Bigg Boss Telugu 6: మొదలైన అసలైన పోరు.. కెప్టెన్సీ టాస్క్ లో దెబ్బలు తగిలేలా.. షాకింగ్!
బిగ్ బాస్ ఒక్క టాస్క్ తో ఇంట్లో పరిస్థితులు అన్నిటిని కూడా తారుమారయ్యేలా చేస్తున్నాడు. కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరికి వారు స్వార్థానికి తగ్గట్టుగా ఆలోచిస్తున్నారు అనుకున్నాడు ఏమో కానీ ఇప్పుడు మాత్రం ఏ ఒక్కరు ఎలాంటి నిర్ణయం తీసుకున్న కూడా మిగతా వారిపై కూడా ప్రభావం చూపించే విధంగా బ్యాటరీ రీఛార్జ్ టాస్కును కొనసాగిస్తున్నారు. ఇక ఈ టాస్క్ లో ఈరోజు మరొక ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. కొద్ది సేపటి క్రితం విడుదలైన ప్రోమో కూడా ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

రేవంత పొరపాటు
ఈవారం కొత్త కెప్టెన్ గా రేవంత్ నిలిచిన విషయం తెలిసిందే. ఇక అతనే ఎక్కువగా మిస్టేక్ చేస్తూ ఉండడంతో రీఛార్జ్ ఒక్కసారి తగ్గిపోతుంది. ఇదివరకే అతను బాధ్యత లేకుండా రెండుసార్లు నిద్రపోయి బ్యాటరీ తగ్గించేందుకు కారణమయ్యాడు. ఇంటి నియమాలు ఎవరు పాటించక పోయినా కూడా బ్యాటరీ తగ్గుతుంది అని కూడా బిగ్ బాస్ ముందే హెచ్చరించాడు.

మెరినా రోహిత్
ఇక ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్క విధమైన ఆప్షన్స్ తీసుకుంటూ వారికి నచ్చినట్లుగా కొనసాగుతుంటే మరి కొందరు మాత్రం ఇతరులపై ప్రభావం పడకూడదు అని బిగ్ బాస్ ఇచ్చిన ఛాన్స్ లను చాలా తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. ఇక ఈరోజు అయితే బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ లతో బ్యాటరీ మొత్తం తగ్గిపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. టాస్క్ చివర్లో రాజ్ మొత్తం బ్యాటరీ వాడుకోవడం వలన ఇప్పుడు మెరీనా రోహిత్ లో వారి ఫ్యామిలీ నుంచి ఎలాంటి అప్డేట్స్ అయితే అందుకునే అవకాశం లేకుండా పోయింది.

వారికి అవకాశం
నేను మాట్లాడుతాను అని మా మమ్మీ చూస్తూ ఉంటుంది కదా అని సూర్య ఏడుస్తూ కనిపించాడు. ఇక రాజశేఖర్ ఫోన్ ఎత్తగానే నీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయని 15% ఫోటో 10% టాక్ అని అర్థమయింది. ఇక చివరికి వాసంతికి కూడా అదృష్టం లభించింది. ఆమెకు ఫోటో లభించింది. దీంతో చాలా ఎమోషనల్ అవుతూ అందరితో హ్యాపీగా మాట్లాడింది కానీ మెరీనా రోహిత్ మాత్రం దీనంగా కూర్చుండిపోయారు.

కెప్టెన్ టాస్క్
ఇక రాజ్ ఫోన్ మాట్లాడాడు. నేను ఏమైనా మార్చుకోవాలా అని అంటూ ప్రశ్నించగా వారి కుటుంబ సభ్యులు నువ్వు ఏమి మార్చుకోవాల్సిన అవసరం లేదు అని గట్టిగా మాట్లాడమని నువ్వు తప్పు లేనప్పుడు గట్టిగా మాట్లాడాలి అని చెప్పారు. ఇక ఈవారం బిగ్ బాస్ సభ్యులందరికీ కూడా కెప్టెన్సీ పోటీదారులు అవ్వడానికి సమానమైన అవకాశాలను ఇవ్వాలనుకుంటున్నట్లు నోటీసు వచ్చింది.
దెబ్బలు తగిలే అవకాశం
ఇక టాస్క్ లో భాగంగా అందరూ కూడా ఒకేసారి బంతులను అందుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు చాలా తీవ్రంగా పోటీపడి ఆ బంతులను పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. కొందరికి దెబ్బలు కూడా తగిలే అవకాశం ఉన్నట్లు అనిపించింది. రేవంత్ అలాగే శ్రీ సత్య ఆదిరెడ్డి కొందరు బంతులను దక్కించుకోగా మరికొందరు మాత్రం దక్కించుకోలేకపోయారు. మరి ఈ పోటీలో ఎవరు ఈరోజు కెప్టెన్సీ టాస్క్ లో గెలుస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











