Bigg Boss Telugu 6: ఒక కంటెస్టెంట్ ను చంపడానికి ప్లాన్.. కట్టలు తెచ్చుకుంటున్న కోపాలు!
బిగ్ బాస్ ఈవారం క్యాప్టెన్సీ టాస్క్ ను చాలా రసవత్తరంగా కొనసాగిస్తున్నాడు. కంటెస్టెంట్స్ మధ్యలో ఫిజికల్ టాస్క్ ల ప్రభావం కూడా గట్టిగానే పడుతుంది. ఏ ఒక్కరు కూడా తగ్గకుండా కోపాలు కట్టలు తెచ్చుకునేలా గేమ్ ఆడుతున్నారు. ఇక బైటన్స్ ఇచ్చి మరీ బిగ్ బాస్ కొట్టుకునే వరకు తీసుకువెళ్లాడు. దీంతో ఈ వారం బిగ్ బాస్ రేటింగ్స్ కూడా గట్టిగానే పెరిగే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన హైలెట్స్ లోకి వెళితే..

ఒక సభ్యులను చంపడానికి
మిషన్ పాసిబుల్ టాస్క్ లో భాగంగా ఇతర స్క్వాడ్ లోని ఒక సభ్యులను చంపడానికి బిగ్ బాస్ ఇస్తున్న మొదటి మిషన్ క్యాప్చర్ ద వార్ అనే గీతు రాయల్ చదివి వినిపించింది. అందరూ కూడా వారి చేతిలో బైటన్స్ పట్టుకొని కొట్టుకునే వరకు వెళ్లారు. ఎవరి బైటన్స్ తో నెట్టుకుంటు కింద పడిపోతారో వారు చనిపోయినట్లు లెక్క.

గొడవలు గట్టిగానే
ఇక రెండు గ్రూపుల మధ్య గొడవలు గట్టిగానే జరిగాయి. ముఖ్యంగా రేవంత్ వాసంతి మధ్యలో కూడా గొడవలు గట్టిగానే జరిగాయి. అతను గట్టిగా కొట్టడంతో అట్లా కొట్టకూడదు అని వాసంతి వాదించింది. ఇక తర్వాత మధ్యలో రెడ్ కలర్ బీటన్ ఒకటి విరిగిపోవడంతో గీతూ బిగ్ బాస్ కు సమాచారం ఇచ్చింది.

శ్రీహన్ క్యారెక్టర్ గురించి
ఇక తర్వాత గేమ్ లో ఇనయా సుల్తానా మాత్రమే మిగిలింది. ఆమెతో రెడ్ స్క్వేర్ లోని ఫైమాతో పాటు శ్రీహన్ పోటీపడ్డారు. ఇక వీరి మధ్య గేమ్ తో పాటు మాటల యుద్ధాలు కూడా కొనసాగాయి.. ఇక తర్వాత బాలాదిత్య శ్రీహన్ క్యారెక్టర్ గురించి మాట్లాడాడు. క్యారెక్టర్ అనకండి అన్నా అంటూ శ్రీహన్ కూడా వాదించాడు. ఇక గుణం అని కూడా అతను అన్నాడు.

డైరెక్ట్ గా ఆడడం చేతకాదు
ఇక నీకు నాతో డైరెక్ట్ గా ఆడడం చేతకాదు అంటూ ఇనయా మరోసారి శ్రీహన్ ను రెచ్చగొట్టింది. నామినేషన్స్ తప్ప కంటెంట్ లేని దానివి నువ్వు మాట్లాడుతున్నావు అని శ్రీహన్ ఆమెకు కూడా కౌంటర్ ఇచ్చాడు. నువ్వు ఈ మధ్య కంటెంట్ బాగా ఇస్తున్నావని కూడా శ్రీహాన్ కు ఆమె చురకలు అంటించింది. ఇక తర్వాత పోరాడుతూ ఇనయా కింద పడిపోయింది.

రివెంజ్ తీర్చుకున్నట్లు
ఇక మరొకవైపు రేవంత్ వాసంతి మధ్యలో జరిగిన గొడవలో రేవంత్ కింద పడిపోయాడు. ఆ తర్వాత వాసంతి అతనిపై రివెంజ్ తీర్చుకున్నట్లు కసిగా తన చేతిలో ఉన్న బైటన్ ను కింద పడేసింది. ఇక తన సొంత టీం సభ్యులే రేవంత్ కిందపడినట్లు క్లారిటీ ఇవ్వడంతో అతను చాలా అలిగాదు. ఇక చివరికి అతని బుజ్జగించేందుకు ప్రయత్నం చేశారు.

నీ ఇష్టం వచ్చినట్టు ఆడు
నాకు ఈ విధంగా చేతులు కట్టేసి ఆడే గేమ్ రాదు అని రేవంత్ కౌంటర్ ఇచ్చాడు. ఆట ఆడకూడదు అనలేదు అని మాట గురించి చూసి మాట్లాడాలి అని మళ్లీ తన టీం లోని శ్రీహన్ కూడా అన్నాడు. మాట చూసి అనాలి అని కూడా తెలియజేశాడు. కంట్రోల్ చేసి ఆడే గేమ్ నాకు రాదు అని రేవంత్ అనడంతో నీ ఇష్టం వచ్చినట్టు ఆడు అని గీతూ కూడా అతనికి చెప్పింది. మరి రేవంత్ ఆ మాటలకు గేమ్ ను ఎలా కంటిన్యూ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











