Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Bigg Boss Telugu 6:బిగ్ బాస్ షోపై హైకోర్టులో పిటిషన్.. అశ్లీలత ఎక్కువైంది, ఆ సమయంలోనే ప్రసారం చేయాలి
రేటింగ్ సంగతి ఎలా ఉన్నా.. బిగ్ బాస్ రియాలిటీ షోకి రెస్పాన్స్ మాత్రం అసాధారణంగానే ఉంది. ఇప్పటి వరకు 5 సీజన్లను ఎంతో విజయవంతంగా ప్రేక్షకుల మన్ననలు పొందగా.. ఇటీవలే బిగ్‌బాస్ ఆరో సీజన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్ లో వింతలు, విచిత్రాలు బాగానే జరుగుతున్నాయి. కంటెస్టెంట్ల మధ్య ప్రేమయాణాలు, అలకలు, బుజ్జగింపులే కాకుండా పొట్టి పొట్టి డ్రెస్ లతో గ్లామర్ ను బాగానే చూపిస్తున్నారు. దీంతో ఈ షోకి ఆదరణ ఎంతుందో.. విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ షోపై ఇదివరకు చాలా మంది ప్రముఖులు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ షోని నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు ఓ న్యాయవాది. ఆ వివరాళ్లోకి వెళితే..
ఊహించని పరిణాలు, ట్విస్టులు..
రియాలిటీ షో అనే పేరుకు తగినట్లుగానే నిజమైన సంఘటనల ఆధారంగా నడుస్తూ.. ఎన్నో ఊహించని పరిణాలు.. ట్విస్టులతో సాగుతోంది బిగ్ బాస్ తెలుగు 6 షో. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను తీసుకొస్తూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది ఈ రియాలిటీ షో. ఈ కారణంగానే తెలుగులో ఇది ఏకంగా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆరో సీజన్ కూడా ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది.
21 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ..
గత సీజన్లు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆరో దానిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఆరో సీజన్లో ఏకంగా 21 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లంతా తమ తమ విభాగాల్లో గుర్తింపును దక్కించుకున్నారు. అందులో పలువురు మాత్రమే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగారు. ఇక అంచనాలకు అనుగుణంగానే దీన్ని ఆరంభం నుంచే ఆసక్తికరంగా నడుపుతున్నారు.
పొట్టి దుస్తుల్లో గ్లామర్ ఒలకబోత..
మరీ ముఖ్యంగా ఇందులో సరికొత్త టాస్కులు, రొమాన్స్, ప్రేమ కహానీలు సహా ఎన్నో ఆసక్తికరమైన అంశాలను హైలైట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ షోలో లేడి కంటెస్టెంట్లు చూపించే గ్లామర్ షో కూడా అంతా ఇంతా ఉండదు. తాజాగా ప్రసారం అవుతున్న ఆరో సీజన్ లో కూడా లేడి కంటెస్టెంట్లు అయిన శ్రీ సత్య, వాసంతి, కీర్తి భట్ పొట్టి దుస్తుల్లో బాగానే గ్లామర్ షో చేశారు.
కొందరికి బ్రోతల్ హౌజ్‌ల..
అయితే ఈ బిగ్‌బాస్ షో కొంతమందికి సినిమా అవకాశాలు, పాపులారిటీ, ఐడెంటిటీ తెచ్చిపెట్టి అద్భుతమైన అవకాశం. కానీ ఇదే బిగ్‌బాస్ రియాలిటీ కొందరికి బ్రోతల్ హౌజ్‌ల కనిపిస్తుంది. వారు పెట్టే టాస్క్‌లు, కాన్సెప్ట్ పాశ్చాత్య సంస్కృతికి మించి దారుణంగా ఉంటోందని తీవ్ర స్థాయిలో మండిపడిన సందర్భాలున్నాయి.
ఇదొక బూతు దందా అని..
బిగ్ బాస్ షో వచ్చే ఆదరణ, పాపులారిటీ, మన్ననలు ఒకవైపు మాత్రమే. మరోవైపు బిగ్‌బాస్ షో ఒక కాంట్రవర్సీ షో. ఇదొక బూతు దందా అని పలువురు ఇప్పటికీ చాలా సార్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీపీఐ నేత నారాయణ.. ప్రతి సీజన్ సమయంలో తనదైన స్టైల్లో ఏకిపారేస్తాడు. ఈ సీజన్‌కు సైతం అలానే చేశాడు. అలాగే ఈ సీజన్ ప్రారంభ సమయంలో టాలీవుడ్ పాపులర్ సింగర్ స్మిత కూడా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్..
ఇక తాజాగా అయితే ఈ బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ను నిలిపివేయాలని ఏకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ రియాలిటీ షోలో అశ్లీలత ఎక్కువైందని న్యాయవాది కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేస్తూ ఆరోపించినట్లు సమాచారం. ఈ షోలో అశ్లీల ఎక్కువైన కారణంగా, చట్ట ప్రకారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ప్రసారం చేయాలని కోరారు. మరి ఈ విషయంపై కోర్టు ఎలా తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.
అంతగా రాని రేటింగ్..
ఇదిలా ఉంటే ఇలా విమర్శలతో పాటు ప్రేక్షాదరణతో కొనసాగుతోన్న ఈ రియాలిటీ షోకి అంతగా రేటింగ్ రావడం లేదు. గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈ ఆరో సీజన్ కు తక్కువగా ఉందనే చెప్పాలి. దీంతో మరో కొత్త సీజన్ ఉండకపోవచ్చేనే టాక్ వినిపిస్తోంది. ప్రతి సారి ఇలాంటి టాక్ వచ్చిన.. ఎప్పటికప్పుడు కొత్త సీజన్ తో ముందుకు వస్తోంది బిగ్ బాస్ షో. అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఇప్పటివరకు ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.