Bigg Boss Telugu 6 బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల లిస్టు.. క్వారంటైన్‌లోకి సెలబ్రిటీలు, స్టార్ట్ ఎప్పుడంటే?

బుల్లితెర మీద విశేషంగా ఆకట్టుకొంటున్న రియాలిటీ షోలలో బిగ్‌బాస్ తెలుగు 6 ఒకటి. గత ఐదు సంవత్సరాలుగా ఐదు సీజన్లతో భారీగా ఫాలోయింగ్‌ను ఈ షో సంపాదించుకొన్నది. ఇప్పటికే ఎంతో మంది బిగ్‌బాస్ షోల పాల్గొని ఓవర్‌నైట్‌లో సెలబ్రిటలుగా మారిపోయారు. ప్రేక్షకుల నుంచి విపరీతమైన క్రేజ్ సంపాదించుకొన్న ఈ షో త్వరలోనే 6వ సీజన్‌తో ముందుకొస్తున్నది. ఈ షోలో పాల్గొనే వారు ఎవరు? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయాల్లోకి వెళితే...

బెస్ట్ రేటింగ్ షోగా బిగ్‌బాస్ తెలుగు

బెస్ట్ రేటింగ్ షోగా బిగ్‌బాస్ తెలుగు

తెలుగు వినోదపరిశ్రమలో బిగ్‌బాస్ భారీ ఫాలోయింగ్‌తో టాప్ రేటింగ్‌ షోగా రికార్డులు నెలకొల్పిన సందర్బాలు ఉన్నాయి. దేశంలోనే అత్యుత్తమ రేటింగ్‌ను సంపాదించుకొన్న షోగా బిగ్‌బాస్ తెలుగు షో ఘనతను సాధించింది. ఈ ఫార్మాట్ షోకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనను చూసి ఇటీవల ఓటీటీ ద్వారా 24 గంటలపాటు బిగ్‌బాస్ షోను ప్రసారం చేసి సక్సెస్ అయ్యారు.

అన్నపూర్ణ స్టూడియోలో భారీగా

అన్నపూర్ణ స్టూడియోలో భారీగా


బిగ్‌బాస్ తెలుగు 6 కోసం దాదాపు ఏర్పాట్లు చివరి దశకు చేరుకొన్నాయి. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో సెట్ పనులు, ఇతర వ్యవహారాలు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి బిగ్‌బాస్ ఇంటిని జిగేల్ మనేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రేక్షకుల ఈ సారి కొత్త అనుభూతిని పంచేందుకు నిర్వాహకులు కసరత్తు చేస్తున్నారు.

క్వారంటైన్‌లోకి కంటెస్టెంట్లు

క్వారంటైన్‌లోకి కంటెస్టెంట్లు


బిగ్‌బాస్ తెలుగు 6 షో కోసం కంటెస్టెంట్ల ఎంపిక దాదాపు పూర్తి కావొచ్చింది. దాదాపు 17 కంటెస్టెంట్ల ఈ షోలోకి అడుగుపెడుతున్నట్టు సమాచారం. ఎంపికైన కంటెస్టెంట్లను నిర్వాహకులు 10 రోజులపాటు క్వారంటైన్‌లోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బిగ్‌బాస్ తెలుగు 6 కంటెస్టెంట్లు, స్టాండ్‌బై కంటెస్టెంట్లను ఆగస్టు 25వ తేదీ నుంచి క్వారంటైన్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సెప్టెంబర్ 4 గానీ, సెప్టెంబర్ 11 గానీ

సెప్టెంబర్ 4 గానీ, సెప్టెంబర్ 11 గానీ

తాజా సమాచారం ప్రకారం బిగ్‌బాస్ తెలుగు 6 షోను సెప్టెంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ షోను సెప్టెంబర్ 4వ తేదీన ప్రారంభించే లక్ష్యంగా నిర్వాహకులు ముందుకెళ్తున్నారు. ఏదైనా అవాంతరం ఏర్పడితే.. సెప్టెంబర్ 11వ తేదీన వైభవంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

4వ సారి నాగార్జున హోస్ట్‌గా

4వ సారి నాగార్జున హోస్ట్‌గా

బిగ్‌బాస్ తెలుగు 6 షోకు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. వరుసగా మూడు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన నాగ్‌.. నాలుగో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన ఘనతను సొంతం చేసుకోబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా షో ఆరంభమై.. ఆ తర్వాత నాని ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ప్రచారంలో ఉన్న కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..

ప్రచారంలో ఉన్న కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..

బిగ్‌బాస్ తెలుగు 6కు సంబంధించిన ప్రచారంలో ఉన్న కంటెస్టెంట్లు జాబితా ఇదే..
1. అజయ్ కుమార్ కథుర్వార్ (యాక్టర్)
2. మిత్రా శర్మ (యాక్టర్)
3. ఉదయభాను (యాక్టర్, యాంకర్)
4. ఆర్జే చైతూ (రేడియో జాకీ)
5. అనిల్ రాథోడ్ (యాక్టర్)
6. దీపిక పిల్లి (యాక్టర్, జబర్దస్త్ ఫేమ్)
7. అమర్ దీప్ చౌదరీ ( టెలివిజన్ యాక్టర్)
8. శ్రీహాన్ (ఇన్‌ఫ్లూయెన్సర్)
9 నేహా చౌదరీ (యాంకర్, యాక్టర్)
10. ఆర్జే సూర్య (ఆర్జే)
11. ఆది రెడ్డి (యూట్యూబర్)
12. నిఖిల్ విజేంద్ర సింహ (యాంకర్)
13. చలాకీ చంటీ (జబర్దస్త్ కమెడియన్)
15. శ్రీ సత్య (యాక్టర్)
16. ఇనయా సుల్తానా (హీరోయిన్)
17. పాండు మాస్టర్ (కొరియోగ్రాఫర్)

పరిస్థితులు, ఇతర అంశాలన బట్టి ఈ జాబితాలో మార్పులు చేర్పులు ఉండవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X