Bigg Boss Telugu 6: గీతూని తుప్పాస్ అంటూ ఆదిరెడ్డి ఆగ్రహం.. నెలకేసి కొడుతూ ఊహించని ఛాలెంజ్
బిగ్ బాస్ అవకాశం వచ్చిన ప్రతీసారి కూడా కంటెస్టెంట్స్ మధ్యలో గొడవల తీవ్రతను మరింత పెంచుతున్నాడు. ఇక ఈసారి మిషన్ పాజిబుల్ లో అయితే హద్దులు దాటినట్లు అనిపిస్తోంది. రేటింగ్స్ పెరుగుతున్నాయి అనుకున్నారో ఏమో గాని కంటెస్టెంట్స్ ఎవరు కూడా కూల్ గా గేమ్ అడడం లేదు. మొన్నటివరకు కూల్ గా ఇన్నోసెంట్ గా ఉన్నవారు కూడా ఇప్పుడు మరింత వైలెంట్ గా మారుతున్నారు. ఇక బిగ్ బాస్ 6 నవంబర్ 4వ ఎపిసోడ్ హైలెట్స్ లోకి వెళితే..

తీవ్రమైన పోటీ
మిషన్ పాజిబుల్ టాస్క్ ఇప్పుడు తిరిగి ప్రారంభమవుతుంది అనగానే కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా రంగంలోకి దిగారు. ఒకరినొకరు కపడుకోవడానికి కిల్ చేయడానికి కంటెస్టెంట్స్ తీవ్రంగా పోటీని ఎదుర్కొన్నారు. ఇక రెడ్ స్క్వాడ్ బ్లూ స్క్వాడ్ మధ్యలో గొడవలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి.

కొడుతున్నారని ఇనయా కామెంట్
రాజశేఖర్ కారణంగా శ్రీ సత్య ఒక్కసారిగా కిందపడిపోయింది. ఇక తనను ఇంటేన్షనల్ గా కొడుతున్నారు అని మరోవైపు ఇనయా సుల్తానా కూడా గట్టిగానే వాదించింది. ఇక ఆమె మాటలకు శ్రీహన్ కూడా రియాక్ట్ అవుతూ రెచ్చగొట్టాడు. నువ్వు ఇంటన్షన్ గురించి మాట్లాడుతున్నావా ఇనయా అని కామెంట్ చేశాడు. నికే వచ్చింది కదా బెస్ట్ యాక్టర్ అవార్డ్ బాగా చేయండి అని ఇనయా కూడా చప్పట్లు కొడుతూ వెక్కిరించింది.

నెలకేసి కొట్టిన ఆదిరెడ్డి
ఇక గీతు వర్సెస్ ఆదిరెడ్డి మధ్యలో గొడవలు మరింత ముదురుతున్నాయి. బాడీ మీద ఉన్నప్పుడే స్ట్రైప్స్ తీశాము అని గీతూ శ్రీహన్ గురించి ఆన్సర్ ఇచ్చింది. ఇక ఆదిరెడ్డి ఆ విధంగా గేమ్ ఆడడం ఏమాత్రం సహించలేకపోయాడు. తన టీ షర్ట్ విప్పేసి మరి నెలకేసి కొట్టాడు. లీడర్ గారు మేము మా బుద్ధి బలం ఉపయోగించే బాడీ నుంచి స్ట్రైప్స్ తీసేశాము అని గీతు ఆన్సర్ ఇవ్వగా.. గీతూ పై ఆదిరెడ్డి మరింత సీరియస్ అయ్యాడు.

ఆదిరెడ్డి మరో కౌంటర్
నువ్వు ఒక్కదానివే బ్లెమ్ భరించకుండా టీమ్ మొత్తంపై బ్లేమ్ వేశావు అని తుప్పాస్ అంటూ ఆదిరెడ్డి మరో కౌంటర్ ఇచ్చాడు. అలాగే నువ్వు రాత్రి ఆడింది పర్సనల్ గా అంటూ గీతుని అతను ప్రశ్నించాడు. ఇక అందుకు గీతూ మాత్రం బుజ బలము మాత్రమే కాదు బుద్ధి బలం కూడా వాడమని చెప్పినారు అని గీతూ సమాధానం ఇచ్చింది.

ఆదిరెడ్డి హెచ్చరిక
ఇక ఆ తరువాత సోఫా మీదా కూర్చున్న ఆదిరెడ్డి మాట ఇస్తున్నానమ్మా వేరి సూన్ ఒకరోజు రెండు కళ్ళల్లో నుంచి పట్ పట్ మని నీళ్ళు కారతాయి. ఆ రోజు చెబుతాను.. ఆ రోజు నేను చెప్పిన దెబ్బ ఇది అని.. ఆదిరెడ్డి గీతుకు హెచ్చరిక చేశాడు. మరి వీరి మధ్య వైరం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి. మరోవైపు గీతూ అయితే బుద్ధి బలం అంటు తప్పుడు గేమ్ ఆడుతున్నా బిగ్ బాస్ మౌనం వహించడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆమె ఎన్ని హద్దులు దాటుతున్నా కూడా ఆట నియమాలను గుర్తు చేయకపోవడం వెనుక అంతర్యం ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు.


Click it and Unblock the Notifications











