Bigg Boss Telugu 6: నామినేషన్ లో న్యూ ట్విస్ట్.. 9 మందిలో అతనే నెక్స్ట్ టార్గెట్!

బిగ్ బాస్ లో ఎప్పటికప్పుడు పరిస్థితులు మరింత సీరియస్ గా మారిపోతున్నాయి. కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరికి వారు తన మీద బలమైన కంటెస్టెంట్స్ అంటూ తప్పకుండా చివరి వరకు నిలుస్తామని చెబుతున్నారు. ఇక ఇప్పుడు హౌస్ లో ఉన్న పదిమందిలో తదుపరి వారం ఎవరు వెళ్ళిపోతారు అనేది కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక సోమవారం ఎపిసోడ్ లో జరిగిన నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ మధ్య తీవ్రంగా మాటల యుద్ధాలు కొనసాగాయి. ఇక ఈ వారం రిస్క్ లో పడిన కంటెస్టెంట్ ఎవరు అనే వివరాలలోకి వెళితే..

ఆమె సేఫ్

ఆమె సేఫ్

ఇప్పటివరకు హౌస్ లో నుంచి మొత్తం 11 మంది ఎలిమినేట్ అవ్వగా ఇప్పుడు మిగిలిన 10 మందిలో ఎవరెవరు నెక్స్ట్ వెళ్లిపోతారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇక ప్రస్తుతం ఉన్న వారిలో అయితే కెప్టెన్ ఫైమా ఈవారం సెజ్ లోకి వచ్చినట్లే. ఇక మిగిలిన వారిలో కొంతమంది ఇప్పుడు రిస్కులో పడినట్లుగా తెలుస్తోంది. ఎక్కువగా అందరూ ఒక ఇద్దరిని టార్గెట్ చేశారు.

చెత్తబుట్టతో నామినేషన్లు

చెత్తబుట్టతో నామినేషన్లు

బిగ్ బాస్ లో సహజంగా రివెంజ్ తీర్చుకోవడం కామన్. ఇక నామినేషన్ లో అసలు పగను తీర్చుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఈసారి నామినేషన్స్ లో గొడవలు కూడా గట్టిగానే జరిగాయి. చెత్తబుట్టతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్యలో మరింత కోపం రగిలించాడు. ఇక రోహిత్.. ఇనయాను నామినేట్ చేయగా ఆదిరెడ్డి శ్రీహన్ నామినేట్ చేశాడు.

ఆట తీరు నచ్చలేదు

ఆట తీరు నచ్చలేదు

ఇనయా.. వాళ్ళిద్దరూ కలిసి గేమ్ ఆడుతున్నారు అంటూ ఆదిరెడ్డి నీ నామినేట్ చేసింది. అలాగే రాజ్ కూడా తప్పుడు గేమ్ ఆడుతున్నాడు అంటూ అతన్ని నామినేట్ చేసింది. ఇక శ్రీహాన్ అయితే ఎప్పటిలానే ఈసారి రోహిత్ పై కాస్త కూల్ గానే నామినేట్ చేశాడు. ఒక కీర్తి కూడా ఈ హౌస్ కు సెట్ కాదు అంటూ అతను కీర్తిని నామినేట్ చేశాడు. మేరీనా..రేవంత్ ఇనయాను నామినేట్ చేస్తూ వారి ఆట తీరును తనకు ఏమాత్రం నచ్చలేదు అని చెప్పింది.

 రివెంజ్ తీర్చుకున్నారు

రివెంజ్ తీర్చుకున్నారు

ఇక రాజ్ అయితే మెరినాను చాలా కూల్ గా నామినేట్ చేసాడు. ఇక ఇనయా మాట్లాడే విధానం నచ్చలేదు అని నామినెట్ చేశాడు. ఇక శ్రీ సత్య కీర్తి మధ్యలో కూడా గొడవలు గట్టిగానే జరిగాయి ఈగో క్లాష్ రావడంతో శ్రీ సత్య కీర్తిని నామినేట్ చేసింది. అలాగే ఇనయాను కూడా నామినేట్ చేసింది. ఇక రోహిత్ అయితే మరో చిన్న కారణం చెబుతూ రేవంత్ ను నామినేట్ చేశాడు. అలాగే ఆదిరెడ్డి పై కూడా అతను పగ తీర్చుకున్నాడు. కీర్తి.. శ్రీ సత్య మేరీనాల మధ్యలో చాలా గొడవల తర్వాత నామినేట్ చేసుకుందుకు రివేంజ్ తీసుకునట్లు అనిపించింది. చివరగా రేవంత్.. మెరినా, రోహిత్ లను నామినేట్ చేశాడు.

అతను రిస్క్ లో..

అతను రిస్క్ లో..

ఇక ఈ నామినేషన్స్ లో మొత్తం నలుగురు రోహిత్ లో నామినేట్ చేయగా.. ఇనయాను మరో నలుగురు నామినేట్ చేశారు. దీంతో వీరిద్దరు కూడా ఇప్పుడు నామినేషన్ వలన రిస్క్ లో పడినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రోహిత్ ప్రతిసారి కూడా డేంజర్ జోన్లోకి వెళ్లి మళ్ళి సేఫ్ గా తిరిగి వస్తున్నాడు. ఇక ఈసారి అతని నలుగురు టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. మరి ఈసారి కూడా రోహిత్ ఓట్ల విషయంలో డామినేట్ చేసి సేఫ్ జోన్ లోకి మళ్ళీ తిరిగి వస్తాడో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X