Bigg Boss Telugu 6: హౌస్ వెనకాల నుంచి తల్లి రావడంతో ఏడ్చేసిన కంటెస్టెంట్.. ఎమోషనల్ మూమెంట్!

బిగ్ బాస్ లో ఇప్పుడున్న టాప్ కంటెస్టెంట్స్ అందరూ కూడా మరింత ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ వారం కంటెస్టెంట్స్ అందరికీ కూడా చాలా ముఖ్యం కాబోతోంది. బిగ్ బాస్ రేటింగ్ పెంచుకోవడానికి కూడా ఈ వారం ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే కంటెస్టెంట్స్ తల్లిదండ్రులతో చాలా కాలం తర్వాత మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. ఈ సారి ఎమోషనల్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తాయి. ఇక 80వ రోజు హౌస్ లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి అనేది ఈరోజు ఎపిసోడ్లో హైలెట్ కాబోతొంది. ఆ వివరాలలోకి వెళితే..

బిగ్ బాస్ ఫన్

బిగ్ బాస్ ఫన్

నేడు బిగ్ బాస్ కొంత ఫన్ కూడా క్రియేట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అందరూ కలిసి సరదాగా స్కిట్ కూడా చేశారు. బిగ్ బాస్ కోచింగ్ సెంటర్ అనే టాస్క్ అడబోతున్నారు. ప్రోమోలో రాజశేఖర్ అయితే చాలా హైలెట్ గా నిలిచాడు. ఇక అతను ఒక పాట పాడు అని ఫైమాను అడగడంతో ఆమె పిల్లా అంటూ రాగం తీసింది. ఇక ఆమెకు నేర్పిస్తూ రాజశేఖర్ పాడిన విధానం కూడా అందరిని నవ్వించింది.

నాకే చెబుతున్నావా

నాకే చెబుతున్నావా

ఇక శ్రీహన్ కూడా రాజశేఖర్ తో స్కిట్ చేసే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ కలిసి లాలీ లాలీ అనే పాట పాడారు. ఇక రాజశేఖర్ పాట పాడుతుంటే అందులోని మిస్టేక్స్ కనిపెట్టిన రేవంత్ అతనికి కౌంటర్ ఇచ్చాడు. ఇక అతను నాకే చెబుతున్నావా అంటూ సింగర్ రేవంత్ కు సమాధానం ఇచ్చాడు. ఇక శ్రీహన్ అయితే నువ్వు ఆగు అంటూ రాజ్ ను ఇమిటేట్ చేస్తూ మరింత నవ్వించాడు.

రోహిత్ తల్లి ఎంట్రీ

రోహిత్ తల్లి ఎంట్రీ

ఇక ఇంట్లోకి ఈసారి రోహిత్ తల్లిని బిగ్ బాస్ పిలిపించారు. ముందుగా అందరినీ ఫ్రీజ్ చేసిన బిగ్ బాస్ వెనకాల నుంచి రోహిత్ తల్లి వచ్చేలా చేశారు. ఇక తల్లి రాగానే రోహిత్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఆమెను కౌగిలించుకొని ఎంతగానో బాధపడ్డాడు. ఇక వారిని చూసి మిగతా వాళ్ళు కూడా ఎమోషనల్ అయిపోయారు. నువ్వు షేర్ తరహాలో గేమ్ ఆడుతున్నావు అని రోహిత్ తల్లి అతన్ని ఎంతగానో పొగిడింది.

ఎంతో సందడిగా రోహిత్ తల్లి

ఎంతో సందడిగా రోహిత్ తల్లి

ఇక గతంలో బిగ్ బాస్ లోని కంటెస్టెంట్స్ చేసిన పొరపాటులను సరదాగా రోహిత్ తల్లి అందరితోనూ చెప్పుకున్నారు. ఇక ఆదిరెడ్డి డాన్స్ చాలా బాగుందని కూడా ఆమె చెప్పారు. ఇక ప్రత్యేకంగా రోహిత తల్లి ఆమె చేసిన వంటకాన్ని కూడా అందరికీ తినిపించారు. ఇక హౌస్లో ఎంతో సందడిగా రోహిత్ తల్లి అందరితోనూ కలిసి డాన్స్ చేసిన విధానం కూడా హైలెట్ గా నిలిచింది. ఇక ఈరోజు బిగ్ బాస్ లో ఆటపాటలతో పాటు కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఆకట్టుకోబోతున్నట్లు అర్థమవుతుంది.

గెలిచేది ఎవరో?

బిగ్ బాస్ రేటింగ్ మళ్లీ పెరుగుతున్నట్లు అర్థమవుతుంది. ఇప్పుడున్న టాప్ కంటెస్టెంట్స్ లో ఎవరు బయటకు వెళతారు అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అమ్మాయిలలో ఎవరు ఫైనల్ లోకి వెళ్లి చరిత్ర సృష్టిస్తారనే విషయం కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో అమ్మాయిలు టైటిల్ విన్నార్ గా నిలిచింది లేదు. మరి ఈసారి ఉన్న నలుగురు అమ్మాయిలలో ఎవరు గెలుస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X