Bigg Boss Telugu 6: అతనే విన్నర్ అనిపిస్తోంది.. ఆమె కోసం ఎమోషనల్ హగ్: రాజశేఖర్ చివరి మాటలు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 12 వారంలో ఎవరు ఏలిమినెట్ అవుతారు అనే విషయంలో నెవ్వర్ బిఫోర్ అనేలా సరికొత్త సస్పెన్స్ క్రియేట్ అయ్యింది. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా బలమైన కంటెస్టెంట్స్ అని చెప్పవచ్చు. ఇక ఫైనల్ గా ఆదివారం రోజు మరో బలమైన కంటెస్టెంట్ రాజశేఖర్ వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇక అతను తప్పకుండా చివరి వరకు ఉండాలని ప్రయత్నం చేసినప్పటికీ ఫైమా ఎవిక్షన్ ఫ్రీ మాస్ కారణంగా ఏలిమినెట్ కావాల్సి వచ్చింది. ఇక రాజ్ హౌస్ లో నుంచి వెళ్లే క్రమంలో అతను బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ అతనే అంటూ ఒక కామెంట్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

రాజశేఖర్ ఎలిమినేట్

రాజశేఖర్ ఎలిమినేట్

బిగ్ బాస్ లో ఇప్పటివరకు జరిగిన ఎలిమినేషన్స్ ఒక లెక్క ఇక నుంచి జరగబోయే ఆట మరొక లెక్క అనే విధంగా కొనసాగుతోంది. ఇక రాజశేఖర్ ఎలిమినేట్ అవుతాడాని మొదట ఎవరు ఊహించలేదు. ఇక అతనికి జనాల సపోర్ట్ తో ఓట్లు బాగానే వచ్చినప్పటికీ ఫైమా ఎవిక్షన్ ఫ్రీ పాస్ కారణంగా బలి కావాల్సి వచ్చింది. ఇక అతను వెళ్లే క్రమంలో కూడా పెద్దగా ఎవరిని తిడుతూ అయితే వెళ్లిపోలేదు.

అందరికంటే ఎక్కువగా ఏడ్చేసింది

అందరికంటే ఎక్కువగా ఏడ్చేసింది

ఇక రాజశేఖర్ హౌస్ లో నుంచి వెళ్లిపోతుంటే చాలా మంది ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా ఫైమా అయితే మంచి స్నేహితుడు అయినటువంటి రాజ్ ను ఎవిక్షన్ పాస్ ఉపయోగించి ఏలిమినెట్ చేసింది. దీంతో ఆమె అందరికంటే ఎక్కువగా ఏడ్చేసింది. ఇక రాజ్ స్టేజ్ పై ఉన్నా కూడా ఆమె తన ఏడుపు ఆపలేదు. దీంతో ఆమెను రాజ్ ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇక రాజ్ తన ఎమోషనల్ జర్నీని చూసుకొని ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయ్యాడు.

హగ్‌లు, పంచ్‌లు

హగ్‌లు, పంచ్‌లు

ఇక నాగార్జున రాజ్ ను చివరహా హగ్‌లు, పంచ్‌లు ఎవరికి ఇస్తావు అని వివరణ ఇచ్చారు. ఇక రాజ్ మాత్రం ఆ విషయంలో కాస్త టెన్షన్ పడ్డాడు. ఇక అందరికంటే మొదటగా రాజ్ ఫైమా ను మిస్ అవుతున్నట్లు చెప్పాడు. ఇక ఆమె చాలా టాలెంటెడ్ అని కాకపోతే ఫన్ మిస్సవుతోంది అని చెప్పాడు. నువ్వు ఆ విషయంలో చాలా గ్రేట్. నేను చెబితే నువ్వు అది ఒప్పుకోవు. అందుకే ఇప్పుడు చెబుతున్నాను అని అన్నాడు.

ఎలాంటి తప్పు ఉండదని

ఎలాంటి తప్పు ఉండదని

ఇక ఆదిరెడ్డి గురించి చెబుతూ అతనికి కూడా హగ్ ఇవ్వాలి అని ఇంట్లో ఆదిరెడ్డి గేమ్ ఆడుతున్న విధానం బాగానే ఉంది కాని చాలా విషయాల్లో అతను తను చెప్పిన మాటే గొప్పది అంటూ గట్టిగా చెబుతూ ఉంటాడు. ఆ ఒక్క విషయంలో కాస్త అతి చేయడం తగ్గించుకుంటే మంచిది అని స్వీట్ కౌంటర్ ఇచ్చాడు. అయినప్పటికీ ఆది అయితే తన నిర్ణయంలో ఎలాంటి తప్పు ఉండదని సమాధానం ఇచ్చాడు.

అతనే విన్నర్

అతనే విన్నర్

ఇక బిగ్ బాస్ లో అందరికంటే ప్రత్యేకంగా తనకు రేవంత్ నచ్చాడు అంటూ రాజశేఖర్ తెలియజేశాడు. అతనితో ప్రతిరోజు మాట్లాడేవాన్ని అంటూ తప్పకుండా మిస్ అవుతాను అని అన్నాడు. అంతేకాకుండా అతనిది ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం అని ఏదైనా జరిగితే అప్పుడే కోపం అప్పుడే జాలి అన్ని చూపిస్తాడు అని తెలిపాడు. నాకు అతనే ఈసారి బిగ్ బాస్ విన్నర్ అవుతాడని అనిపిస్తోంది.. ఇదే విధంగా అతను ముందు కొనసాగాలని అనుకుంటున్నట్లు.. రాజ్ కోరుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X