Bigg Boss Telugu 6: అవును నువ్వే నా టార్గెట్ అంటూ కీర్తి ఓపెన్ కౌంటర్.. టాస్క్ లో శ్రీహన్ ప్రచారాలు
ఈ వారం నామినేషన్స్ తోనే బిగ్ బాస్ లో ఊహించని గొడవలు క్రియేట్ అయ్యాయి. ఇక ఆ గొడవలు ఈ వారం మొత్తం టాస్క్ లలో కూడా హైలెట్ అయ్యేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ ఏ మాత్రం ఛాన్స్ వచ్చినా కూడా గొడవల తీవ్రతను మరింత పెంచుతున్నాడు. దీంతో కంటెస్టెంట్స్ మధ్యలో స్నేహాలు కాస్త శతృత్వంగా మారుతోంది. ఇక ఈ వారం హౌస్ ఎలిమినేషన్ లో ఉన్నవారు ఎలాగైనా కెప్టెన్సీ టాస్క్ లో గెలిచి తీరాలి అనుకుంటున్నారు. నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఒక టాస్క్ హైలెట్ కాబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

BB ట్రాన్స్ పోర్ట్
ఈవారం కెప్టెన్సీ పోటీదారులు అవ్వడానికి బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ BB ట్రాన్స్ పోర్ట్. ఈ అర్హతను ఇంటి సభ్యులకు కొనుక్కోవాల్సి ఉంటుంది అని ఇనయా సుల్తానా బిగ్ బాస్ ఇచ్చిన వివరణను చదివి చెప్పింది. గార్డెన్ ఏరియాలో బిబి ట్రాన్స్ పోర్ట్ వాహనం ఉంది. వాహనం ఆగిన ప్రతిసారి మొదట వాహనంలోకి ఎక్కిన వారే కెప్టెన్సీ పోటీదారులు అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి స్టాప్ లో బిబి ట్రాన్స్ పోర్ట్ లో ఎక్కలేని మిగతా ఇంటి సభ్యులు ఇద్దరు సభ్యులను ఏకాభిప్రాయంతో ఎంచుకోవాల్సి ఉంటుంది.

రేవంత్ గారు స్ట్రాంగ్
ఇక మొదట ఆదిరెడ్డి బిబి ట్రాన్స్ పోర్ట్ పైకెక్కినట్లు అనిపించింది. ఇక మిగతా వారిలో అందరూ కూడా ఒకరినొకరు సెలెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు. శ్రీహాన్ అయితే రోహిత్ కీర్తిని సెలెక్ట్ చేసుకుంటున్నట్లు చెప్పాడు. రేవంత్ గారు స్ట్రాంగ్ అనిపిస్తుంది అని ఇనయా చెప్పింది. దీంతో రేవంత్ ఫిజికల్ గా వీకన్నప్పుడు ఎందుకు వచ్చారు బిగ్ బాస్ కి అని సెటైర్ వేశాడు. ఇక రాజశేఖర్ తన వివరణ ఇస్తు.. ఇనయా ఇల్లుని హ్యాండిల్ చేస్తుంది అని నాకు ఇప్పటికి అనిపించడం లేదు అని కామెంట్ చేశాడు.
అవును నువ్వే నా టార్గెట్
ఇక నేను నీకు ఏసాను అని నువ్వు నాకు వేస్తున్నావా అంటూ రాజ్ కు ఇనయా కౌంటర్ ఇచ్చింది. మరోవైపు కీర్తి, సత్య శ్రీహాన్ ను మరోసారి సెలెక్ట్ చేసుకోవడంతో టార్గెట్ అని అర్థమైంది అంటూ శ్రీహన్ కామెంట్ చేశాడు. ఇక ఆమె విసుగుతో అవును నువ్వే నా టార్గెట్ అని ఒప్పేసుకుంది. ఎవరైనా ఒక మ్యాటర్ చెప్పినప్పుడు తీసుకో లేకపోతే మనం ఏం చేయలేము అని కీర్తి అనడంతో శ్రీహన్ ఆమెపై మరింత సెటైర్ గా నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావా అని కామెంట్ చేశాడు.

శ్రీహన్ రిక్వెస్ట్
ఇక అదే తరహాలో కీర్తి కూడా అతనికి కౌంటర్ చేసింది. ఇక శ్రీహన్ అందరిని అడుగుతూ క్యాప్టెన్సీలో ఎలాంటి మాట అయితే ఇచ్చానో.. ముఖ్యంగా అమ్మాయిలకు కన్సిడర్ చేసి తప్పులు జరిగితే మళ్లీ వాళ్లకు పనిష్మెంట్ అనేది తగ్గిస్తానని చెప్పాడు. ఇక మెరినా అతనికి ఏదో చెప్పబోయింది. కానీ అతను ఏమీ చెప్పవద్దు అంటూ గట్టిగా అరిచేశాడు. మరి వీరి మధ్య గొడవలు కెప్టెన్సీ టాస్క్ లో ట్విస్టులు క్రియేట్ చేస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











