twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6 అది రేవంత్ నుంచే నేర్చుకున్నా.. వాళ్లు కూడా అలా చేయరంటూ నాగార్జున!

    |

    బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ అనూహ్య పరిణామాలతో అటు హౌజ్ మేట్స్ కి.. ఇటు ప్రేక్షకులకు షాక్ ఇస్తోంది. ఎన్నో అంచనాల నడుమ ప్రారంభమైన ఈ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఈ 14వ వారం అంతా కోల్పోయిన బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీని తిరిగి సంపాందించుకోవడాని ఛాలేంజ్ లో గట్టిగా పోటీ పడ్డారు ఇంటి సభ్యులు. ఇక శని, ఆది వారాల్లో హోస్ట్ నాగార్జున వచ్చి సందడి చేస్తారన్న విషయం తెలిసిందే. దీంతోపాటు ఆదివారం రోజున ఎలిమినేట్ అయే కంటెస్టెంట్ ను ప్రకటిస్తారు. ఈ 14వ వారం కూడా సింగిల్ ఎలిమినేషన్ ఉండనుంది. ఇదిలా ఉంటే డిసెంబర్ 11 ఆదివారం నాటి 98వ రోజు ఎపిసోడ్ ప్రోమోను తాజాగా వదిలారు.

    మీకు ఎంత తెలుసు..

    మీకు ఎంత తెలుసు..

    డిసెంబర్ 11 నాటి 98 ఎపిసోడ్ ప్రోమో వివరాల్లోకి వెళితే.. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలోని బాసు పార్టీ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులతో ఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున. అలాగే మెరూన్ కలర్ లో మొహాలతో ఉన్న షర్ట్ లో మెరిసిపోయారు నాగార్జున. తర్వాత ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. దాని పేరు 'మీకు ఎంత తెలుసు' అని చెప్పారు నాగార్జున. బిగ్ బాస్ హౌజ్ కు సంబంధించిన పలు ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానాలు తెలిసిన వాళ్లు గంట కొట్టి ఆన్సర్స్ చేయాలి.

    ఎన్ని మెట్లు ఉన్నాయి..

    ఎన్ని మెట్లు ఉన్నాయి..

    వీఐపీ బాల్కనీకి ఎన్ని మెట్లు ఉన్నాయి అని నాగార్జున అడిగితే.. శ్రీహాన్, ఇనయా సుల్తానా, రోహిత్ ముగ్గురు పరుగెత్తుకుని వచ్చారు. కానీ ఎవరు కొట్టకుండా తిరిగి వెళ్లిపోయారు. దీంతో అంతా నవ్వేశారు. మరోసారి శ్రీసత్య, ఇనయా, ఆదిరెడ్డి పరిగెత్తుకువచ్చారు. ఇప్పుడు ఆదిరెడ్డి గంట కొట్టాడు. మనకు పాయింట్స్ వస్తే కదా అని అంటూ 10 సార్ అని ఆదిరెడ్డి జవాబిచ్చాడు. దీంతో మైనస్ 2 పాయింట్స్ అని నాగార్జున అన్నాడు.

     నేను సంచాలక్, నా ఇష్టం..

    నేను సంచాలక్, నా ఇష్టం..

    తర్వాత శ్రీసత్య కొట్టావా బెల్ అని నాగార్జున అడిగితే.. సందేహంగా కొట్టాను అన్నట్లుగా తల ఊపింది. కొట్టిందని ఆదిరెడ్డి చెప్పాడు. ఆన్సర్ చెప్పు అని నాగార్జున అడిగితే.. 7 లేదా 8 అని శ్రీసత్య అంది. కచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ 7 అని నాగార్జున అన్నారు. వన్ పాయింట్ అని నాగార్జున అంటే.. 7 లేదా 8 అన్నారు సార్ అని రేవంత్ అంటే.. నేను సంచాలక్ ఇక్కడ నా ఇష్టం. అది నేను రేవంత్ దగ్గరి నుంచే నేర్చుకున్నాను అని కౌంటర్ వేశారు నాగార్జున.

    పూల కుండీలు చూల్లేదు కానీ..

    పూల కుండీలు చూల్లేదు కానీ..

    నెక్స్ట్ క్వశ్చన్ శ్రీహాన్.. నీకు బోలెడంతా ఛాన్స్ ఉందని నాగార్జున అంటే.. బాత్రూమ్స్ ఆ అని శ్రీసత్య అంది. వాష్ రూమ్ లో ఎన్ని చిన్న పూల కుండీలు ఉన్నాయి అని నాగార్జున అడిగారు. పరుగెత్తుకు వచ్చిన శ్రీహాన్ బెల్ పట్టుకుని ఉన్నాడు. దీంతో శ్రీహాన్ నువ్వే చెప్పాలని నాగార్జున అన్నారు. దీనికి.. సార్.. పూల కుండీలు చూడలేదు కానీ, కమౌడ్ కుండీలు చూశాను అని శ్రీహాన్ అన్నాడు.

    గార్డెన్ ఏరియాలో డంబెల్స్ ఎన్ని..

    గార్డెన్ ఏరియాలో డంబెల్స్ ఎన్ని..

    హౌజ్ లో ఎన్ని గోల్డెన్ హ్యాండ్ షో వస్తువులు ఉన్నాయని నాగార్జున అడగడంతో ఆదిరెడ్డి వచ్చి బెల్ కొట్టాడు. మూడు సార్ అని ఆన్సర్ ఇచ్చాడు ఆదిరెడ్డి. అది తప్పు, మైనస్ 2 పాయింట్స్ అని నాగార్జున అన్నారు. తర్వాత రెండు అని శ్రీహాన్ అంటే కరెక్ట్ అని చెప్పారు. దీనికి సార్ దగ్గరిగా చెప్పాం కదా అని ఆదిరెడ్డి అంటే.. అది నా ఇష్టం అని నాగార్జున అన్నారు. గార్డెన్ ఏరియాలో ఎన్ని డంబెల్స్ ఉన్నాయన్న దానికి అందరూ చెబుతాం చెబుతాం అని అరిచారు.

    స్కూల్ పిల్లలు కూడా ఇలా చేయరు..

    హౌజ్ మేట్స్ అంతా ఆన్సర్ చెబుతామని గొడవ చేస్తుంటే.. స్కూల్లో కూడా ఇంత గొడవ చేయరు పిల్లలు అని నాగార్జు అన్నారు. తర్వాత ఇంటి సభ్యులకు ఫన్నీ గేమ్స్ ఇచ్చారు నాగార్జున. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 14వ వారం నామినేషన్లో శ్రీహాన్ తప్పా మిగతా ఆరుగురు ఉన్నారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో భాగంగా లేడీ టైగర్ ఇనయా సుల్తానా హౌజ్ ను వీడిందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

    English summary
    Bigg Boss Telugu 6 Nagarjuna Starts With Entertaining Games December 11 Episode Day 98 Promo 1 Released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X