Bigg Boss Telugu 6 కోల్పోయిన డబ్బు తిరిగి గెలుచుకునేందుకు టాస్క్.. గాలి పీల్చడం ఆపేయాలంటూ!
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ఆసక్తికరంగా ఎమోషనల్ గా సాగిపోతోంది. బిగ్ బాస్ చరిత్రలో ఏ సీజన్ లో జరగని ఎమోషనల్ ఈవెంట్స్ ఈ ఆరో సీజన్ లో జరిగాయని చెప్పొచ్చు. అలాగే అనుకోని సంఘటనలు, ట్విస్ట్ లు, బీబీ టీమ్ నయా ప్లాన్స్ తో ఆద్యంతం ఎంటర్టైన్ మెంట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదివరకు హౌజ్ మేట్స్ టాస్క్ లు ఇచ్చి బిగ్ బాస్ ప్రైజ్ మనీని తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే మనీని రాబట్టుకునేందుకు మరో అవకాశంగా టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. దీనికి సంబంధించిన డిసెంబర్ 6 మంగళవారం నాటి ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

అతను తప్పా అంతా నామినేట్..
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో తాజాగా ఫైమా ఎలిమినేట్ కావడంతో హౌజ్ లో ఏడుగురు మిగిలారు. అయితే ఈ 14వ వారం ఇంటి సభ్యులచేత నామినేషన్ల ప్రక్రియ నిర్వహించలేదు. నేరుగా బిగ్ బాస్ నామినేట్ చేశారు. టికెట్ టు ఫినాలే టాస్క్ లో గెలిచి ఫినాలేకు వెళ్లే మొదటి కంటెస్టెంట్ గా నిలిచిన శ్రీహాన్ తప్పా మిగతా ఇంటి సభ్యులందరిని బిగ్ బాస్ నామినేట్ చేశాడు. అంటే ఈవారం నామినేషన్లలో రేవంత్, రోహిత్, ఆదిరెడ్డి, ఇనయా సుల్తానా, శ్రీసత్య, కీర్తి భట్ ఆరుగురు ఉన్నారు.

రెండో టాస్క్..
ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఇదివరకు టాస్కుల రూపంలో కట్ అయిన బిగ్ బాస్ ప్రైజ్ మనీని మళ్లీ తిరిగి పొందేందుకు ఇంటి సభ్యులచేత టాస్క్ లు ఆడించాడు బిగ్ బాస్. మొదటి టాస్క్ లో రోహిత్, శ్రీసత్య పాల్గొన్నారు. ఇప్పుడు రెండో టాస్క్ ను నేటి ఎపిసోడ్ లో ఆడించనున్నారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

రేవంత్ వర్సెస్ ఇనయా..
ఇంటి సభ్యులందరు కలిసి రెండో ఛాలెంజ్ లో పోటీ పడేందుకు ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లు ఏకాభిప్రాయంతో నిర్ణయించి చెప్పమని బిగ్ బాస్ ఆదేశించాడు. అమ్మాయిల్లో ఇనయా, అబ్బాయిల్లో నేను అని రేవంత్ బిగ్ బాస్ కు చెప్పాడు. దీంతో రేవంత్, ఇనయా గార్డెన్ ఏరియాకు రండి అని బిగ్ బాస్ తెలిపాడు. తర్వాత మిగతా ఇంటి సభ్యులందరిని ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచాడు బిగ్ బాస్.

పిరమిడ్ పడొద్దు..
ఇంటి సభ్యులతో బిగ్ బాస్.. మీరందరూ రెండో ఛాలెంజ్ లో పోటి పడేందుకు ఇనయా, రేవంత్ ను ఎంచుకున్నారు. ఎంపికైన ఇద్దరిలో ఓ ఒక్కరు ఛాలెంజ్ లో ఓడిపోతారని మీరు భావిస్తున్నారో వారి పేరు మీద ఎక్స్ స్టాంప్ వేసి పేపర్ ని బ్యాలెట్ బాక్స్ లో వేయండని ఇంటి సభ్యులకు ఆదేశించాడు బిగ్ బాస్. విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కోల్పోయిన డబ్బుని తిరిగి సంపాదించుకోవడానికి బిగ్ బాస్ ఇప్పుడు ఇస్తున్న రూ. లక్షా 10 వేల విలువ గల ఛాలేంజ్ పిరమిడ్ పడొద్దు అని శ్రీహాన్ తెలిపాడు.

గాలి పీల్చడం ఆపేయాలి..
ఈ ఛాలేంజ్ లో టీ కప్స్ ని పిరమిడ్ లా పెట్టి వాటిని ఒక ప్లాంక్ పై తీసుకెళ్లి మరో చోట పెట్టాలి. అయితే వాళ్లు చేసేటప్పుడు పిరమిడ్ కట్టాక పడిపోతున్నాయి. ఇంతలో ఆదిరెడ్డి.. మీకు ఒక చిన్న లూప్ చెబుతాను. మీరు గాలి పీల్చడం ఆపేయాలని అన్నాడు ఆదిరెడ్డి. దీంతో ఇంటి సభ్యులంతా నవ్వేశారు. తర్వాత ఇనయా, రేవంత్ చాలా కష్టపడి ఆడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఛాలెంజ్ లో ఇంటి సభ్యులంతా రేవంత్ గెలుస్తాడని రాసినట్లు సమాచారం. అలాగే ఈ ఛాలెంజ్ లో రేవంత్ గెలిచి రూ. లక్షా 10 వేలు గెలుపొందినట్లు టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











