్, అభినయ శ్రీ ఎలిమినేట్ కాగా నేహా చౌదరి, ఆరోహి రావు, చంటి, సుదీప పింకీ, అర్జున్‌, సూర్య, చిత్తూరు చిరుత గీతూ రాయల్ తోపాటు పదో వారంలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న బాలాదిత్య అండ్ గ్లామర్ డాల్ వాసంతి కృష్ణన్ డబుల్ ఎలిమినేషన్ తో ఇంటి బయటకు వెళ్లిపోయారు.

    నామినేషన్లలో 8 మంది..

    నామినేషన్లలో 8 మంది..

    ఇక బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ 11వ వారం నామినేషన్లు ఎప్పటిలా అరుపులు, కేకలు, గొడవలతో కాకుండా చాలా సాఫీగా, కూల్ గా సాగియి. ఈ ప్రక్రియలో ప్రస్తుతం ఉన్న 10 మంది ఇంటి సభ్యుల్లో 9 మంది నామినేట్ అయ్యారు. ఫైమా కెప్టెన్ అయిన కారణంగా ఆమెను ఎవరు నామినేట్ చేయలేదు. అలాగే రాజ శేఖర్ కు ఇమ్యునిటీ దొరకడం వల్ల ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. దీంతో ఫైమా తప్పా రొహిత్, ఇనయా, ఆదిరెడ్డి, కీర్తి, మెరీనా, శ్రీసత్య, శ్రీహాన్, రేవంత్ మొత్తం 8 మంది నామినేషన్లలో ఉన్నారు.

    తొలి రెండు స్థానాల్లో వాళ్లు..

    తొలి రెండు స్థానాల్లో వాళ్లు..

    ఇప్పుడు ఈ వారం మరొకరు ఎలిమినేట్ కానున్నారు. ఈ ఎలిమినేషన్ విషయంలో తనకు కావాల్సిన కంటెస్టెంట్ ను బిగ్ బాస్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రితో ఓటింగ్స్ ముగుస్తాయని తెలిసిన విషయమే. టాప్ ఓటింగ్ లో మొదటి స్థానంలో రేవంత్ నిలవగా రెండో ప్లేస్ లో ఇనయా సుల్తానా ఉంది. తర్వాతి స్థానాల్లో కీర్తి భట్, ఆదిరెడ్డి ఉండగా ఐదో ప్లేస్ లో శ్రీహాన్, ఆరో స్థానంలో రోహిత్ ఉన్నారు. ఇక ఏడో స్థానంలో శ్రీసత్య, ఎనిమిదో స్థానంలో మెరీనా ఉన్నట్లు సమాచారం.

    ఆపరేషన్ శ్రీసత్య..

    ఆపరేషన్ శ్రీసత్య..

    అంటే రోహిత్, శ్రీసత్య, మెరీనా ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నట్లు. కానీ ఈవారం శ్రీసత్యను ఎలిమినేట్ చేసేందుకు పెద్ద ఎత్తునే ఉద్యమం జరిగింది. దానికి ఆపరేషన్ శ్రీసత్య అని పేరు పెట్టి మరి ఆమెను ఎలిమినేట్ చేసేందుకు తెగ ప్రయత్నించారు నెటిజన్లు. అయితే వచ్చే వారం ఫ్యామిలీ వీక్ ఉండటం, అది టీఆర్పీ రేటింగ్ పరంగా ముఖ్యం కాబట్ని శ్రీసత్యను హౌజ్ లో ఉంచేందుకు బిగ్ బాస్ టీమ్ ప్లాన్ వేసిందట.

    లేడీ స్నేక్ అని పోల్చుతూ..

    లేడీ స్నేక్ అని పోల్చుతూ..

    శ్రీసత్యను సేవ్ చేసే పనిలో భాగంగానే మెరీనాకు పడే ఓట్లను డైవర్ట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై హీరోయిన్ మాధవీలత షాకింగ్ గా పోస్ట్ కూడా పెట్టారు. బిగ్ బాస్ షోని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఆమె అభిప్రాయాలను బాహటంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు ఆమె. అంతేకాకుండా శ్రీసత్యను లేడీ స్నేక్ అని పోల్చుతూ రాసుకొచ్చారు.

    మిస్ట్ కాల్ నెంబర్ కనెక్ట్ కాకుండా..

    మిస్ట్ కాల్ నెంబర్ కనెక్ట్ కాకుండా..

    కొన్ని మెసేజ్ లు చూస్తున్నాను. మెరీనాకు కోసం చేసే మిస్ట్ కాల్స్ ని బిగ్ బాస్ టీమ్ వాళ్లు డైవర్ట్ చేశారట. ఆ లేడీ స్నేక్ (శ్రీసత్య)ని సేవ్ చేయడంలో భాగంగా మెరీనాకు కేటాయించిన మిస్ట్ కాల్ నెంబర్ కనెక్ట్ కాకుండా చేశారని పోస్ట్ లో తెలిపారు. ఆపరేషన్ శ్రీసత్య ఫెయిల్ కావొచ్చు.. ఎందుకంటే మెరీనా ఓట్లు, మిస్ట్ కాల్స్ ని డైవర్ట్ చేశారని అందులో పేర్కొన్నారు మాధవీలత. ఇదిలా ఉంటే మరోవైపు ఈవారం డబుల్ ఎలిమినేషన్ కింద మెరీనాతో పాటు రోహిత్ ను కూడా హౌజ్ నుంచి పంపించే ప్రయత్నం జరుగుతోందని కూడా వినిపిస్తోంది.

    English summary
    Actress Madhavi Latha About Bigg Boss Telugu 6 Team And Says Marina Voting Call Diverting For Saving Sri Satya
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X