Bigg Boss Telugu 6: బాటమ్ 5లో ఉండేది ఎవరు.. సీక్రెట్ గుట్టు లాగుతున్న నాగార్జున

బిగ్ బాస్ లో ఎప్పటికప్పుడు గేమ్ ఫార్మాట్ ని మారుస్తున్నాడు అని చెప్పవచ్చు. ప్రతి వారం కూడా ఎలిమినేషన్ సమయంలో ఏమాత్రం ఆడియన్స్ ను నిరాశపరచకుండా మంచి కంటెంట్ అయితే ఇస్తున్నాడు అని అనిపిస్తోంది. ఇక ఈ వారం నాగార్జున కూడా ఊహించిన విధంగా కంటెస్టెంట్స్ ను ప్రశ్నించబోతున్నాడు. ఇక హోస్ట్ నాగార్జున ఒక్కక్కరిని ప్రత్యేకంగా పిలిచి ఈ హౌస్ లో ఇప్పుడు బాటమ్ 5 కంటెస్టెంట్ ఎవరు అని సీక్రెట్ గా అడిగి తెలుసుకున్నారు. దీంతో ఈ కామెంట్స్ హౌస్ మెంట్స్ మధ్యలో తీవ్రస్థాయిలో విభేదాలు చూపబోతున్నట్లు అర్థమవుతుంది. నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లోని హైలెట్స్ లోకి వెళితే..

బాటమ్ 5లో ఉండేది ఎవరు

బాటమ్ 5లో ఉండేది ఎవరు

ఇక మొదటగా మీ దృష్టిలో బాటమ్ 5లో ఉండేది ఎవరు అని ఆదిరెడ్డిని అడిగాడు. ఇక అతను ఊహించినట్లుగానే మొదట మెరీనా పేరు చెప్పడం విశేషం. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరికీ ఒక డిసడ్వాంటే చెప్పవచ్చు అని ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ముఖ్యంగా వాళ్ళ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది అని కూడా అన్నాడు.

రాజశేఖర్ పై టార్గెట్

రాజశేఖర్ పై టార్గెట్

ఇక ఇనయా అయితే మరోసారి రాజశేఖర్ పై టార్గెట్ చేసినట్లు అనిపించింది. చివరి మూడు వారాల్లో అతను నామినేషన్స్ లో లేడు అని నామినేషన్స్ లో వస్తేనే అతను మళ్లీ జనాల్లో గుర్తింపు అందుకుంటాడు అని చెప్పింది. ఇక కీర్తి అయితే గత వారం గొడవలు గుర్తుపెట్టుకుని ఆదిరెడ్డి పేరు చెప్పేసింది. శనివారం జరిగిన మ్యాటర్లోనే కొంచెం అతనిపై నెగిటివ్ వెళ్ళింది అని చెప్పింది.

కొంతమందికి అర్థం కాదు

కొంతమందికి అర్థం కాదు

ఇక రాజశేఖర్ ఇనయా పేరు చెప్పాడు. తన గేమ్ ఆమె చాలా బాగానే అడుతుంది.. కానీ మాట్లాడే విధానం మాత్రం కొంతమందికి అర్థం కాదు అని అనిపిస్తుంది అని అన్నాడు. ఇక మెరీనా అయితే శ్రీహన్ పేరు చెప్పింది. కొంతమందిని అతను డిఫరెంట్ గా చూస్తాడు అని ఉదాహరణకు కీర్తితో కొన్ని మాటలు మంచిగా మాట్లాడుతాడు అని మరొకరితో మరో విధంగా మాట్లాడతారు అనే విధంగానే వివరణ ఇచ్చింది.

నోరు జారుతొంది

నోరు జారుతొంది

ఇక పైమా ఇనయా పేరు చెప్పింది. ఆమె గేమ్ ఆమె ఆడుతుంది కానీ నోరు జారుతున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నట్లుగా ఆమె తెలియజేసింది. ఇక రోహిత్ అయితే కీర్తి పేరు చెప్పాడు. ఆమె చాలా తొందరగా పర్సనల్ గా హర్ట్ అవుతుంది అని అన్నాడు. ఇక శ్రీ సత్య అయితే రాజు పేరు చెప్పి షాక్ ఇచ్చింది. అతను కూడా బాటమ్ 5 లో ఉండవచ్చు అని ఆమె చెప్పింది.

అతనే స్ట్రాంగ్ ప్లేయర్

ఇక రేవంత్ అయితే తనకు పోటీగా ఉన్నాడు అనుకుంటున్నాను అని రోహిత్ పేరు చెప్పేశాడు. అతను ఈ హౌస్ లో స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అని చెప్పేసాడు. అతను తన బలాలతో ఇంకా బాగా ఆడొచ్చు కానీ అది కనిపించడం లేదు అని అన్నాడు. ఇక శ్రీహన్ కీర్తి గురించి చెబుతూ.. ఆమె నెగిటివ్ కామెంట్ చెప్పినప్పుడు మాత్రం పాజిటివ్ గా తీసుకోదు అని అన్నాడు. మరి వీరు చెప్పిన మాటలు హౌస్ లో ఎలాంటి వాతావరణం క్రియేట్ చేస్తాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X