Bigg Boss Telugu 6: కెప్టెన్సీ టాస్క్ లో గొడవలు మొదలు.. దారుణంగా హెచ్చరికలు, తోపులాటలు!
బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఇటీవల బిగ్ బాస్ క్లాస్ పీకడంతో ఇప్పుడు సీరియస్ గా ఆడుతున్నారు అనిపిస్తోంది. ప్రతి టాస్క్ లో కూడా వారి శక్తికి మించి పోరాడే ప్రయత్నం చేస్తున్నారు. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కొందరు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ మొదలుపెట్టిన చాలెంజ్ లు ఎంతో ఆసక్తికరంగా మారాయి.
మొన్నటి వరకు స్నేహితులుగా ఉన్నవారు కూడా ఇప్పుడు శత్రువులుగా మారుతున్నారు. ఇక శత్రువులుగా ఉన్నవారు ఊహించిన విధంగా స్నేహితులవుతూ ఉండడం విశేషం. నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన హైలెట్స్ లోకి వెళ్తే..

కెప్టెన్సీ టాస్క్ లో న్యూ ఛాలెంజ్
చేపల చెరువు టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇస్తున్న మొదటి ఛాలెంజ్ పుష్ ఫిష్ అని అనగానే కంటెంట్స్ అందరూ కూడా పోటీగా గేమ్ లో పాల్గొన్నారు. ఎలాగైనా ఈ సారి కెప్టెన్సీ టాస్క్ లో గెలవాలి అని పోటీలో కొందరు తీవ్రంగా కష్టపడ్డారు. రెండు గ్రూపులకు చెందిన అమ్మాయిలు తోపుడు బండిలో కూర్చోగా రెండు వైపుల నుంచి ఇరువర్గాల అబ్బాయిలు తోసేందుకు ప్రయత్నం చేశారు.

రేవంత హెచ్చరిక
ఇక తర్వాత గేమ్ లో చాలా గొడవలు కూడా జరిగాయి. ముందు రేవంత్ అయితే శ్రీహన్ కరెక్ట్ గా ఆడలేదు అని చెప్పాడు. గేమ్ ఈజీగా అర్థమైంది అని కామెంట్ చేశాడు. ఇక రాజశేఖర్ మధ్యలో కలుగజేసుకొని ఎవరు సేఫ్ గేమ్ ఆడలేదు అని అన్నాడు. దీంతో రేవంత్ ఒక్కసారిగా ఆగ్రహంతో నీతో ఎవరు మాట్లాడలేదు అని హెచ్చరిక చేశాడు. ఇక నేను కూడా నీతో మాట్లాడలేదు అని చెబుతున్నాను అంటూ రాజశేఖర్ కూడా కోపడ్డాడు.

ఇనయా సీరియస్
ఆ తర్వాత సంచాలకుడిగా ఉన్న సూర్య వాళ్ళు రెండు సార్లు ఎత్తారు నువ్వు రెండుసార్లు ఎత్తావు అని అన్నాడు. రేవంత్ పక్కనే ఉన్న ఇనయా కూడా రాజశేఖర్ పై కామెంట్ చేసే ప్రయత్నం చేసింది. నేను నీతో మాట్లాడడం లేదు అని సంచాలకుడితో మాట్లాడుతున్నాను అంటూ రాజశేఖర్ కూడా ఫైర్ అయ్యాడు. ఇక తర్వాత రేవంత్ ఇనాయను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక ఓడిపోయినందుకు చాలా మంది ఆనందపడుతున్నారు అని రేవంత్ కామెంట్ చేశాడు.

ముందు నుంచి ప్లాన్ చేసుకున్నారు
ఆ తర్వాత శ్రీహన్ శ్రీ సత్య ఒకవైపు ఉండగా మరోవైపు ఫైమా రాజశేఖర్ పాల్గొనగా శ్రిహాన్ టీమ్ ఓడిపోయింది. వాళ్లు పైకి లేపినప్పుడు ఏమీ అనలేదు అని తప్పు జరిగింది అని ఇనయా సుల్తానా సంచలకుడి పై కామెంట్ చేసింది. ముందు నుంచి ప్లాన్ చేసుకున్నారు అని సంచాలకుడిపై ఆరోపణలు చేసింది.

ఈ రౌండ్ ముగిసేసరికి
మేము చేసిన అతి పెద్ద తప్పు నిన్ను సంచాలకుడిగా సెలెక్ట్ చేయడం అని కూడా ఇనయా చెప్పడంతో సూర్య సీరియస్ అయ్యాడు. ఇక ఈ రౌండ్ ముగిసేసరికి మరొక రౌండ్లో రెండు జంటలు పోటీ పడతాయని బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్క్ లో కూడా గొడవలు గట్టిగానే జరగబోతున్నట్లు అర్థమైపోతుంది. మరి కంటెస్టెంట్స్ లలో ఎవరు కెప్టెన్ గా నిలుస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











