Bigg Boss Telugu 6: వీడియోలతో ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున.. రోహిత్ కోసం వాసంతి త్యాగం!
బిగ్బాస్ రోజుకు సరికొత్త ట్విస్ట్ లతో ఎంతో ఆసక్తికరంగా మారుతుంది. మొన్నటి వరకు కాస్త బోరింగ్ గా అనిపించినప్పటికీ కూడా ఇప్పుడు బిగ్ బాస్ సరికొత్త టాస్క్ లను మొదలు పెడుతూ ఆటపై చాలా ఆసక్తిని పెంచుతున్నాడు. ఇక బిగ్ బాస్ లో ఈవారం ఎవరూ ఎలిమినేట్ అవుతారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే దాదాపు అందరూ కూడా చాలా బలంగానే పోరాడుతున్నారు. ఇక శనివారం రోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన అప్డేట్స్ పై ఒక లుక్కువేస్తే..

చాలా మంచి మార్కులు వేశారు
ముందుగా నాగార్జున రేవంత్ కు ఒక మాట చెబుతూ కెప్టెన్ గా నీకు కొందరు కూడా చాలా మంచి మార్కులు వేశారు అని అన్నారు. అందుకే ఈరోజు నీకోసం ఒక స్పెషల్ వీడియో అని టీవీలో ప్రజెంట్ చేశారు. ఇక రేవంత్ పడుకున్నా విజువల్స్ చూపించారు. దీంతో అందరూ కూడా నవ్వేశారు. ఎందుకంటే గతంలో రేవంత్ పడుకోవడం కారణంగా బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ లో చాలా ప్రభావం చూపించింది.

నవ్వించిన రేవంత్ వీడియో
ఇక అతను రెండు మూడు సార్లు పడుకున్న వీడియోను నాగార్జున అదే పనిగా చూపించారు. ఇన్ని రోజులు బాగా మేనేజ్ చేశాను సార్ అంటూ రేవంత్ అందరినీ మళ్ళీ నవ్వించాడు. ఇక తర్వాత వీకెండ్ తేల్చుకుందామని సవాలు చేశావు అనే మాటను కూడా నాగార్జున రేవంత్ కు గుర్తు చేశారు. ఇక ఫైమతో జరిగిన గొడవ గురించి రేవంత్ తెలియజేశాడు.

ఫైమా రేవంత్ ఫైట్
ఒక పూల కుండిని తెమ్మంటే రెండు తెస్తే వాళ్ళు ఫెయిల్ అని చెప్పింది అని రేవంత్ ఫైమా గురించి చెప్పాడు. ఇక పైమా కూడా తనదైన శైలిలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక ఆ విషయంపై మీరు ఏమనుకుంటున్నారు అని నాగార్జున మిగతా ఇంటి సభ్యులను అడిగాడు.
ఇక తర్వాత సీక్రెట్ రూమ్ లోకి ఆదిరెడ్డిని పిలిచిన నాగార్జున నువ్వు చేసిన సాక్రిఫైస్ నీకు చెప్పింది ఎవరు అని అడగడంతో గీతూ అని ఆదిత్య తెలియజేసాడు.

రోహిత్ ను మెచ్చుకున్న నాగ్
గీతుకి అలాగే బిగ్ బాస్ కు జరిగిన మాటలను చూడు అని కూడా నాగార్జున వీడియో చూపించేశాడు. అలాగే రోహిత్ రెండు వారాలపాటు ఎలిమినేట్ అవ్వడానికి త్యాగం చేసిన విధానాన్ని నాగార్జున మెచ్చుకున్నారు. ఇక మిగతా 6 మంది కూడా బ్యాటరీ బాగా వాడుకున్నారు కదా.. ఒక్క క్షణం కూడా రోహిత్ కు ఏం కావాలో అడిగారా అని నాగార్జున ప్రశ్నించారు.

నాగార్జున ట్విస్ట్
అలాగే మీకు ఒక వీడియో చూపిస్తాను అని కూడా నాగార్జున రోహిత్ మెరినా మాటలను చూపించాడు. అలాగే రోహిత్ తన భార్య మెరీనాతో మాట్లాడుతున్న మాటలు ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురిచేసాయి చాలా సెల్ఫీస్ ఉన్నారు అని అన్నాడు. అలాగే రోహిత్ కోసం ఇప్పుడున్న ఆరుగురిలో ఒకరు త్యాగం చేయాలి అని నాగార్జున అన్నాడు. అందుకు రేవంత్ తో పాటు మరికొంతమంది ఒప్పుకున్నారు. కానీ రోహిత్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు అని నాగార్జున మళ్ళీ ట్విస్ట్ ఇచ్చారు. ఇక వాసంతి జుట్టు కట్ చేసుకోవాలి అని ఒక నోట్ చదివి చూపించింది. మరి ఆమె అందుకు ఒప్పుకుంటుందా లేదా అనేది ఈరోజు ఎపిసోడ్ లో చూడాలి.


Click it and Unblock the Notifications











