twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: నిర్వాహకులను టెన్షన్ పెడుతున్న ప్రధాన సమస్య.. మరో గెస్ట్ రావాల్సిందే?

    |

    బిగ్ బాస్ 6వ సీజన్ మొదలవకముందు ఈసారి గతంలో కంటే ఎక్కువ స్థాయిలో రేటింగ్స్ అందుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే సెలబ్రిటీలు ఇంట్లోకి అడుగుపెట్టారో అప్పటినుంచి ఓ వర్గం ఆడియెన్స్ అసంతృప్తితో ఉన్నారు. ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేసుకోవడంలోనే ఫెయిల్ అయ్యింది అనే విధంగా కామెంట్ చేశారు. ప్రస్తుతం రేటింగ్స్ అయితే పెద్దగా ప్రాఫిట్ అందించే విధంగా రావడం లేదు అని తెలుస్తోంది. ఈ తరుణంలో బిగ్ బాస్ ను ఒక ప్రధాని సమస్య మరింత కలవరపెడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

    తక్కువ స్థాయిలో రేటింగ్స్

    తక్కువ స్థాయిలో రేటింగ్స్

    బిగ్ బాస్ షో అనేది తెలుగులో అసలు సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు మొదట్లో చాలానే వచ్చాయి. కానీ నిర్వాహకులు జూనియర్ ఎన్టీఆర్ తో మొదలు పెట్టిన విధానం బాగానే వర్కౌట్ అయింది. ఆ తర్వాత నాని వచ్చాడు. ఇక నాగార్జున మూడో సీజన్ నుంచి కంటిన్యూ అవుతూ మంచి రేటింగ్స్ అయితే అందిస్తూ వచ్చాడు. అయితే ఐదవ సీజన్ వరకు బాగానే కొనసాగిన బిగ్ బాస్ ఇప్పుడు 6వ సీజన్లో మాత్రం రేటింగ్స్ అందుకోవడంలో చాలా వెనుక పడుతోంది.

    ప్లాన్ బెడిసికొట్టింది

    ప్లాన్ బెడిసికొట్టింది

    మొదటి ఎపిసోడ్ కు కనీసం 10 రేటింగ్ కూడా దాటలేదు అంటే ఎంత తక్కువ స్థాయిలో ఆదరణ అందుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేసుకున్నప్పుడే బిగ్ బాస్ ఫెయిల్ అయింది అని ప్రతిసారి మ్యాజిక్ క్రియేట్ అవుతుంది అనుకుంటే ఈసారి మాత్రం బెడిసి కొట్టింది అనే విధంగా కామెంట్స్ కూడా వచ్చాయి.

    చివరికి బిగ్ బాస్ కే నచ్చలేదు

    చివరికి బిగ్ బాస్ కే నచ్చలేదు

    పోనీ డిఫరెంట్ టాస్కులు మొదలుపెట్టినా కూడా కంటెస్టెంట్స్ అందరూ కూడా దానికి తగ్గట్టుగా కొనసాగుతున్నారా అనుకుంటే అసలు ఆటపై పెద్దగా ఫోకస్ చేయడం లేదు అనే కామెంట్స్ కూడా వినిపించాయి. చివరికి బిగ్ బాస్ కూడా డైరెక్ట్ గానే కంటెస్టెంట్స్ అందరికీ క్లాస్ తీసుకోవాల్సి వచ్చింది. గత రెండు వారాల క్రితం అయితే బాగానే కొనసాగిన బిగ్ బాస్ ఇప్పుడు మాత్రం ఏమాత్రం ఆకట్టుకోవడం లేదని బిగ్ బాస్ ఓపెన్ గానే చెప్పేసాడు.

    సరైన న్యాయం చేయడం లేదు

    సరైన న్యాయం చేయడం లేదు

    బిగ్ బాస్ చెప్పిన దాన్ని బట్టి అసలు రేటింగ్ ఎంత తక్కువ స్థాయిలో వస్తుందో కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు అని అర్థం అయింది. ముఖ్యంగా కామెడీ ఎంటర్టైన్మెంట్ విషయంలో అయితే అసలు ఎవరు కూడా సరైన న్యాయం చేయడం లేదు. జబర్దస్త్ చలాకి చంటి తప్పకుండా కామెడీతో మెప్పిస్తాడు అనుకుంటే అతను కనీసం సగం వరకు కూడా ఉండలేక ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.

    వైల్డ్ కార్డ్ లో రప్పించాల్సిందే?

    వైల్డ్ కార్డ్ లో రప్పించాల్సిందే?

    బిగ్ బాస్ నిర్వాహకులను అన్నిటికంటే ప్రధానంగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది కామెడీ పరంగా ఎవరు కూడా కొత్తగా ఆకట్టుకోవడం లేదనే చెప్పాలి. అందుకే త్వరలో ఎవరైనినా మంచి కమెడియన్లను బిగ్ బాస్ లోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. జబర్దస్త్ లో ఇప్పటికే కొంతమంది కమెడియన్స్ ను సంప్రదించారు. ఆ మధ్యలో అయితే సుధీర్ వస్తాడు అని కూడా అన్నారు కానీ ఇంతవరకు పెద్దగా క్లారిటీ అయితే వచ్చింది లేదు. త్వరలోనే ఒక కమెడియన్ ను వైల్డ్ కార్డు ద్వారా ఇంట్లోకి రప్పించాలి అని అనుకుంటున్నారు. మరి ఆ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి.

    English summary
    Bigg Boss telugu 6 no comedy and most effective issue In house
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X