Bigg Boss Telugu: తప్పు చేసినట్టు తెలిస్తే డోర్లు తన్నుకొని బయటకు వెళ్ళిపోతాను.. ఆదిరెడ్డి సవాల్
ఈ వారం కెప్టెన్సీ టాస్క్ తుది దశకు చేరుకుంది. ఆదిత్య రోహిత్ మధ్యలో టాస్క్ విషయంలో ఒక సీరియస్ సంభాషణ కొనసాగింది. అనుకోకుండా ఊహించని సమయంలో కొన్ని తప్పులు జరగవచ్చు అని రోహిత్ చెప్పాడు. అయితే రేవంత్ గేమ్ ఆడిన విధానంపై కూడా రోహిత్ రివ్యూలు ఇచ్చే ప్రయత్నం చేశాడు. అతను నన్ను కూడా ఆపేశాడు అని గేమ్ లో నా వెనకాల నుంచి గేమ్ ఆడినట్లు చెప్పుకొచ్చాడు. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లోని హైలెట్స్ లోకి వెళితే..

శ్రీసత్య vs ఆదిరెడ్డి
పక్కా వారి మీద ఎటాక్ అయినప్పుడు వదిలేయడం, తనమీద అటాక్ అయినప్పుడు మాత్రం రేవంత్ తప్పు అంటున్నట్లు రోహిత్ సమాధానం ఇచ్చాడు. ఇక మొదలవగానే ఆదిరెడ్డి శ్రీ సత్య మధ్యలో గొడవ గట్టిగానే జరిగింది. సంచులను నుంచి కాళీ చేయడానికి బాగానే ప్రయత్నాలు జరిగాయి. శ్రీ సత్య ఆదిరెడ్డి కాళ్ల దగ్గర ఉండి అతని సంచిని కాళీ చేయడానికి ప్రయత్నించగా ఆదిరెడ్డి పైనుంచి శ్రీ సత్య సంచిని కాళీ చేసేందుకు గట్టిగా పోరాడాడు.

శ్రీసత్య ఓటమి
ఇక చివరికి ఈ ఆటలో శ్రీ సత్య ఓడిపోయినట్లు అర్థమయింది. ఆమె చాలా ఎమోషనల్ గా ఏడ్చింది. అలాగే అనుకున్నదేదో అని నేను ముందే గెస్ చేశాను అంటూ రేవంత్ కూడా కామెంట్ చేశాడు. గెలిచారా గెలిపించారా భయ్యా అని రేవంత్ మల్లి సెటైర్ వేశాడు. గెలిపించారు అని కూడా శ్రీ సత్య కామెంట్ చేసింది.

కెప్టెన్ ఎవరు అవుతారో
మీరు ఏమైనా అనుకోండి అని, నాగ్ సార్ వచ్చినప్పుడు చెబుతారు అని ఆదిరెడ్డి సమాధానం ఇచ్చాడు. చూద్దాం కెప్టెన్ ఎవరు అవుతారో అని శ్రీ సత్య ప్రశ్నించింది. అయితే వినాయక సుల్తానా కూడా మీరు కలిసి ఆడారు అని అనడంతో ఆదిరెడ్డి ఫైర్ అయ్యాడు. దీంతో ఇద్దరూ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఏం చేసుకుంటావో చేసుకో
అలాగే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని ఆదిరెడ్డి ఇనయాకు బలంగా సవాల్ విసిరాడు. ఇక గీతూ అలానే ఇద్దరిని గెలిపించి వెళ్లిపోయింది అని ఇప్పుడు మీరు స్టార్ట్ అయ్యారా గెలిపించడానికి అని మళ్లీ కౌంటర్ ఇచ్చింది. ఇనయా నోరు వేసుకుని పడమాకు అంటూ ఆదిరెడ్డి గట్టిగా సమాధానం ఇవ్వడంతో ఏ అని ఎందుకు అంటున్నావు అని ఇనయా గట్టిగా అడిగింది.

అసహనంతో ఆదిరెడ్డి
చివరికి అసహనంతో ఆదిరెడ్డి హే పో అని చిదరించుకున్నాడు. ఆదిరెడ్డి అనేవాడు తెలిసి తప్పు చేయడు అని అన్నాడు. ఇక మీరు ఇదే అనుకొని నిజాయితీగా ఆడాలని బిల్డప్ ఇస్తున్నారు అని ఇనయా కు మాట్లాడింది. మీరు చాలా మంచి వాళ్ళు అని జనాల ముందు ప్రాజెక్ట్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారుని కూడా ఇనయా కౌంటర్ ఇచ్చింది.

తప్పు చేసినట్టు తెలిస్తే
అయితే నువ్వు మాత్రం బాత్రూం లోకి వెళ్ళు తలుపులు వేసుకుంటావు అని ఆదిరెడ్డి గతంలో చేసిన పొరపాట్ల గురించి చెప్పాడు. అలాగే నువ్వు నాగ్ సార్ తో మాట్లాడు తప్పు చేసినట్టు తెలిస్తే డోర్లు తన్నుకొని బయటకు వెళ్ళిపోతాను అని ఆదిరెడ్డి సవాల్ విసిరాడు. మరి వీరి మధ్య రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి గొడవలు జరుగుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











