Bigg Boss Telugu 6 Voting: ఈసారి పోటీ మామూలుగా లేదు.. అతి తక్కువ ఓట్లు ఎవరికంటే?
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ గత రెండు మూడు వారాలు ఎంత ఆసక్తికరంగా కొనసాగింది. ఇక ఇప్పుడు ఏడో వారానికి బలమైన కంటెస్టెంట్స్ మధ్య మరింత తీవ్రమైన పోటీ కొనసాగబోతున్నట్లు అర్థమవుతుంది. కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరికి వారు వారి శక్తికి మించి పోరాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏడో వారం బిగ్ బాస్ ఊహించని విధంగా ఎక్కువ మందిని నామినేట్ చేసే విధంగా ప్లాన్ వేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ప్రస్తుతం నామినేషన్ టైమ్ లో ఎవరు అత్యధిక ఓట్లతో ముందు స్థానంలో ఉన్నారు అనే వివరాల్లోకి వెళితే..

నెంబర్ వన్ లో
అందరికంటే ముందుగానే రేవంత్ ఎప్పటిలానే అత్యధిక ఓట్లతో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. తప్పకుండా అతను బిగ్ బాస్ టాప్ 5లో నిలుస్తాడు అని మరోసారి క్లారిటీ వచ్చేసింది. అతని తరువాత ఎప్పటిలానే మళ్లీ శ్రీహన్ కూడా అత్యధిక ఓట్లు అందుకున్న వారిలో రెండవ స్థానంలో కొనసాగుతూ వస్తున్నాడు. అతను ఎక్కువగా అయితే రేవంత్ ను డామినేట్ చేయడం లేదు.

ఆదిత్య, ఆదిరెడ్డి
ఇక ఆదిత్య ఓట్లు గత వారం కంటే ఈ వారం కొంత పెరిగాయి. ఎందుకంటే అతను గత వారం చేసిన కొన్ని పొరపాట్లు వలన జనాలు పెద్దగా సపోర్ట్ చేయలేదు. కానీ ఈ వారం మాత్రం సరైన ట్రాక్ లోకి వచ్చాడు అని ఓట్లు అయితే వేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇక అత్యధిక ఓట్ల అందుకున్న వారిలో ఆదిత్య మూడో స్థానంలో ఉండగా అతని తర్వాత ఆదిరెడ్డి కొనసాగుతున్నాడు. ఆదికి తగ్గట్టుగానే ఓ వర్గం ఆడియన్స్ నుంచి మద్దతు అందుకుంటున్నాడు.

టాప్ 5లో ఫైమా
ఇక ఏడవ వారం ఊహించిన విధంగా టాప్ 5 లిస్టులో ఫైమా నిలవడం విశేషం. ఆ మధ్యకాలంలో రేవంత్ తో గొడవ పడినప్పటికీ కూడా ఆడియన్స్ నుంచి సపోర్ట్ బాగానే అందుకుంది. ఇక ఇప్పుడు అత్యధిక ఓట్లు అందుకున్న వారిలో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఆమె తర్వాత 6వ స్థానంలో కీర్తి కొనసాగుతుండగా ఏడవ స్థానంలో వాసంతి కొనసాగుతోంది. వీరిద్దరికి కూడా ఈ మధ్య ఓట్లు కొంతవరకు తగ్గినట్లు అనిపిస్తుంది.

ఆ ఇద్దరికి
ఇక వాసంతి తర్వాత ఎనిమిదవ స్థానంలో రోహిత్ కొనసాగుతున్నాడు. అతను 6 వారంలో కాస్త త్యాగాలు చేసినప్పటికీ కూడా పెద్దగా జనాలనుంచి సపోర్ట్ అయితే వచ్చింది లేదు. ఇక అతని భార్య మెరీనా కూడా ఓట్లు అందుకోవడంలో వెనుకబడి ఉంది. ఆమె ఇప్పుడు తొమ్మిదవ స్థానంలో కొనసాగుతోంది. వీరిద్దరూ కూడా ఎలాగైనా చివరి వరకు నిలవాలి అని గట్టిగానే పోరాడుతున్నారు.

చివరలో శ్రీసత్య
ఇక ఇనయా సుల్తానా అయితే గతవారం కంటే ఈ వారం మళ్లీ కాస్త డేంజర్ జోన్ లో పడినట్లు అనిపిస్తోంది. ఆమెకు గత వారం ఓట్లు గట్టిగానే పడ్డాయి కానీ ఈసారి శ్రీహన్ తో గొడవ కొంత మైనస్ గా మారినట్లు అనిపిస్తోంది. దీంతో ఆమె ఓట్లు అందుకున్న వరుసలో 10వ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఆమె తర్వాత రాజ్ 11వ స్థానంలో ఉండగా అర్జున్ 12వ స్థానంలో ఉన్నాడు. ఇక చివరి స్థానంలో అయితే శ్రీ సత్య కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











