Bigg Boss Telugu 6 షోలో షాకింగ్ సీన్, ఫైమాకు అక్కడ ముద్దుపెట్టిన నాగార్జున.. లాక్కొని మరి అలా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అనూహ్య పరిణామాలతో దూసుకుపోతోంది. ఎన్నో అనుమానాలు, అంచనాల మధ్య ప్రారంభమైన ఈ సీజన్ దాదాపుగా పూర్తి దశకు చేరుకుంది. ఇప్పటికీ 13 వారాలు పూర్తి చేసుకుని 14వ వారంలోకి అడుగుపెట్టింది. ఎప్పటిలాగే ఈవారం కూడా మరొకరు ఎలిమినేట్ అయ్యారు. ఫైనలిస్ట్ గా ఉంటానని చెప్పిన బిగ్ బాస్ సీజన్ 6 ఎంటర్టైనర్, జబర్దస్త్ లేడీ కమెడియన్ ఫైమా హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోయింది. 13వ వారం నామినేషన్లో ఉన్న ఇంటి సభ్యులందరూ సేఫ్ కాగా చివరిలో ఆదిరెడ్డి, ఫైమా మిగిలారు. ఈ ఇద్దరిలో ప్రేక్షకుల ఓటింగ్ నిర్ణయంతో ఫైమా ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు.

చివరిలో ప్రకటన..

చివరిలో ప్రకటన..


శని, ఆదివారాలు వచ్చిందంటే చాలా హోస్ట్ వచ్చి ఇంటి సభ్యులను ఎంటర్టైన్ చేస్తాడు. ఆ వారం మొత్తం ఇంటి సభ్యులు ఆడిన ఆటలు, చేసిన చేష్టలపై క్లాస్ పీకడమో, వార్నింగ్ ఇవ్వడమో, మెచ్చుకోవడమే చేస్తారు. ఈ రెండు రోజులు కూడా అలాగే చేశారు. ఈ ఆదివారం కూడా మంచి ఫండేగా జరిగింది. ఇక ఎప్పటిలానే చివరిలో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ను ప్రకటించి హౌజ్ నుంచి బయటకు పంపడం ఆనవాయితే.

ఫైమా జీవితం స్ఫూర్తినిచ్చింది..

ఫైమా జీవితం స్ఫూర్తినిచ్చింది..


సండే ఫండే అని చెప్పే నాగార్జున ఈ ఆదివారాన్ని సరదాగా మార్చారు. అలాగే ఫన్నీ టాస్క్ లు ఆడించారు. బిగ్ బాస్ హౌజ్ లో హిట్ 2 చిత్రబృందం సందడి చేసింది. హీరో అడవి శేష్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ శైలేష్ కొలను స్టేజిపైకి వచ్చి సందడి చేశారు. ఫైమాతో సరదాగా మాట్లాడారు అడవి శేష్. ఫైమా లైఫ్ స్టోరీ తెలుసని, అది ఆయన్ను ఇన్స్ఫైర్ చేసిందని అడవి శేష్ తెలిపారు. దీంతో ఆమె చాలా సంతోషించింది.

పెద్దగా కనెక్షన్ లేనందున..

పెద్దగా కనెక్షన్ లేనందున..

తర్వాత ఇంటి సభ్యులతో ఫ్రెండ్ ఫర్ లైఫ్, ఫ్రెండ్షిప్ కట్ టాస్క్ అడించారు నాగార్జున. అంటే లైఫ్ లాంగ్ ఎవరితే స్నేహంగా ఉండాలనుకుంటున్నారు, అసలు ఎవరినీ ఫ్రెండ్ లాగా ఉంచాలనుకోవట్లేదు అని మెలిక పెట్టారు. ఈ టాస్క్ లో ఫైమా.. లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ ఉంటుందని ఆదిరెడ్డి పేరు చెప్పింది. అలాగే హౌజ్ లో పెద్దగా కనెక్షన్ లేకపోవడంతో బయట కూడా ఉండకపోవచ్చేమో అని రోహిత్ పేరు చెప్పింది ఫైమా.

ఫైమాతో ఫన్ అండ్ ఫస్ట్రేషన్ గేమ్..

ఫైమాతో ఫన్ అండ్ ఫస్ట్రేషన్ గేమ్..

ఇక నామినేషన్లో చివరిగా ఆదిరెడ్డి, ఫైమా మిగలగా.. వారిలో ఫైమా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో హౌజ్ మేట్స్ ఎమోషనల్ అయ్యారు. తర్వాత స్టేజ్ పైకి వచ్చిన ఫైమాకు ఆమె బిగ్ బాస్ జర్నీ చూపించారు. అది చాలా బాగుందని సంతోషించింది ఫైమా. తర్వాత ఫైమాతో ఫన్ అండ్ ఫస్ట్రేషన్ టాస్క్ ఆడించాడు నాగార్జున. తర్వాత చివర్లో ఫైమా గురించి రేవంత్ ఒక విషయం బయటపెట్టాడు.

 చక్కిలిగింతలు అవుతాయని..

చక్కిలిగింతలు అవుతాయని..

ఫైమా చేతిపై ముద్దు పెట్టనివ్వదని నాగార్జునకు రేవంత్ చెప్పాడు. చేతి మడ మీద ముద్దు పెడితే ఆమెకు చక్కిలిగింతలు అవుతాయని పెట్టనివ్వదని అసలు విషయం బయటపెట్టేశాడు రేవంత్. దీంతో ఫైమా చేయి లాక్కునేందుకు ప్రయత్నించాడు నాగార్జున. ఫైమా సిగ్గుపడుతూ చేతిని వెనక్కి లాక్కుంది. అయినప్పటికీ ఆమె చేయిని బలంగా లాక్కుని చేతి మడపై ముద్దు పెట్టాడు నాగార్జున.

చేయి లాక్కుని మరి..

చేయి లాక్కుని మరి..

నాగార్జున అలా చేతిపై ముద్దు పెట్టడంతో ఫైమా రెండు చేతులుతో మొహాన్ని మూసుకుని తెగ సిగ్గుపడిపోయింది. అయితే ఫైమా చేయి లాక్కునేప్పుడు హౌజ్ మేట్స్ అంతా ఫైమా చేతికి ముద్దు పెట్టమని నాగార్జునను కోరారు. నువ్ లక్కీనే ముద్దు పెట్టించుకో అని ఫైమాకు చెప్పారు. దీంతో ఆమె చేయి అందించింది. ఇక చివరిసారిగా ఫైమా వెళ్లేటప్పుడు అకస్మాత్తుగా ఫైమా చేయిని పట్టుకున్నాడు నాగార్జున. దీంతో ఆమె భయపడిపోయింది. అలా సరదాగా, నవ్వుతూ ఫైమా బిగ్ బాస్ హౌజ్ వీడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X