Bigg Boss Telugu 6: ఒక్కొక్కరి తోలు తీసేస్తాను అంటూ రేవంత్ సీరియస్.. నాగమణి టాస్క్ ఆరంభం
ఈవారం కెప్టెన్ అవ్వాలి అని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా చాలా బలంగా పోరాడే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే అబ్బాయిలకు ఏ మాత్రం తక్కువ కాకుండా పోటీ పడుతున్నారు. అందులో సత్య వాసంతి ఇనయా సుల్తానా ముగ్గురు కూడా పోటీగా నిలవడం విశేషం. కొందరు అయితే చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నాడో ఎవరికి అర్థం కాలేదు. అందుకే అందరూ కూడా సీరియస్ గా గేమ్ ఆడుతున్నారు. ఇక ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లోని హైలెట్స్ లోకి వెళితే..

ఇనయా ఏడుపు
గేమ్ లో గెలవాలి అని ఒకవైపు సుల్తాను మరొకవైపు శ్రీ సత్య కూడా చాలా బలంగా కోరుకుంటున్నారు. అనిపిస్తుంది. ఇక వాసంతి తో పోటీపడిన శ్రీ సత్య పూర్తిస్థాయిలో పట్టు సాధించలేకపోయింది. దీంతోనే ఆమె ఏడుస్తూ ఉండడంతో రేవంత్ తో పాటు శ్రీహన్ కూడా ఓ ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక మరొకవైపు ఇనయా కెప్టెన్ అవ్వాలి అని ఎంత ప్రయత్నం చేసిన కూడా కుదరడం లేదు అని తన తండ్రి ఫోటో చూసుకుంటూ ఏడ్చింది.

నాగమణి టాస్క్
రేవంత్ అయితే శ్రీ సత్య ఏడుస్తూ ఉంటే పాటపాడుతూ ఓదార్చేందుకు ప్రయత్నం చేశాడు. కానీ ఆమె నీతో అయిపోయింది చాలు ఇంకా అంటూ గాలి తీసేసింది. ఇక కెప్టెన్సీ టాస్క్ లో నాగమణి అనే మరొక ఛాలెంజ్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా ఒక టీమ్ సబ్యులకు ఇచ్చిన మణులను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇక ఇతర టీమ్ సభ్యులు వాటిని దక్కిఎంచుకోవాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చాడు.

తోలు తీసేస్తాను
ఇక ఆట మొదలు కాగానే కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా ఎగబడ్డారు. ఇక రేవంత్ తన మణి ని కాపాడుకునేందుకు గట్టిగానే ప్రయత్నం చేశాడు. శ్రీ సత్య అయితే మరొక మణిని తీసుకొని పారిపోయింది. ఇక ఆమె అలా చేయడంతో అందరూ కూడా షాక్ అయ్యారు. ఇక రేవంత్ అయితే ఎవరో గట్టిగా లాగుతున్నారు అని ఇంతకింతకు ఉంటది అని అని హెచ్చరిక చేశాడు. అలాగే మళ్ళీ ఎవరైనా ఫిజికల్ అన్నారు అంటే తోలు తీసేస్తాను అంటూ హెచ్చరించారు.

రేవంత్ మరింత స్ట్రాంగ్ గేమ్
కీర్తి, రేవంత్ మధ్యలో కూడా శటప్ అనే మాట మాట పెరిగింది. ఇక రేవంత్ మరింత స్ట్రాంగ్ గా గేమ్ ఆడుతూ ఉండడంతో కీర్తి ఇబ్బంది పడిపోయింది. ఆట ఒక్కటే ఇంపార్టెంట్ కాదు అని ఆదిరెడ్డి కూడా హెచ్చరించారు. ఇక ఆదిరెడ్డి కూడా కోప్పడ్డాడు. కీర్తి కూడా చివరకు ఫిజికల్ చేయకన్నా అని చెప్పింది. దీంతో రేవంత్ కూడా ఓవరాక్షన్ చేయొద్దు అని అన్నాడు. ఇక చేతకాని వాడు ప్రతీ వాడు మాట్లాడేవాడే అని రేవంత్ సిరియస్ అయ్యాడు.
చేతకాక ఫిజికల్ అంటున్నారని
ఇక రేవంత్ చివరకు సహనం కోల్పోయి ఒక్కొక్కరిని బయటకు తీసి పారేశాడు. ఫైమా కీర్తిని పక్కకు నెట్టేసే ప్రయత్నం చేశాడు. ఇక మనం ఆపడానికి ట్రై చేస్తుంటే చేతకాక ఫిజికల్ అంటున్నారని అని మిగతా టీమ్ సబ్యులకు చెప్పుకొచ్చాడు. ఇక రేవంత్ మాటలకు ఆదిరెడ్డి రాజశేఖర్ అలాగే మిగతా వాళ్ళు కూడా సీరియస్ గా చూశారు. మరి ఈ మాటల యుద్ధంతో గేమ్ ఎలా కొనసాగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











