Bigg Boss Telugu 6: రాజశేఖర్ మాటలకు ఏడ్చేసిన ఇనయా.. అర్ధరాత్రి దెయ్యంలా మారిన అమ్మాయి!
బిగ్ బాస్ హౌస్ లో ఎప్పటికప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ఇక ఈ వారం ఆట మరింత ఆసక్తిగా కొనసాగబోతోంది. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా జనాల్లో వారి కంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు. ఇక ఇప్పుడు ఎవరికి ఏ స్థాయిలో గుర్తింపు ఉంది అనే విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ ప్రేక్షకులలో ఉన్న కొన్ని సందేహాలను కంటెస్టెంట్స్ ముందు ఉంచారు. ఇక వారి ప్రశ్నలకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వివిధ రకాలుగా సమాధానాలు అయితే ఇచ్చారు. నేడు ప్రచారం కాబోయే ఎపిసోడ్లో ఈ టాపిక్ హైలెట్ కాబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

అలాంటివి రెండు రోజులు మాత్రమే
ప్రేక్షకులు మీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్న ఇంకొన్ని విషయాలకు సంబంధించిన ప్రశ్నలు సమాధానాలు ఇచ్చే సమయం ఆసన్నమైంది అని బిగ్ బాస్ ఇచ్చిన నోటీసు గురించి శ్రీహన్ చెప్పాడు. ఇక కీర్తికి అనుకున్నట్లుగానే మీరు ఆడియన్స్ నుంచి సింపతి కోరుకుంటున్నారని ప్రశ్న ఎదురయింది. అయితే అలాంటివి రెండు మూడు రోజులు మాత్రమే ఉంటాయని ఆమె సమాధానం ఇచ్చింది.

తప్పుగా మాట్లాడతారు
ఇక రాజశేఖర్ కు ఒక విభిన్నమైన ప్రశ్న ఎదురయింది. ఈ ఇంట్లో మీ రియల్ ఫ్రెండ్స్ ఎవరు అలాగే మీ వెనక నీ గురించి తప్పుగా మాట్లాడతారు అని ఎవరిని నమ్ముతున్నారు అనే ప్రశ్న ఎదురయింది. అయితే నాకు ఇనయా అలా బిహేవ్ చేస్తుందేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది అని రాజశేఖర్ వివరణ ఇచ్చాడు. దీంతో మిగతా వాళ్ళు నవ్వుకున్నారు.

ఇనయా ఎమోషనల్
ఇక నేను తప్పు చేస్తానని అనిపిస్తుంది కదా అంటూ ఇనయా నామినేషన్ కి చాలా మంచి పాయింట్ ఇచ్చావు అని కౌంటర్ ఇచ్చింది. ఇక ఆమెను మరింత రెచ్చగొట్టే విధంగా రేవంత్ మాట్లాడాడు. ఇక ప్రతిదానికి నా మీదకు తీసుకొస్తారు అంటూ ఇనయా ఎమోషనల్ అయిపోయింది. కంటతడి పెట్టుకుంది. కీర్తి ఒడిలో పడుకొని ఏడుస్తూ ఉంటే రాజు వచ్చి ఓదార్చే ప్రయత్నం చేశాడు. కానీ నన్ను వదిలేయ్ అంటూ ఆమె అలా ఏడ్చుకుంటు ఉండిపోయింది.

ఒకటే సమాధానం చెబుతాను
రాజశేఖర్ చేయి వేయడంతో వదిలేయ్ అన్నప్పుడు చేయి తీయి అని పక్కనే ఉన్న రేవంత్ కూడా చెప్పాడు. మనం నమ్మిన వాళ్లు మన వెనకాల మరో విధంగా మాట్లాడుకుంటే నేనైతే వాళ్ల ఊహకు వదిలేస్తాను అని రేవంత్ అందరూ కూర్చున్నప్పుడు చెప్పాడు. అయితే నేను మాత్రం ఆ ప్రశ్నకు ఒకటే సమాధానం చెబుతాను అంటూ మై లైఫ్ మై రూల్స్ అందుకే నేను ఎవరు ఊహించని విధంగా ఉంటాను అని ఇనయా చెప్పింది.

దెయ్యాల వేషాలు
ఇక హౌస్లో కొంతమంది అమ్మాయిలు దెయ్యాల వేషాలు వేసుకుంటూ అబ్బాయిలను భయపెట్టే ప్రయత్నం చేశారు. ఎక్కువగా శ్రీసత్య శ్రీహన్ ను బయపెట్టినట్లు అర్ధమవుతుంది. ఈ వారం అయితే షోలో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లు అర్ధమవుతోంది. ఇక త్వరలోనే బిగ్ బాస్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో మరింత ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు. మరి ఈ తరహా వాతావరణం హౌస్ మేట్స్ మధ్యలో ఎలాంటి అభిప్రాయాలను క్రియేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











