Bigg Boss Telugu 6: ప్రేక్షకుల నిర్ణయానికి విరుద్ధంగా ఎలిమినేషన్.. అతనే అవుట్.. చివరలో నాగ్ ట్విస్ట్!

బిగ్ బాస్ 6వ సీజన్ ప్రతీ వారం సరికొత్త ఎలిమినేషన్ ట్విస్ట్ లతో ఎంతో ఆసక్తికరంగా మారుతోంది. కంటెస్టెంట్స్ అందరూ కూడా వారి శక్తికి మించి పోరాడే ప్రయత్నం చేస్తున్నారు. ఏ మాత్రం పట్టు విడవకుండా ఫైనల్ వరకు వెళ్ళాలి అని ముందుకు సాగుతున్నారు. ఇక ఆదివారం ఎలిమినేషన్ ఎపిసోడ్ లో చివరికి ఇద్దరు మిగలగా ప్రేక్షకుల నిర్ణయానికి విరుద్ధంగా ఎలిమినేషన్ జరిగింది. ఇక చివరలో నాగార్జున ఇచ్చిన ట్విస్ట్ తో కూడా షో పై మరింత ఆసక్తి కొనసాగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

చివరగా ఇద్దరు మిగిలితే

చివరగా ఇద్దరు మిగిలితే

బిగ్ బాస్ 6వ సీజన్ తుది దశకు చేరుకుంటోంది. ఈ క్రమంలో టాస్క్ లో మాత్రమే కాకుండా ఎలిమినేషన్స్ లో కూడా సరికొత్త ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. అయితే దానికి తోడు హోస్ట్ నాగార్జున కూడా వివిధ రకాలుగా ట్విస్ట్ లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సారి చివరగా ఇద్దరు మిగిలితే నాగ్ ఒకరు రిస్క్ చేసే క్రమంలో ఆటను మలుపు తిప్పే ప్రయత్నం చేశారు.

మరోసారి అతను సేఫ్

మరోసారి అతను సేఫ్

ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ విషయంలో ఊహించని సస్పెన్స్ క్రియేట్ అయ్యింది. గతంలో ఎప్పుడు లేని విధంగా బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలోనే ఆట సస్పెన్ తో కొనసాగింది. చివరగా ఆదిరెడ్డి, ఫైమా, రాజశేఖర్ ఉండగా మొదట ఆది రెడ్డి సేఫ్ అయినట్లు నాగార్జున క్లారిటీ ఇచ్చేశాడు. అందరికంటే ఎక్కువ ఓట్లు రావడంతో ఆది తప్పకుండా సేఫ్ అవుతాడు అని ప్రేక్షకులు కూడా ఒక క్లారిటీ ఉంది. ఇక మొత్తానికి అనుకున్నట్లే ఆదిరెడ్డి ఈ వారం కూడా సేఫ్ అయ్యాడు.

రాజ్ ఎలిమినేట్

రాజ్ ఎలిమినేట్

అయితే బిగ్ బాస్ లో ఈ వారం ఎవరు వెళ్ళిపోతారు అనే విషయంలో ముందుగానే జనాలకు ఒక క్లారిటీ వచ్చింది. మొదట్లో అయితే ఫైమా వెళ్ళిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ రాజశేఖర్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఒక విధంగా ఫైమా కంటే రాజశేఖర్ కు ఎక్కువ స్థాయిలో ఓట్లు వచ్చినట్లు నాగార్జున కూడా హింట్ అయితే ఇచ్చేసాడు. దీంతో మళ్ళీ ఊహించిన విధంగా ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. దీంతో మరోసారి ఆట ఆసక్తిగా కొనసాగింది.

నాగార్జున ట్విస్ట్

నాగార్జున ట్విస్ట్

ఇక ఈసారి సీజన్లో ఎవిక్షన్ పాస్ కూడా మరోసారి ఎంతో ఆసక్తిని కలిగించింది. ఎవరైతే దాన్ని వాడుకుంటారో తప్పనిసరిగా బిగ్ బాస్ ఫైనల్ వరకు వెళతారు అనే సెంటిమెంట్ నడుస్తోంది. ఇక ఈసారి ఫైమా మొదట్లో దాన్ని పెద్దగా నమ్మాలని అనుకోలేదు. ఆమె జనాల సపోర్ట్ తోనే వెళతాను అనే విధంగా స్పందించింది. ఇక చివరిలో ఫైమా రాజశేఖర్ ఇద్దరు ఉండగా ముందుగా ఫైమా అయితే ఈ క్రమంలో నేను ఎలక్షన్ పాస్ వాడాలని అనుకోవడం లేదు అని చెప్పింది. కానీ నాగర్జున మాత్రం అప్పుడే ఆమెకు ఒక మాటను గుర్తు చేశారు. మీ అమ్మ నీకు చివరగా ఏం చెప్పిందో గుర్తుందా అంటూ ఎవిక్షన్ పాస్ వాడుకొని బిగ్ బాస్ లో ముందుకు సాగాలి అని సపోర్ట్ చేశాడు.

ప్రేక్షకుల నిర్ణయం గెలవలేదు

ప్రేక్షకుల నిర్ణయం గెలవలేదు


ఇక నాగార్జున చెప్పిన మాటలు ఆలోచించకుండా ఫైమా తన ఆటను కొనసాగించింది. అంతేకాకుండా రాజశేఖర్ కూడా ఆమె నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగాడు. ఫైమా రాజశేఖర్ ఇటీవల మంచి స్నేహితులుగా ఉన్నారు. ఇక మొత్తానికే ఫైమా ఎవిక్షన్ పాస్ వాడడంతో ఆమె సేఫ్ అయిపోయినట్లు నాగార్జున తేల్చేశారు. ఒక విధంగా ఆమె కంటే రాజశేఖర్ కు ఎక్కువ స్థాయిలో ఓట్లు వచ్చాయి. అంటే ప్రేక్షకుల నిర్ణయం గెలవలేదు. అయినప్పటికీ ఎవిక్షన్ పాస్ కారణంగా ఫైమా సేఫ్ అవడంతో రాజ్ హౌస్ లో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X