Bigg Boss Telugu 6: గోరు తగిలినా ఊరుకునేది లేదు.. రేవంత్ వర్సెస్ ఆదిరెడ్డి వార్ మొదలైంది!
బిగ్ బాస్ లో పరిస్థితులు మళ్ళీ ఒక్కసారిగా తారుమారవుతున్నాయి. ఈ వారం కెప్టెన్సీ టాస్కులో గెలవడానికి కంటెస్టెంట్స్ అందరూ కూడా వారి శక్తికి మించి పోరాడే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా బిగ్ బాస్ కూడా సరికొత్త టాస్క్ లను ప్రవేశపెడుతున్నాడు. నాగమణి అనే కొత్త టాస్క్ లో బిగ్ బాస్ మరోసారి కంటెస్టెంట్స్ అందరి చేత కొట్టుకునే వరకు తీసుకువెళ్లాడు. నాగమణిలను దక్కించుకోవడానికి ఆదిరెడ్డి టీం తీవ్రస్థాయిలో పోటీపడుతోంది. ఇక వాటిని కాపాడుకునేందుకు రేవంత్ టీం కూడా గట్టి పోటీని అయితే ఇస్తోంది. ఇక నేడు ప్రచారం కాబోయే ఎపిసోడ్ హైలెట్స్ లోకి వెళ్తే...

కాళ్ళు లాగుతున్నాడు
శ్రీహాన్ అయితే బాలదిత్యా కాళ్లు పట్టుకొని పోటీకి రానివ్వకుండా చేశాడు. మరోవైపు ఆదిరెడ్డి కూడా రేవంత్ కాళ్ళు పట్టుకొని లాగేసాడు. అయితే అతను కాళ్ళు లాగుతున్నాడు అని చాలా సీరియస్ అయిపోయాడు. ఇక మరోవైపు సంచాలక్ గా ఉన్నటువంటి వాసంతి నేను చూస్తూనే ఉన్నాను కదా అలా ఏమి చేయలేదు అన్నట్లుగా సమాధానం ఇచ్చింది.

సవాల్ విసిరిన ఫైమా
ఇక రేవంత్ ఆ విధంగా మాట్లాడుతూ ఉండడంతో ఫైమా వచ్చి నన్ను ఇప్పటిదాకా కింద పడేసింది కూడా ఫిజికల్ అని వాదించింది. మరోవైపు ఇనయా సుల్తానా రేవంత్ పై చాలా సీరియస్ గా చూసింది. ఇక ఫిజికల్ గా ఆడకూడదు అంటూ మిగతా ఇంటి సభ్యులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా రేవంత్ అయితే డైలాగ్ లేకుండా ఆడండి అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇక ఫైమా అయితే ఫిజికల్ లేకుండా మేము కూడా ఆడతామని సవాల్ విసిరింది.

మధ్యలో రాజశేఖర్
ఇక మీకు చాతనయితే రండి అంటూ రేవంత్ కూడా గట్టిగా సమాధానం ఇవ్వడంతో అందుకు దీటుగా ఫైమా కూడా మీకు చేతనవ్వదా అని సమాధానం ఇచ్చింది. ఇక వీరి మాటలు యుద్ధం చాలాసేపు నడిచినట్లు అనిపిస్తోంది. రేవంత్ అయితే మరింత సీరియస్ అయ్యాడు. మరోవైపు రాజశేఖర్ తన టీం సభ్యులకు సలహాలు ఇస్తూ గేమ్ గెలిచేందుకు ప్రయత్నం చేశాడు. ఇక మరోవైపు ఫైమా కీర్తి మధ్యలో కూడా గొడవ జరిగింది. మధ్యలో రాజశేఖర్ రావడంతో యాక్షన్ చేయి కీర్తి అంటూ సెటైర్ వేశారు.

ఫిజికల్ గా ఆడేందుకు
ఇక రేవంత్ అయితే ఫిజికల్ గా ఆడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ మిగతా ఇంటి సబ్బులు కండిషన్స్ పెట్టడంతో మరింత చిరాకు వచ్చింది. ఇనయా గేమ్ అడుతున్నప్పుడు నా తల ఇరుక్కుంది అని పదేపదే రేవంత్ ను హెచ్చరించింది. ఫిజికల్ అవ్వకుండా ఫిజికల్ అని బ్లేమ్ వేశారు కాబట్టి ఒక్క గోరుగీత పడ్డ కూడా నేను ఫిజికల్ అవుతాను అంటూ రేవంత్ మరింత హెచ్చరించాడు.
గోరు తగిలితే..
ఇక గోరు తగిలితే ఫిజికల్ అవుతాను అంటున్నాడు ఇదేమైనా రెజ్లింగ్ గా అంటూ ఆది రెడ్డి అతని మీద సెటైర్ వేశాడు. ఇక రేవంత్ అయితే నువ్వు నామినేషన్ వేసుకో అని అనడంతో నువ్వు కూడా నామినేషన్ వేసుకుంటావో ఇంకా ఏదైనా వేసుకుంటావో ఫో అని.. ఆదిరెడ్డి మరింత కౌంటర్ ఇచ్చాడు. ఆట నేను నీట్ గా ఆడతాను అంటూ ఫిజికల్ అవ్వను అని అన్నాడు. మరి వీరి మధ్య గొడవ ఇంకా ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











