For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6:ఫైమాను ఏమన్నావో తెలుసా?.. ఇనయా, రేవంత్ కు నాగార్జున స్ట్రాంగ్ క్లాస్

  |

  తెలుగులో అత్యధికంగా ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. ఈ షో ముందుగా అమెరికాలో బిగ్ బ్రదర్ పేరుతో ప్రారంభై సూపర్ హిట్ సాధించింది. దీంతో ఈ షోను ఇండియాలోకి తీసుకొద్దామన్న భావనతో భారత్ లో స్టార్ట్ చేశారు. హిందీలో ఈ షో సూపర్ హిట్ కావడంతో తెలుగులోకి సైతం తీసుకొచ్చి ఘన విజయం సాధించారు. తెలుగులో వరుసపెట్టి సీజన్లతో ముందుకు సాగుతోంది బిగ్ బాస్ రియాలిటీ షో. తాజాగా ప్రసారమవుతోన్న బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ పదోవారానికి చేరుకుంది. ఈ పదోవారం ఇంటి కెప్టెన్ గా ఫైమా నిలవగా.. శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులకు క్లాస్ తీసుకున్నాడు.

  9 మంది ఔట్..

  9 మంది ఔట్..

  ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 6 సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు 21 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరిలో తొమ్మిది వారాల్లో షానీ సల్మాన్, అభినయ శ్రీ, నేహా చౌదరి, ఆరోహి రావు, చంటి, సుదీప పింకీ, అర్జున్‌, సూర్య, చిత్తూరు చిరుత గీతూ రాయల్ ఎలిమినట్ అయి వెళ్లిపోయారు.

  ఇద్దరికి నాగార్జున క్లాస్..

  ఇద్దరికి నాగార్జున క్లాస్..

  ఎప్పటిలానే శని, ఆదివారాల్లో వచ్చిన హోస్ట్ నాగార్జున ఆడి పాడించడమే కాకుండా ఇంటి సభ్యుల ఆట, మాట తీరుపై వార్లింగ్, సలహాలు ఇస్తారన్న విషయం తెలిసిందే. అలాగే తాజాగా ప్రసారం కాబోయే నవంబర్ 12 శనివారం నాటి ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేసింది స్టార్ మా. ఈ ప్రోమోలో రేవంత్, ఇనయా సుల్తానాపై సీరియస్ అయ్యారు నాగార్జున. స్టేజిపైకి కలర్ ఫుల్ గా రెడీ అయి వచ్చారు హోస్ట్ నాగార్జున.

  నాగార్జున ప్రశ్నకు రోహిత్ ఒక్కడే..

  నాగార్జున ప్రశ్నకు రోహిత్ ఒక్కడే..

  ఈ హౌజ్ లో రేవంత్ పై కంప్లయింట్స్ ఉన్నవారు లేచి నిల్చోంది అని నాగార్జున అడిగారు. నాగార్జున అడిగిన ప్రశ్నకు రోహిత్ ఒక్కడే నిల్చున్నాడు. పర్సనల్ గా కాదు సంచాలక్ గా రేవంత్ బిహేవియర్ నచ్చలేదు అని రోహిత్ చెప్పాడు. తర్వాత హౌజ్ మేట్స్ చెప్పండి.. సంచాలక్ గా రేవంత్ కరెక్ట్ చేశాడా అని నాగార్జున అడిగినప్పుడు ఆదిరెడ్డి మాత్రం కరెక్ట్ గా ఉందని బదులిచ్చాడు. దీంతో నాగార్జున మీకు ఫేవర్ గా డెసిషన్ ఉంది కాబట్టి అది నీకు ఓకే అని అడిగాడు నాగార్జున.

  నాకు ఫేవరబుల్ గా లేదు..

  నాకు ఫేవరబుల్ గా లేదు..

  నాగార్జున అలా అనడంతో ఆదిరెడ్డి అలాంటిది లేదు సర్.. నాకు ఫేవరబుల్ గా లేదు అని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. రోహిత్ కు ఫేవరబుల్ గా డెసిషన్ లేదు అందుకే కంప్లయింట్ వచ్చిందని నాగార్జున అనడంతో సైలెంట్ అయిపోయాడు ఆదిరెడ్డి. తర్వాత రేవంత్ ను లేపి.. బిగ్ బాస్ పెట్టిన రూల్స్ కు ఎప్పుడూ వ్యతిరేకంగా చేయకు. నువ్ సంచాలక్ గా రూల్స్ మార్చావ్ గానీ, కన్ఫ్యూస్ అయ్యావ్ అని నాగార్జున అన్నారు.

  ఫిజికల్ గా అగ్రెసివ్ అవ్వొద్దని..

  ఫిజికల్ గా అగ్రెసివ్ అవ్వొద్దని..

  అగ్రెసివ్ గా అవ్వొద్దని నేను చెప్పింది ఫిజికల్ గా అగ్రెసివ్ అవ్వొద్దని అని నాగార్జున అన్నారు. ఫిజికల్ అవ్వకుండానే వాళ్లు వీళ్లు అదే పాయింట్ అంటున్నారు అని రేవంత్ అంటే అది వాళ్ల స్ట్రాటజీ అని నాగార్జున చెప్పుకొచ్చారు. తర్వాత ఇనయా సుల్తానాను లేపిన నాగార్జున క్లాస్ తీసుకున్నాడు. ఇనయా నీకు కోపం వచ్చినప్పుడు ఎందుకు అలా మాటలు వదిలేస్తుంటావ్. ఆటలో ఓడిపోతే ఫ్రస్టేషన్ లో ఎఫ్ వర్డ్ వాడేస్తావా.

   నువ్ ఫైమాను ఏమన్నావో తెలుసా..

  నువ్ ఫైమాను ఏమన్నావో తెలుసా..

  నామినేషన్స్ లో నువ్ ఫైమాను ఏమన్నావో తెలుసా.. ఫైమా ప్రఫెషన్ ని చాలా పర్సనల్ గా మాట్లాడవని నాకు అనిపిస్తుంది. అడల్ట్ కామెడీ స్టార్ అని అన్నావ్. ఇది వెరీ పర్సనల్ కామెంట్. ఇనయా నిన్ను ఏమనాలి మేము అని నాగార్జున గట్టిగానే అడిగారు. ఇక ఈవారం నామినేషన్లలో తొమ్మిది మంది ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు 6లో ఈసారి డబుల్ ఎలిమినేషన్ కారణంగా బాలాదిత్య, మెరీనా ఎలిమినేట్ అయనట్లు సమాచారం.

  English summary
  Bigg Boss Telugu 6 Season Host Nagarjuna Gives Strong Class To Revanth And Inaya Sultana Over Comment On Faima And November 12 Episode Promo Released.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X