Bigg Boss Telugu 6: పాము నిచ్చెన అంటూ బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్.. చేయి నొప్పితో ఏడ్చేసిన కీర్తి!

ఈ వారం పోటీ దారులు కెప్టెన్ గా నిలవడానికి పాము నిచ్చెన ఆట ఆడాల్సి ఉంటుందని శ్రీహన్ బిగ్ బాస్ అందించిన ఆదేశాల గురించి చదివి వినిపించాడు. ఇక ఈ ఆటలో కంటెస్టెంట్స్ అందరూ కూడా వారి శక్తిని మించి పోరాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎక్కడ తగ్గకుండా ఒకరినొకరు తోసుకుంటూ కెప్టెన్ కావడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థం అవుతుంది. ఇచ్చిన బకెట్లో పోటా పోటీగా మట్టిని తీసుకొని పాములను నిచ్చెనగలను కట్టాల్సి ఉంటుంది. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లోని హైలెట్స్ లోకి వెళితే..

Photos Courtesy: Star మా and Disney+Hotstar

అమ్మాయిలు కూడా

అమ్మాయిలు కూడా

ఈ ఆటలో అమ్మాయిలు కూడా చాలా గట్టిగానే పోరాడినట్టు అర్థమైంది. ముఖ్యంగా ఇనయా సుల్తానా అలాగే మెరీనా కూడా అబ్బాయిల కంటే దూకుడుగా కనిపించారు. ముందుగా వెళ్లి బకెట్స్ లో మట్టిని తెచ్చుకున్నారు. అయితే ఈ ఆటలో సగం మంది ఏంటి సభ్యులు పాములు కట్టాల్సి ఉంటుంది. మరి కొంతమంది మట్టితో నిచ్చెనలు కట్టాల్సి ఉంటుందని బిగ్ బాస్ వివరణ ఇచ్చారు.

రేవంత్ దూకుడు

రేవంత్ దూకుడు

ఇక ఆట మధ్యలో ఒకరినొకరు కామెంట్ చేసుకున్నారు. మెరీనా అయితే కీర్తి ఆటో పై తీవ్ర సంతృప్తితో ఉన్నట్లు చెప్పింది. ఇక మరోసారి ఈ ఆటలో అయితే రేవంత్ ఊహించని విధంగా వచ్చిన మట్టిని మొత్తం తానే తీసుకువెళ్లడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక మొత్తం ఎత్తుకుపోవడంపై ఇతర కంటెస్టెంట్స్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక్కరికి కూడా మట్టి ఇవ్వను అని బలంగా చెప్పేసాడు.
నా ఇష్టం బ్రో

నా ఇష్టం బ్రో

ఇక ఆదిరెడ్డి అయితే మొత్తం తెచ్చుకుంటే ఎలా బ్రో అని ప్రశ్నించాడు. అది నా ఇష్టం బ్రో అని కూడా రేవంత్ అన్నాడు. నేను అయితే ఎవరి నుంచి లాక్కోలేదు అని గేమ్లో భాగంగానే తీసుకువచ్చాను అని అన్నాడు. ఇక మధ్యలో టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ మరొకటి ట్విస్ట్ కిడా ఇచ్చినట్లు అర్థమవుతుంది.

పాము సౌండ్ ఇచ్చినప్పుడు..

పాము సౌండ్ ఇచ్చినప్పుడు..

ఇక పాము సౌండ్ ఇచ్చినప్పుడు నిచ్చెన ఏరియాలకు వెళ్లి అక్కడ ఉన్న మట్టిని తీసుకొని ఇతర కంటెస్టెంట్స్ వారి పాము కోసం ఉపయోగించుకోవాలి అని బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇక ఆ నిచ్చేనలను కట్టిన వారు గట్టిగానే పోరాడారు. వెంటనే మొదట కీర్తి పరిగెత్తుకుంటూ వెళ్లి రాజశేఖర్ దగ్గరకు వెళ్ళింది. అతన్ని టార్గెట్ చేసి మట్టి తీసుకోవాలని అనుకుంటే ఈ క్రమంలోనే తన శక్తికి మించి పోరాడి ప్రయత్నం చేసింది.

నొప్పిగా ఉన్నప్పటికీ

నొప్పిగా ఉన్నప్పటికీ

అలాగే వాసవి శ్రీ సత్య మధ్యలో కూడా గొడవలు గట్టిగానే కొనసాగాయి. అయితే కీర్తి కి చెయ్ నొప్పిగా ఉన్నప్పటికీ కూడా ఆటలో పోరాడే ప్రయత్నం చేసింది. ఇక శ్రీ సత్య వాసంతి తోపులాటను చూసి అందరూ కూడా షాక్ అయ్యారు. ఎక్కువమంది సత్యకు సపోర్ట్ చేశారు. కానీ వాసంతి మాత్రం ఆమెను చాకచక్యంగా అడ్డుకునే ప్రయత్నం చేసింది.

కీర్తి ఎమోషనల్

కీర్తి ఎమోషనల్

ఇక చివరికి కీర్తి అయితే తన చేయి నొప్పి కారణంగా చాలా బాధపడింది ఒక విధంగా చేయి నొప్పి కంటే కూడా ఈ నొప్పి వల్ల ఆట ఆడలేక పోతున్నాను అని బాధ ఎక్కువగా ఉంది అని ఎమోషనల్ అయింది. మరి ఎమోషనల్ ఎపిసోడ్ తర్వాత బిగ్ బాస్ లో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకుంటాను చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X