Bigg Boss Telugu 6: మరింత డోస్ పెంచిన బిగ్ బాస్.. గీతూ వర్సెస్ ఆదిరెడ్డి గేమ్ స్టార్ట్!
బిగ్ బాస్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతొంది. బిగ్ బాస్ ఇటీవల స్టార్ట్ చేసిన కెప్టెన్సీ టాస్క్ ఇప్పుడు సీరియస్ గా యూ టర్న్ తీలుకుంటోంది. గొడవలు కూడా గట్టిగానే క్రియేట్ చేస్తున్నాడు. ఇక గతంలో స్నేహితులుగా ఉన్నటువంటి వారు కూడా ఇప్పుడు శత్రువులుగా మారే పరిస్థితి ఏర్పడింది. కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు గెలవాలి అని సంకల్పంతో అయితే కనిపిస్తున్నారు. ఇక ఇప్పుడు మిషిన్ పాజిబుల్ టాస్క్ లో గొడవలు మరో లెవల్ కు వెళుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

రెండు గ్రూపుల మధ్య గొడవలు
మిషన్ పాజిబుల్ టాస్క్ లో రెండు గ్రూపుల మధ్య గొడవలు తీవ్రత అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ కూడా ఆ విధంగా గొడవలను క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పవచ్చు. ఇక అలాగే బ్లూ స్క్వాడ్ మధ్యలో పట్టు సాధించినా కూడా ఇప్పుడు వెనుకబడిపోయేలా ఉన్నట్లు అర్ధమవుతోంది. ఈసారి సెకండ్ ఛాలెంజ్ గొడవలు గట్టిగానే జరిగాయి. ఒకరినొకరు తోసుకుంటూ కనిపించారు. ఇక రేవంత్ కూడా చాలా దూకుడుగా కనిపించాడు.

ఆదిరెడ్డి వర్సెస్ రేవంత్
ఇక గీతూ అయితే తన టీం సభ్యులను గట్టిగా పిలుస్తూ అరిచేసింది. ఆదిరెడ్డి వర్సెస్ రేవంత్ మధ్యలో కూడా కొంత తోపులాట జరిగింది. మధ్యలో రోహిత్ కూడా గట్టిగానే పోరాడాడు. ఇక ఈ టాస్క్ లో రెండవ ఛాలెంజ్ మిషన్ రెస్క్యూ అంటూ బిగ్ బాస్ మరో ఆట మొదలుపెట్టాడు. గార్డెన్ ఏరియాలో ఉన్న రెండు గోడలను పగలగొట్టి అవతలి వైపు కూర్చున్న వారిని కాపాడాల్సి ఉంటుంది.

ఊహించని ట్విస్ట్
అయితే శ్రీ సత్య రోహిత్ మధ్యలో ఆట కొనసాగింది. ఇక రోహిత్ ముందుగానే గోడను పగలగొట్టి అవతలి వైపు తన టీం సభ్యులను కాపాడేందుకు వెళ్లాడు. అయితే శ్రీ సత్య మాత్రం కొంత ఆలస్యంగా గోడ పగలగొట్టింది. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే రోహిత్ త్వరగా తన టీమ్ సభ్యుడిని కాపాడాలేకపోయాడు. ఇక శ్రీ సత్య ఈ ఆటలో విన్ అయినట్లుగా తెలుస్తోంది.

గీతూ వర్సెస్ ఆదిరెడ్డి ఆట
అది రెడ్డికి సంబంధించిన టి షర్టు గీతూ తీసేసి గేమ్ మరో మలుపు తిప్పాలని అనుకుంది. ఇక ముందుగానే ఆదిరెడ్డి అయితే గీతూకు హెచ్చరిక చేసాడు. ఆట బ్రేక్ లో ఉన్నప్పుడు ఆడకూడదు అని అన్నాడు. కానీ ఆమె మాత్రం అబద్ధాలు చెబుతూ నేను మిస్టేక్ చేయలేదు అని అబద్ధాలు చెప్పింది. ఇక గీతూ తీసింది అని తెలిస్తే ఇకనుంచి గీతూ వర్సెస్ ఆదిరెడ్డి ఆట మొదలవుతుంది అతను బలంగా చెప్పాడు. మరి గీతూ ఆదిరెడ్డి పోటీని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
ఆమె టాప్ లో నిలిచే ఛాన్స్?
ఇక ఈవారం కూడా ఇనయా సుల్తానా డామినేషన్ ఎక్కువగా కనిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె గత వారం ఓట్లు చాలా తక్కువగా అందుకున్నప్పటికీ కూడా ఈ వారం మళ్ళీ మెల్లమెల్లగా తన ఓట్ల సంఖ్యను పెంచుకుంటుంది. రేవంత్ కు కూడా బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈసారి బిగ్ బాస్ లో ఎలాగైనా అమ్మాయిలే గెలవచ్చు అని ఇనయా టైటిల్ విన్నార్ కావచ్చని కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి ఆమెకు పోటీగా ఎవరు వస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











