Don't Miss!
- News
Girl: అమ్మాయిని కిడ్నాప్ చేసి టీ తోటలో ఫ్రెండ్ తో కలిసి ?, ఎంతకాలం నుంచి స్కెచ్ వేశాడంటే ? క్లైమాక్స్ !
- Lifestyle
పిల్లలను మీజిల్స్, రుబెల్లా కాపాడుకోవడానికి ఎంఆర్ వ్యాక్సిన్ తీసుకోండి
- Finance
rbi repo: మళ్లీ పెరగనున్న వడ్డీరేట్లు.. రుణ గ్రహీతలకు మరోసారి వడ్డింపు షురూ !!
- Sports
Virat Kohli : కోహ్లీని ఇబ్బంది పెట్టిన బౌలర్.. వీడిని ఆడటం చాలా కష్టమన్న విరాట్!
- Travel
ప్రకృతి రమణీయతకు నిదర్శనం.. హంసలదీవి!
- Technology
ఈ ఆపిల్ మ్యాక్ బుక్ తయారీ నిలిపి వేసిన Apple ! కారణం ఏంటో తెలుసుకోండి!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Telugu 6: బయటకు వచ్చాక అతనికి బాడీగార్డ్ గా ఉంటాను.. నేహా చౌదరి
బిగ్ బాస్ మొత్తానికి మూడో వారం పూర్తి చేసుకుంది. మొదటి రెండు వారాలు కాస్త నీరసంగా కొనసాగిన ఈ షో మూడో వారం మాత్రం కొంత ట్రాక్లోకి వచ్చింది అనే చెప్పాలి. నాగార్జున ఇచ్చిన కోటింగ్ తరువాత కంటెస్టెంట్స్ అందరూ కూడా సరిహద్దులు దాటి గట్టిగానే పోరాడుతున్నారు. ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేయడానికి కూడా మరికొందరు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో మూడో వారం నేహా చౌదరి బయటకు వెళ్లిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన ఒక వివరణ హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

భయాన్ని కలిగించిన బిగ్ బాస్
మొదటివారం బిగ్ బాస్ ఎవరో ఒకరిని బయటికి పంపిస్తాడు అని అందరూ అనుకున్నారు. ముఖ్యంగా ఇనయా సుల్తానా బయటకు వెళ్ళిపోతుంది అని టాక్ గట్టిగానే వచ్చింది. కానీ మొదటి వారం ఎలిమినేషన్ లేదు అని చెప్పి రెండో వారం మాత్రమే ఇద్దరిని బయటకు పంపించి షాక్ ఇచ్చారు. రెండో వారం షాని అభినయ శ్రీ లను బయటకు పంపి బగ్ బాస్ హౌస్ మేట్స్ లో ఒక భయాన్ని మాత్రం కలిగించారు.

మళ్ళీ ధైర్యంగా
బిగ్ బాస్ ఎప్పుడైనా ఎవరినైనా పంపించవచ్చు అని కంగారులోనే కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరికివారు జాగ్రత్త పడ్డారు. మళ్ళీ ధైర్యంగా గేమ్ పై దృష్టి పెట్టారు. అయితే మూడో వారం ఒకేసారి పదిమందిని ఎలిమినేషన్ లో ఉంచడం కూడా ఆసక్తికరంగా మార్చింది. ఈసారి మాత్రం ఇనయా సుల్తానా తప్పకుండా వెళ్లిపోతుంది అని మరికొందరు అనుకున్నారు. కానీ ఆర్జీవి సపోర్ట్ తో ఆమె చివరి రోజు మంచి ఓటింగ్స్ అందుకుని ట్రాక్ లోకి వచ్చేసింది.

టాస్క్ లో గేమ్ చేంజ్
అసలు నేహా చౌదరి వెళ్ళిపోతుంది అని మొదట ఎవరు అనుకోలేదు. తప్పకుండా ఆమె ఏదో ఒక విధంగా నిలదొక్కుకుంటుంది అని కూడా సోషల్ మీడియాలో సపోర్ట్ బాగానే వచ్చింది. కానీ ఇనయా సుల్తానా రెండో వారం కెప్టెన్సీ టాస్క్ లో మాత్రం చాలా బలంగా పోరాడే ప్రయత్నం చేసింది. దీంతో ఆమెకు ఓట్లు పెరగడంతో నేహా ఓట్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి.

అతని కారణంగానే
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేహా ఊహించని విధంగా హౌస్ మెంట్స్ లలో కొందరిపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా రేవంత్ కారణంగానే తాను బయటకు వెళ్ళిపోయినట్లు ఆమె వివరణ ఇచ్చింది. పక్క ప్రణాళికతో వాళ్లు మోసం చేసి నన్ను టార్గెట్ చేశారు అని ఎప్పటికప్పుడు మాట మార్చేస్తూ ఎలిమినేట్ అయ్యేలా చేసినట్లుగా నేహా వివరణ ఇచ్చింది.

అతనికి బాడీ గార్డ్ గా..
ఇక నేహా కొంతమంది పై చాలా పాజిటివ్ గా కామెంట్ చేసింది. ముఖ్యంగా ఆమెకు చాలా క్లోజ్ అయినటువంటి రాజ్ గురించి చెబుతూ ఆమె ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయింది. రాజ్ చాలా మంచి స్నేహితుడు అయ్యాడు అంటూ బయటికి వచ్చిన తర్వాత కూడా అతనికి బాడీగార్డ్ గా ఉంటాను అని నేహా వివరణ ఇచ్చింది. అలాగే ఆదిత్య సుదీప శ్రీ సత్య కూడా చాలా బాగా ఆడుతున్నారు అని వివరణ ఇచ్చింది.