Bigg Boss Telugu 6: వయసు అయిపోయిన చిరుత.. గీతూను ఆటాడేసుకున్న నాగార్జున

ఎన్నో అంచనాల మధ్య వచ్చన బిగ్ బాస్ షో సూపర్ సక్సెస్ గా కొనసాగుతోంది. దేశంలో ముందుగా హిందీలో వచ్చిన ఈ రియాలిటీ షో ఆ తర్వాత వివిధ భాషల్లోనూ అలరిస్తోంది. ముఖ్యంగా హిందీలో 16వ సీజన్ ప్రసారం అవుతుండగా తెలుగులో ఆరో సీజన్ తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ప్రతి శని, ఆది వారాల్లో హోస్ట్ వచ్చి రివ్యూస్, వార్నింగ్స్, అడ్వైస్ లు ఇస్తారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ హోస్ట్ నాగార్జున అక్టోబర్ 16 ఆదివారం వచ్చి ఫన్ చేయనున్నాడు. దీనికి సంబంధించిన తాజా ప్రోమోను విడుదల చేసింది స్టార్ మా. మరి ఆ ప్రోమోలో ఉన్న విషయాలకు వెళితే..

వరుసగా సీజన్ల ప్రసారం..

వరుసగా సీజన్ల ప్రసారం..

ముందుగా హిందీలో వచ్చిన బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో ఎంత సక్సెస్ అయిందో తెలిసిందే. అందుకనుగుణంగా నిర్వాహకులు వరుసగా సీజన్లను ప్రసారం చేస్తున్నారు. ఇప్పటికే ఐదు టీవీ, ఒక ఓటీటీ సీజన్ విజయవంతగా పూర్తి చేసుకోగా తాజాగా ప్రస్తుతం ఆరో సీజన్ సక్సెస్ ఫుల్ గా ప్రసారమవుతోంది.

 అనూహ్యమైన ఎలిమినేషన్లతో..

అనూహ్యమైన ఎలిమినేషన్లతో..

కొంచెం అటు ఇటుగా మార్చి ఇచ్చే టాస్క్ లు, ట్విస్ట్ లు, అనూహ్యమైన ఎలిమినేషన్లతో జోరుగా సాగుతోంది బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్. ఇక శనివారం, ఆదివారం వచ్చిందంటే చాలు కంటెస్టెంట్లు సంతోషంతోపాటు కొద్దిపాటి టెన్షన్ తో ఉంటారు. ఏవారం ఎవరు వెళ్లిపోతారనే భయం వాళ్ల మొహాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

కంటెస్టెంట్లకు చురకలు..

కంటెస్టెంట్లకు చురకలు..

అందుకే వాళ్ల భయాన్ని కాసేపు పక్కన పెట్టించి వారిచేత ఆట ఆడిస్తాడు హోస్ట్ నాగార్జున. అంతేకాకుండా సరిగ్గా పర్ఫామ్ చేయని కంటెస్టెంట్లకు చురకలు కూడా అంటిస్తాడు. ఇంటి సభ్యుల ఆటతీరుపై రివ్యూలు చేయడంతోపాటు స్వీట్ వార్నింగ్ లు కూడా ఇస్తాడు. ఇక ఈ ఆదివారం అంటే అక్టోబర్ 16న ప్రసారమయ్యే ఎపిసోడ్ లో ఇంటి సభ్యులతో ఆట ఆడుకుకున్నాడు నాగార్జున.

రేవంత్ కి కాలు బాగాలేదు..

రేవంత్ కి కాలు బాగాలేదు..

ముందుగా నాగార్జున నాటు నాటు పాటకు స్టెప్పు వేసి ఎంట్రీ ఇచ్చాడు. ఇంటి సభ్యులకు హాయ్ చెప్పిన నాగార్జున స్టోర్ రూమ్ కి వెళ్లమని రేవంత్ కు చెబుతాడు. దీంతో సార్.. రేవంత్ కి కాలు బాగాలేదు. వేరే ఎవర్నైనా పంపండి సార్ అని గీతూ రాయల్ చెబుతుంది. దీంతో గీతూ నువ్ వెళ్లు అని నాగార్జున చెబుతాడు. ఇంతలో ఆమెకు చాలా బద్ధకం సార్ అని బాలాదిత్య చెబుతాడు. మరోవైపు నిజంగానే వెళ్లమంటారా సార్ అని గీతూ రాయల్ అంటుంది.

వయసొచ్చిన చిరుతలా..

వయసొచ్చిన చిరుతలా..


నిజంగానే వెళ్లు అని నాగార్జున అనడంతో అతికష్టంగా నడుచుకుంటూ వెళ్తుంది గీతూ రాయల్. గీతూ రాయల్ అలా వెళ్లడం చూసి వయసొచ్చిన చిరుతలా ఉంది అని నాగార్జున అంటాడు. దీంతో వయసు అయిపోయిన చిరుత అని బాలాదిత్య అనడంతో అన్నయ్యా.. ఎంత మాట అన్నావ్ నువ్ అని నాగార్జున అంటాడు. దీంతో అందరు ఇంటి సభ్యులు నవ్వేస్తారు.

సూర్య దగ్గరిగా ఉన్నాడు..

సూర్య దగ్గరిగా ఉన్నాడు..


ఎప్పటిలానే బజర్ నొక్కి పాటలు, సినిమా పేర్లు కనిపెట్టే గేమ్ ఆడించాడు నాగార్జన. ఈ బజర్ కు రెండు వైపులా ఇనయా, ఆర్జే సూర్య ఇద్దరు నిల్చుంటారు. దీంతో సూర్య దగ్గరిగా ఉన్నాడు.. ఇనయాకు కాదు బజర్ కు అని వారిద్దరికి పంచ్ వేశాడు నాగార్జున. ఇక ప్రతిసారి స్టోర్ రూమ్ కు గీతూ రాయల్ ను పంపిస్తాడు నాగార్జున. ఒరియమ్మ నాయన స్వామి అనుకుంటూ కష్టంగా వెళ్తుంది గీతూరాయల్.

బిగ్ బాస్ వంటలక్కగా..

ఇక ఆదిరెడ్డి, గీతూ రాయల్ కలిసి స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఈ వారం గీతూ రాయల్, రాజ శేఖర్, బాలాదిత్య, కీర్తి భట్, సుదీపి పింకీ, ఇనయా సుల్తానా, శ్రీహాన్, అర్జున్ కల్యాణ్, ఆదిరెడ్డి తొమ్మిది మంది ఎలిమినేషన్లలో ఉన్నారు. వీరిలో సుదీప పింకీ ఎలిమినేట్ అయినట్లు సమాచారం. అయితే ఆమె ఎప్పుడూ వంట చేస్తూ బిగ్ బాస్ వంటలక్కగా పేరు తెచ్చుకుంది కానీ గేమ్ సరిగ్గా ఆడలేదని బయట ప్రేక్షకుల టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X