Bigg Boss Telugu 6: రేవంత్ ఎంత తొందరగా వెళ్లిపోతే అతనికే అంత మంచిది.. గీతూ షాకింగ్ కౌంటర్!

బిగ్ బాస్ 6వ సీజన్ మొదలై నాలుగు రోజులు పూర్తయింది. ఇక మొదటి నామినేషన్ కూడా చాలా ఆసక్తికరంగా మారింది. తొలి వారంలో మొత్తంగా ఇప్పుడు అయితే ఏడుగురు నామినేషన్ లో ఉన్నారు. ఇక అందులో ఎవరెవరు బయటకు వెళ్లిపోతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎక్కువగా రేవంత్ కు నెగిటివ్ ఓట్లు రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇక బిగ్ బాస్ లో అందరి ఫోకస్ కూడా అతని వైపే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జరిగిన నామినేషన్స్ పై ఒక్కొక్కరు ఒక విధంగా రియాక్ట్ అవుతున్నారు. ఇక నేడు కంటెస్టెంట్స్ మధ్యలో కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లుగా కూడా అర్థమవుతుంది. అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

 అర్థం లేని నామినేషన్స్

అర్థం లేని నామినేషన్స్

బిగ్ బాస్ లో ఎప్పుడు ఎవరు ఎటువైపు యు టర్న్ తీసుకుంటారో ఎవరు ఊహించలేరు. ఇక మొదటివారం నామినేషన్స్ అయితే అర్థం లేకుండా కొనసాగే అని కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎవరికి ఎలాంటి కారణం చెప్పాలో తెలియక వారి కంటే బలంగా ఉన్న కంటెస్టెంట్స్ ని లేదా మరీ వీక్ గా ఉన్న కంటెస్టెంట్స్ ను నామినేట్ చేశారు అని అనిపిస్తోంది. ముఖ్యంగా మిగతా వారి కంటే ఎంతో బలంగా ఉన్నా రేవంత్ ను నామినేట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఎందుకు టార్గెట్ చేస్తున్నారు

ఎందుకు టార్గెట్ చేస్తున్నారు

ఇక ప్రోమో వివరాల్లోకి వెళితే.. నామినేషన్ లో పడడం పెద్ద పాపం కాదు అని బాలాదిత్య, రేవంత్ కు ధైర్యం చెప్పాడు. ప్రతీ వారం ఎవరో ఒకరు నామినేట్ అవుతారు. ఏదో కారణం చెప్పాలి అని అన్నాడు. ఇక మరోవైపు నామినేషన్ లో ఉన్న ఇనయ ఎందుకు నన్నే టార్గెట్ చేస్తున్నారు అంటూ వాబోయింది. అందుకు బాలదిత్యా కూడా తనకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మీ బుర్రలో మీరు నా గురించి ఏం అనుకుంటున్నారరో నేను ప్లాన్ వేసి స్కెచ్ వేసి ఉహించలేను అంటూ నామినేషన్ కు సంబంధించిన గొడవను గుర్తు చేశారు.

ఫైట్ కి రెడీ..

ఫైట్ కి రెడీ..

ఇక నామినేషన్ లో ఉన్న చంటి కూడా వివిధ అంశాలపై కూడా మాట్లాడే ప్రయత్నం చేశాడు. భగవంతుడు నోరు చెవులు ఎందుకు ఇచ్చాడు. ఎక్కువ విను తక్కువ మాట్లాడు అన్నాడు. ఫస్ట్ డేనే నాకు హర్ట్ అనిపించింది అంటే ఒక్కొక్కడు వంద చెబుతారు అని గీతూకి చంటి చెప్పాడు. ఇక మరోవైపు బాలదిత్యాతో ఇనయా ఏదైనా ఫేస్ మీద చెబితే ఫైట్ కి రెడీ అని చెప్పగా.. నేను ఫైట్ కి రెడీ కాలేను అని బాలాదిత్యా మొహం మీద చెప్పేశాడు.

గీతూ షాకింగ్ కామెంట్

ఇక రేవంత్ పరిస్థితిని చూడండి అంటూ బాలాదిత్య దీనంగా వివరించే ప్రయత్నం చేశాడు. అతను చాలా పానిక్ అవుతున్నాడు అని చెప్పాడు. ఇక మరోవైపు గీతూ కూడా రేవంత్ గురించి ఊహించని విధంగా కామెంట్ చేసింది. అతను ఎంత త్వరగా బయటికి వెళ్లిపోతే అంత మంచిది అని.. ఆయన హౌస్ లో ఇన్ని రోజులు ఉన్నారు అంటే ఆయన బిహేవియర్ ఇలానే ఉంది అంటే జనాలు అందరూ ఇంత పెద్ద సింగర్ ఇలా చేస్తున్నాడు అని అనిపిస్తుంది.. అని గీతూ కామెంట్ చేసింది. మరి ఈ వివాదాలు నామినేషన్ లో ఎలాంటి మలుపులను క్రియేట్ చేస్తాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X