Bigg Boss Telugu 6: కంటతడి పెట్టుకున్న శ్రీహాన్.. అందరిని టెన్షన్ లో పెట్టిన బిగ్ బాస్!

బిగ్ బాస్ గత వారం వరకు కూడా ఎంతో నీరసంగా కొనసాగింది అని కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో గట్టిగానే వస్తున్నాయి. అయితే ఇప్పుడు బిగ్ బాస్ ప్లాన్ మొత్తం మార్చేస్తున్నట్లు అనిపిస్తోంది. ప్రతిరోజు ఏదో ఒక ట్విస్ట్ తో కంటెస్టెంట్స్ మధ్యలో భావోద్వేగాలను బయటకు తీస్తున్నాడు. ఇక ఇప్పుడు శ్రీహాన్ కంటతడి పెట్టుకుంటున్నా విధానం కూడా అందరిని ఆశ్చర్యాన్ని గురి చేసింది. ఒకరి నిర్ణయం ఇంటి సభ్యులపై ప్రభావం చూపే విధంగా బిగ్ బాస్ గేమ్ ప్లాన్ చేశాడు. ఇక ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ప్రోమో వివరాల్లోకి వెళితే..

బ్యాటరీ రీఛార్జ్

బ్యాటరీ రీఛార్జ్

మీ మనసుకు ఎంతో దగ్గరగా ఉన్న వారికి దూరంగా ఉండటం అంత సులభమైన విషయం కాదు. అందుకే ఈ వారం బిగ్ బాస్ సభ్యులందరికీ బ్యాటరీస్ రీఛార్జ్ చేసుకునే ఆటలో రెట్టింపు ఎనర్జితో కొనసాగే అవకాశం ఇవ్వబోతున్నారు. ఇక ఈ వారం ఇస్తున్న కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ బ్యాటరీ రీఛార్జ్. అని బిగ్ బాస్ చెప్పినట్లుగా శ్రీహన్ వివరించారు. అది వివరించిన తర్వాత ఇంటి సభ్యులందరూ కూడా గార్డెన్ ఏరియాలోకి వచ్చారు.

 కన్ఫెషన్ రూమ్ లో శ్రీహన్

కన్ఫెషన్ రూమ్ లో శ్రీహన్

అయితే అదే తరుణంలో శ్రీహన్ ను కన్ఫెషన్ రూమ్ కి రావాల్సిందిగా బిగ్ బాస్ కోరారు. ఇక బిగ్ బాస్ శ్రీహన్ కు మూడు ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి వీడియో కాల్ రెండు ఫుడ్ అలాగే ఇంకొకటి ఆడియో మెసేజ్. వాటిలో ఏ ఆప్షన్ ఎంచుకుంటారో కోరుకోవాలి అని బిగ్ బాస్ అన్నారు. కానీ అతను మాత్రం ఏ ఆప్షన్ వద్దు అనుకున్నట్లు చెప్పాడు.

అందరిలో కంగారు

ఆప్షన్ ఎంచుకోవడానికి నిరాకరించినందుకు తగిన పర్యావసనాలు ఇంటి మొత్తం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని కూడా బిగ్ బాస్ హెచ్చరించారు. ఇక తర్వాత బ్యాటరీ మీటర్ మొత్తం తగ్గిపోతూ ఉండడంతో ఇంట్లోనే సభ్యులందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. అలా ఎలా జరిగింది అని కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. దాదాపు 40% కు వచ్చేసింది అని కూడా కంగారు పడ్డారు.

శ్రీహన్ కంటతడి

శ్రీహన్ కంటతడి

ఇక మరోవైపు శ్రీహన్ మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయాడు. అసలు శ్రీహన్ కంటతడి పెట్టుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అనేది ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఇక శ్రీ సత్య కూడా తన ఇంట్లో వారిని గుర్తు చేసుకుంటూ బాధపడింది. ఇక మా అమ్మ రాత్రంతా పడుకోదు అని కూడా ఆమె బాధపడుతూ కన్నీరు పెట్టుకోవడంతో పక్కనే ఉన్న కీర్తి ఆమె ఓదార్చే ప్రయత్నం చేసింది. మరి బిగ్ బాస్ లో ఈరోజు ఎలాంటి పరిణామాలు చేసుకుంటాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X