Bigg Boss Telugu 6: ఓటింగ్స్ లో వెనుకబడిన ఆదిత్య, శ్రీ సత్య.. ఒక్క రోజులోనే టాప్ 5లో మార్పులు!

బిగ్ బాస్ మళ్ళీ ఎప్పటికప్పుడు సరికొత్త టాస్క్ లతో ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. మొదట్లో కొంత నీరసంగా అనిపించినప్పటికీ ఇప్పుడు బిగ్ బాస్ మళ్ళీ కంటెస్టెంట్స్ అందరిని కూడా ఎమోషన్స్ తో ఆలోచన విధానాన్ని మార్చేస్తున్నాడు. బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ లో అయితే ఒకరు తప్పు చేసినా కూడా అందరి పై ప్రభావం పడేలా చేస్తున్న బిగ్ బాస్ చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు అనే చెప్పాలి. ఇక ఈ వారం ఓటింగ్స్ లో కూడా రోజురోజుకు చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక అక్టోబర్ 13వ తేదీ వరకు వచ్చిన ఓటింగ్ వివరాలలో ఎవరు టాప్ లో ఉన్నారు అని వివరాల్లోకి వెళితే..

టాప్ 2లో

టాప్ 2లో

బిగ్ బాస్ 6వ సీజన్లో ఎక్కువగా ఓట్లు వచ్చిన వారిలో మొన్నటి వరకు కూడా రేవంత్ కొనసాగాడు. ఇక అతను కెప్టెన్ కావడంతో ఎలిమినేషన్ లో లేడు. ఇక ఎలిమినేషన్లో ఉన్నవారిలో ఇప్పుడు అత్యధిక ఓట్ల అందుకుంటున్న కంటెస్టెంట్ గా శ్రీహన్ మొదటి స్థానంలో నిలిచాడు. ఇక అతని తర్వాత ఊహించిన విధంగా కీర్తి రెండవ స్థానంలో కొనసాగుతూ ఉండడం విశేషం.

ఆదిరెడ్డి - గీతూ

ఆదిరెడ్డి - గీతూ

ఇక మెల్లగా యూట్యూబర్ ఆదిరెడ్డి కూడా తన ఓట్ల సంఖ్యను కూడా పెంచుకుంటూ ఉన్నాడు. గతంలో అతనికి అసలు ఓట్లు వస్తాయా రావా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. కానీ ఇప్పుడు అత్యధిక ఓట్లు అందుకున్న వారిలో అతను మూడవ స్థానంలో నిలవడం విశేషం. ఇక ఆ తర్వాత గీతూ నాలుగవ స్థానంలో ఉంది. ఆమెకు ఈమధ్య కొంత ఓట్లు తగ్గినట్లు కూడా అనిపిస్తోంది.

అనవసరంగా గోడవలతో..

అనవసరంగా గోడవలతో..


ఇక బిగ్ బాస్ లో మెరీనారోహిత్ ఇద్దరూ కూడా బాగానే ఆడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మధ్యమధ్యలో వీరు పడుతున్న గొడవలు ఊహించిన విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మెరీనా అయితే అనవసరంగా గొడవలు పెట్టుకుంటుంది అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక ఈసారి అత్యధిక ఓట్లు అందుకుంటున్న వారిలో వీరు 5వ స్థానంలో ఉన్నారు. రాజశేఖర్ కు అయితే మళ్లీ చాలా వరకు ఓట్లు తగ్గుతున్నాయి. అతని ఇప్పుడు 6వ స్థానంలో ఉన్నాడు.

 తగ్గుతున్న ఓట్లు

తగ్గుతున్న ఓట్లు


ఇక చివరి మూడు స్థానాల్లోకి వెళితే ఆదిత్య మొదటి రెండు వారాలు కూడా మంచి సపోర్ట్ అయితే అందుకున్నాడు. ఇక అతను ఆ తర్వాత ఎలిమినేషన్ లోకి వచ్చినా కూడా ఓట్లు పెద్దగా పెరగడం లేదు. ఈసారి అత్యధిక ఓట్లు అందుకున్న వారిలో అతను ఏడో స్థానంలోకి పడిపోయాడు. ఇక తర్వాత శ్రీ సత్య కొనసాగుతోంది. మొన్నటి వరకు ఆమె టాప్ 5 లోనే కొనసాగింది. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ చివరికి వచ్చేసింది.

 సుదీప మళ్ళీ చివర్లోనే..

సుదీప మళ్ళీ చివర్లోనే..


బిగ్ బాస్ ఆట మొదలైనప్పటి నుంచి కూడా హౌస్ లో ఎలిమినేషన్ లో ఉన్న ప్రతిసారి కూడా సుదీప అయితే పెద్దగా ఓట్లు అయితే అందుకోవడం లేదు. నేటిజన్స్ ఆమెకు పెద్దగా సపోర్ట్ చేయడం లేదు అని అనిపిస్తోంది. నామినేషన్ లో అందరికంటే తక్కువ ఓట్లు ప్రతిసారి ఆమెకే వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఎలా సేవ్ అవుతుంది అనేది అనుమానాలు చాలానే వస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో మాత్రం గురువారం వరకు అతి తక్కువ ఓట్లు అందుకున్న కంటెస్టెంట్ గా సుదీప చివరలో నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X