Bigg Boss Telugu 6: న్యూ టాస్క్ కొట్లాట.. ఎంత దిగజరుతున్నావో తెలుసా గీతూ..
బిగ్ బాస్ ఈ వారం ఇస్తున్న కెప్టెన్సీ పోటీ దారుల టాస్క్ మిషన్ పాజిబుల్. ఈ టాస్క్ లో కంటెస్టెంట్స్ అందరూ కూడా మరింత పోటీ పడే విధంగా బిగ్ బాస్ గట్టిగానే ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఏకంగా చంపుకునే టైపులో ఆటలో ఒక లాజిక్ కూడా పెట్టారు. టాస్క్ లో గీతూ మరోసారి హైలెట్ కావడానికి తప్పుడు దారిని తొక్కినట్లు అనిపిస్తోంది. ఇక ఈ టాస్క్ ఈ రోజు ఎపిసోడ్ లో హైలెట్ కానుంది. అందుకు సంబంధించిన ప్రోమో వివరాలలోకి వెళితే..

రెండు గ్రూపులుగా..
రెడ్ స్క్వాడ్ అలాగే బ్లూ స్క్వాడ్ లుగా కంటెస్టెంట్స్ రెండు గ్రూపులుగా విడిపోవాల్సి ఉంటుంది. ఇక టీమ్ స్క్వాడ్ యొక్క లక్ష్యం ఏమిటంటే వీలైనంత ఎక్కువమందిని చంపి ఈ టాస్క్ ను గెలవాలి అని గీతూ వివరణ ఇచ్చింది. ఇక చంపినట్లు గేమ్ రూల్స్ పాటిస్తూ కంటెస్టెంట్స్ అందరూ కూడా బలంగా పోరాడే ప్రయత్నం అయితే చేశారు.

నీకు అక్క చెల్లెళ్ళు లేరా
రెడ్ స్క్వాడ్ లో ఉన్నా ఫైమా ను బ్లూ స్క్వాడ్ మొదట చంపేసింది. దీంతో ఆమె తెల్లని దుస్తులను వేసుకుంది. ఇక ఆమెను చూసి ప్రత్యర్ధులు హేళన చేశారు. ఇక మరోవైపు గీతూ తన ఓవరాక్షన్ మిమిక్రితో చీ నీకు అక్క చెల్లెళ్ళు లేరా అంటూ ఆదిరెడ్డికి కౌంటర్ ఇచ్చింది. ఇక ఆదిరెడ్డి గేమ్ లో భాగంగా అతన్ని రెచ్చగొట్టేలా చేసింది. ఇక ఆమె మెడలో ఉన్న ఒక వస్తువును లాక్కెళ్ళడంతో రేవంత్ అందుకే ఎక్స్ ట్రాలు వద్దు గీతూ అని కౌంటర్ ఇచ్చాడు.

బుద్ధి బలాన్ని కూడా..
ఒకొక్కరికి వడ్డీతో సహా ఇస్తాను అని రేవంత్ కూడా రెచ్చగొట్టాడు. ఇక శ్రీ సత్య ఇనయా మధ్యలో వెన్ను పోటూలకు సంబంధించిన మాటల యుద్ధం గట్టిగానే కొనసాగింది. ఆ తరువాత బుజ బలాన్ని మాత్రమే కాకుండా బుద్ధి బలాన్ని కూడా ఉపయోగించాలని బిగ్ బాస్ వివరణ ఇచ్చారు. దీంతో గీతూ మరో యాంగిల్ లో గేమ్ కంటిన్యూ చేసింది.

మరింత కోపాన్ని తెప్పించారు
ఇక రేవంత్, గీతూ తెలివిగా లైటర్ సిగరేట్స్ తీసేసి అదిత్యకు మరింత కోపాన్ని తెప్పించారు. ఇక ఆ తరువాత రెండు స్ట్రిప్స్ ఇవ్వాలి అని కండిషన్ పెట్టడంతో.. గెలిస్తే ఆటలో గెలవండి అని ఆదిత్య మరో కౌంటర్ ఇచ్చాడు. ఇక గీతూ అయితే మొండిగా రెండు స్టిఫ్ట్స్ ఇస్తే లైటర్ ఇస్తాను మరొకటి ఇస్తే సిగరెట్ ఇస్తాను అని కండిషన్స్ పెట్టడం అదిత్యకు మరింత చిరాకు తెప్పించింది.

ఎంత దిగజరుతున్నావో తెలుసా
ఆఫ్టరాల్ ఒక సిగరెట్ కోసం ఎంత దిగజరుతున్నావో తెలుసా అని ఆదిత్య కోప్పడ్డాడు. అంతే కాకుండా ఆ తరువాత అతను గీతూ విషయంలో ఎమోషనల్ అయ్యాడు. ప్రేమ ఉందా అసలు నీకు అందరూ కూడా తనను నమ్మవద్దు అన్నా కూడా నేను పక్కనుండి సపోర్ట్ చేస్తే ఇప్పుడు ఇలా చేస్తోంది అంటూ ఆదిత్య కంటతడి పెట్టుకున్నాడు. మరి ఈ బిగ్ బాస్ టాస్క్ ద్వారా కంటెస్టెంట్స్ మధ్యలో ఇంకా ఎలాంటి గొడవలు జరుగుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











