Bigg Boss Telugu 6: సిగరెట్ లేకపోతే చచ్చిపోయానా.. గీతూ విషయంలో మరోసారి ఏడ్చిన ఆదిత్య
బిగ్ బాస్ ఈ వారం గోడవలతోనే ఎక్కువగా హైలెట్ అవుతోంది. హౌస్ లో జనాల సంఖ్య తగ్గుతున్న కొద్దీ గొడవలు మరింత పెరుగుతున్నాయి. బిగ్ బాస్ కూడా అలాంటి టాస్క్ లు ఇస్తున్నాడు. ఇక ఈసారి కంటెస్టెంట్స్ ఇనయా వర్సెస్ శ్రీహన్ అన్నట్లుగా గొడవలు కొనసాగుతున్నాయి. ఈ ఇద్దరు కూడా గతంలో చేసిన తప్పుల గురించి కూడా పొట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లోని హైలెట్స్ లోకి వెళితే..

ఇనయా ఇందాక నోరు జారింది
ఇనయా ఇందాక నోరు జారింది అని శ్రీహన్ ఆమెను ప్రశ్నించాడు. మీరు కూడా చాలాసార్లు నోరు జారారు అని ఇనయా కూడా కౌంటర్ ఇచ్చింది. మీరు చేసిందే నేను చెప్పానని కూడా ఆమె గట్టిగానే మాట్లాడింది. ఇక శ్రీహన్ తో పాటు శ్రీ సత్య కూడా ఆమెతో వాదించేందుకు ప్రయత్నం చేసింది. మేము ఏం చేశామో చెప్పు అంటూ చప్పట్లు కొడుతూ శ్రీ సత్య, ఇనాయకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.

హేళన చేసిన శ్రీహన్
ఇక్కడ వచ్చి పడుకోలేదా నువ్వు అని గతంలో చేసిన పొరపాట్ల గురించి ఇనయా చెప్పుకొచ్చింది. వాటే కవర్ డ్రైవ్ అంటూ శ్రీహన్ ఆమెను హేళన చేస్తూ మాట్లాడారు. అంతేకాకుండా ఆడియన్స్ డ్రామా క్వీన్ ఇక్కడ ఉంది అంటూ శ్రీహన్ కెమెరా వైపు చూస్తూ మాట్లాడాడు. మా రిలేషన్ కు ఒక పేరు ఉంది.. ఒక క్లారిటీ ఉంది అని కూడా అతను గట్టిగా చెప్పాడు.

ఆదిత్య ఎమోషనల్
ఇక మరోవైపు ఆదిత్య సిగరెట్ విషయంలోనే మళ్ళీ ఎమోషనల్ అయ్యాడు. అది నాకు ఇష్టం లేదు అని తెలుసు. మా పిల్లలకు కూడా ఎవరికీ తెలియకూడదు అనుకున్నాను. కానీ అది తెలిసింది ప్రింట్ అయిపోయింది. అయినా వదిలేసాను. అయినా కూడా గుచ్చి గుచ్చి నువ్వు రెండు స్ట్రిప్పులు ఇస్తే నేను ఒక సిగరెట్ ఇస్తా అని అనడం నాకు నచ్చలేదు అని గీతూ మాట్లాడిన విధానంపై ఆదిత్య మరింత అసహనం వ్యక్తం చేశాడు.

ఇది బ్లాక్మెయిల్
ఇక గీతూ అలాగే ఆదిరెడ్డి మాట్లాడుకుంటూ టాస్క్ అయిపోయిన తర్వాతనే స్టోర్ లోనే మనం ఐటమ్స్ ను పెట్టేస్తూ ఉంటాం.. వాళ్ళ వాళ్ళ ఐటమ్స్ ఇవ్వడానికి ఏంటి అని అతను ప్రశ్నించాడు. అంతేకాకుండా ఇది టూ మచ్ బ్లాక్ మెలింగ్ అని కూడా అతను ప్రశ్నించడంతో నేను బ్లాక్ మెయిల్ చేయలేదు అని గీతూ సమాధానం చెప్పింది.

సిగరెట్ లేకపోతే చచ్చిపోయానా
ఇక ఆమె ఏమి చేయాలని అనుకుంటుంది అని ఆదిత్య కూడా ఎమోషనల్ అయ్యాడు. సిగరెట్ లేకపోతే నేను ఏమైనా చచ్చిపోయానా అంటూ.. ఇప్పుడు కూడా ఏమన్నా జరిగిందా అని ఆదిత్య సమాధానం ఇచ్చాడు. ఇంకా ఆ తర్వాత ఇది బిగ్ మిస్టేక్ అవుతుంది అని ఆ తర్వాత దాని ఫలితాన్ని చూసుకోవాల్సింది కూడా మీరే అని ఆదిత్య గీతూకు సమాధానం ఇచ్చాడు.

పర్సనల్ గా ఎఫెక్ట్ అవుతుంది
ఇక సిగరెట్ల కోసం ఆదిత్య ఏడ్చాడు అని బయటికి వెళుతుంది అని మరోసారి ఆదిత్య బాధపడుతూ చెప్పుకున్నాడు. ఇది పర్సనల్ గా ఎఫెక్ట్ అవుతుంది అని కూడా ఆదిరెడ్డి మరోసారి గీతూకు చెబుతూ.. అందుకే గేమ్ మీద ఎఫెక్ట్ కాకూడదు అని నేను చెబుతున్నాను అని అతను తెలియజేశాడు. అలాగే ఈ విషయం ఎవరికీ తెలియడానికి తనకు అసలు ఇష్టం లేదు అని ఆదిత్య సిగరెట్ గురించి పదే పదే తలుచుకుంటూ బాధపడుతూ ఏడ్చాడు. ఇక అతన్ని పట్టుకొని ఫైమా కూడా ఎమోషనల్ అయిపోయింది. మరి ఈ ఎమోషనల్ మూమెంట్స్ హౌస్ లో ఎలాంటి వాతావరణం క్రియేట్ చేస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











