Bigg Boss Nominations: 9వ వారం నామినేషన్స్ లిస్ట్ లీక్.. కర్రతో కొట్టడంతో గొడవ.. ఆ 8 మందికి షాక్

మొట్టమొదటి సారిగా రియాలిటీ కంటెంట్‌తో ప్రసారం అయినా.. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. గ్రూపు తగాదాలు.. ప్రేమ కహానీలు.. అప్పుడప్పుడూ రొమాంటిక్ సీన్స్ చూపించడంతో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది బిగ్ బాస్ షో. ఈ క్రమంలోనే తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణు అందుకున్న కార్యక్రమంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్‌ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇందులో 9వ వారానికి సంబంధించి ఎవరెవరు నామినేట్ అయ్యారో చూద్దాం పదండి!

ప్రయత్నాలన్నీ విఫలంగానే

ప్రయత్నాలన్నీ విఫలంగానే


బిగ్ బాస్ షో అంటేనే అన్నీ రియల్‌ సంఘటనలతో చూపిస్తూ ఉంటారు. అందులోనూ కొన్ని ప్రేక్షకులకు మజాను పంచే వాటిని సెలెక్ట్ చేసి ప్రసారం చేస్తుంటారు. ఇవి ఆరో సీజన్‌లో మరింత ఎక్కువగా ప్రసారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలో కంటే ఎక్కువ ప్రయోగాలు చేస్తున్నారు. కానీ, వీటికి ప్రేక్షకులు రెస్పాన్స్ ఇవ్వడం లేదు. దీంతో రేటింగ్ అంతగా రావడం లేదు.

21మందిలో 8మంది అవుట్

21మందిలో 8మంది అవుట్


ఆరో సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు వచ్చారు. వీరిలో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్యలు వెళ్లిపోయారు.

ఆ ఎపిసోడ్‌ అంటేనే ఆసక్తిగా

ఆ ఎపిసోడ్‌ అంటేనే ఆసక్తిగా


నామినేషన్స్ టాస్క్ అనేది బిగ్ బాస్ షో మొత్తంలో ఎంతో ఆసక్తికరంగా సాగుతుందని తెలిసింది. దీనికి కారణం ఇందులో ఎన్నో గొడవలు జరుగుతూ ఉండడమే. అందుకే ఈ ఎపిసోడ్‌కు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూ ఉంటుంది. ఇక, ఆరో సీజన్‌లో దీన్ని సోమవారం కాకుండా మార్చాలని అనుకున్నారు. కానీ, అదే రోజున చూపిస్తూ మజా పంచుతున్నారు.

తొమ్మిదో వారం... కర్రలతోనే

తొమ్మిదో వారం... కర్రలతోనే


బిగ్ బాస్ ఆరో దానిలో కూడా నామినేషన్స్ టాస్కులు ఎంతో రచ్చ రచ్చగా సాగుతున్నాయి. ప్రతి వారం కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో అప్పుడే ఈ సీజన్‌లో కొంత మంది మధ్య దూరం కూడా పెరిగిపోయింది. ఇప్పుడు తొమ్మిదో వారానికి సంబంధించిన నామినేషన్స్ టాస్కులో కంటెస్టెంట్లు దిష్టిబొమ్మకు కుండను పెట్టి.. కర్రతో దాన్ని పగలగొట్టాల్సి ఉంది.

వాళ్ల మధ్య పెద్దగా గొడవలు

వాళ్ల మధ్య పెద్దగా గొడవలు


తొమ్మిదో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ కూడా గతంలో మాదిరిగానే ఎన్నో గొడవలతో సాగినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులో ఇనాయా సుల్తానాను కొందరు కంటెస్టెంట్లు టార్గెట్ చేశారు. దీంతో ఆమె వాళ్లతో గొడవ పెట్టుకుంది. అలాగే, రేవంత్ - ఇనాయా, ఆది రెడ్డి - ఇనాయా మధ్య కూడా పెద్ద పెద్ద వాగ్వాదాలు జరిగినట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ వారం 8మంది నామినేట్

ఈ వారం 8మంది నామినేట్


ఈరో సీజన్‌లోని తొమ్మిదో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గత రాత్రే ముగిసినట్లు తెలిసింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఏకంగా 8 మంది నామినేట్ అయ్యారని సమాచారం. అందులో ఇనాయా సుల్తానా, గీతూ రాయల్, శ్రీ సత్య, రేవంత్, కీర్తి భట్, రాజశేఖర్, రోహిత్‌, వాసంతి కృష్ణన్‌లు ఉన్నట్లు ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది.

ఎక్కువ ఓట్లు.. సేఫ్ అయింది

ఎక్కువ ఓట్లు.. సేఫ్ అయింది


బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఏకంగా 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఇప్పటికే ఎనిమిది మంది ఎలిమినేట్ అవడంతో 13 మంది మిగిలారు. అలాంటిది ఈ వారం 8 మంది నామినేషన్‌లోకి వచ్చినట్లు తెలిసింది. అంటే ఈ వారం ఫైమా, శ్రీహాన్, ఆది రెడ్డి, మెరీనా, బాలాదిత్యలు సేఫ్ అయ్యారు. ఇక, ఈ వారం ఇనాయా, గీతూకు ఎక్కువ ఓట్లు పడ్డాయని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X