Bigg Boss Telugu 6: రూమ్ లోనే లాక్ చేసుకొని లేడి కంటెస్టెంట్ ఎడుపు, తలపట్టుకున్న శ్రీహాన్

బిగ్ బాస్ ఈవారం మొదలుపెట్టిన కెప్టెన్సీ టాస్క్ కంటెస్టెంట్స్ మధ్యలో మళ్లీ గొడవలను సృష్టిస్తోంది. గతంలో కంటే ఈసారి అందరూ కూడా బలంగా పోరాడాలని కోరుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో స్నేహితుల మధ్యలో కూడా విభేదాలు కలుగుతున్నాయి. మొన్నటి వరకు ఎంతో కలిసికట్టుగా ఉన్నవారు కూడా ఈ టాస్కులతో ఇప్పుడు శత్రువులుగా మారే అవకాశం ఏర్పడింది. ఇక ఇనయా అయితే కంటెస్టెంట్స్ అందరిని కూడా టెన్షన్ పెట్టేసింది. ఆమె రెస్ట్ రూమ్ లో కూర్చుని ఏడుస్తూ ఉండడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ రోజు ఎపిసోడ్లో అయితే అదే హైలెట్ కాబోతోంది. ఆ హైలెట్స్ లోకి వెళ్తే..

శ్రీహన్ డబుల్ గేమ్

శ్రీహన్ డబుల్ గేమ్

నేను చాలా గిల్టీగా ఫీలవుతున్నా బిగ్ బాస్. ఇది నా వల్ల కావడం లేదు అని ఇనయా సుల్తానా రెస్ట్ రూమ్ లో కూర్చుంది. ఇక ఆమె మైక్ లో ఏడుస్తూ ఉంటే అందరికి వినబడింది. ఎదో రెండు రోజులు గోడవైతే ఫ్రెండ్ ఫ్రెండ్ కాకుండా పోతాడా అని శ్రీహాన్ కూడా మిగతా హౌస్ మెంట్స్ తో చెప్పుకొని బాధపడ్డాడు. ఇక శ్రీహన్ డబుల్ గేమ్ ఆడుతున్నట్లు అనిపిస్తోంది అని కీర్తి కామెంట్ చేసింది.

శ్రీహన్ కు మద్దతు

శ్రీహన్ కు మద్దతు

ఇక గీతూ ఈ ఎపిసోడ్ లో కూడా హైలెట్ అయ్యే విధంగా మాట్లాడింది. కానీ ఆమె శ్రీహన్ కు మద్దతు ఇస్తూ మాట్లాడింది. ఇక శ్రీ సత్య కూడా అతనికే సపోర్ట్ చేసే విధంగా మాట్లాడింది. ఇక ఇనయా మాత్రం ఏడుపు ఆపలేదు. ఆమె ఏడుస్తున్న సౌండ్స్ వినిపిస్తున్నాయి అని రేవంత్ అలాగే మరికొందరు ఎక్కడుందో అని వెతికారు.

లోపల వాష్ రూమ్ లో ఏడుస్తూ

లోపల వాష్ రూమ్ లో ఏడుస్తూ

ఆ తరువాత శ్రీహాన్ కూడా ఆమెను ఓదార్చాలి అని అనుకున్నాడు. మొదట బయట వాష్ రూమ్ దగ్గర ఉందని అనుకున్నారు. కానీ ఆమె లోపలే ఉన్నట్లు తెలిసింది. ఇక ఇనయా లోపల వాష్ రూమ్ లో ఏడుస్తూ ఉండడంతో బయటకు రావాలి అని అందరు రిక్వెస్ట్ చేశారు. బయటకు వస్తే నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు అని శ్రీ సత్య నచ్చజెప్పే ప్రయత్నం చేసింది.

డోర్ పగలగొట్టాలని..

డోర్ పగలగొట్టాలని..

ఇక ఇనయా లోపల తనను తాను కొట్టుకుంటున్నట్లు అనిపించింది. దీంతో అందరూ కూడా ఆ సౌండ్స్ కు టెన్షన్ పడుతూ ఇనయా అని పిలుస్తూ ఉండిపోయారు. ఇక గీతు వచ్చి విన్నర్ అవుతానని వచ్చి నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చున్నావ్ ఏమిటి అని కామెంట్ చేసింది. అనంతరం ఎంత సేపటికి ఇనయా డొర్ తీయకపోవడంతో రేవంత్ దాన్ని పగలోగోట్టేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ కూడా కెప్టెన్ పర్మిషన్ అడిగాడు.

శ్రీహన్ కూడా..

ఇక శ్రీ సత్య అలాగే కీర్తి మిగతా అమ్మాయిలు అందరూ కూడా ఇనయా విషయంలో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎంత బ్రతిమాలినా కూడా ఆమె బయటకు రాకపోవడంతో శ్రీహాన్ కూడా తన వల్లే ఇలా జరిగింది అని తలపట్టుకున్నాడు. మొన్నటివరకు చాలా స్ట్రాంగ్ గా కనిపించిన ఇనయా హఠాత్తుగా ఇలా ఏడవడం అందరిని టెన్షన్ పెట్టడం కూడా ఆమెకు పెద్ద మైనస్ గానే మారుతుంది. మరి ఇనయా విషయం హౌస్ లో ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X