Bigg Boss Telugu 6 బిగ్‌బాస్‌లోకి ‘రామ్ పోతినేని’ మాజీ ప్రేయసి.. ఇంటిలోకి మిస్ ఆంధ్రా..
బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున అక్కినేని తనదైన శైలిలో షోను ప్రారంభించారు. బిగ్గెస్ట్ రియాలిటీ షోలోకి ఆరో కంటెస్టెంట్‌గా శ్రీ సత్య అడుగుపెట్టారు. ఈ శ్రీసత్య ఎవరంటే..
విజయవాడకు చెందిన శ్రీసత్య మెడికల్ స్టూడెంట్. నటనపై ఆసక్తితో ఎంబీబీఎస్ వదిలేసి వినోద పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మోడలింగ్ ద్వారా కెరీర్‌ను బెటర్ చేసుకొన్నారు. మిస్ విజయవాడగా, మిస్ ఆంధ్రగా ఎంపికయ్యారు.

2016లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన నేను శైలజ చిత్రం ద్వారా శ్రీ సత్య సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో రామ్ మాజీ ప్రేయసిగా నటించారు. అప్పటి నుంచి గోదావరి నవ్వింది, లవ్ స్కెచ్ చిత్రాల్లో నటించింది.
2018లో టెలివిజన్ రంగంలోకి ప్రవేశించింది. ముద్ద మందారం సీరియల్ చిత్రం ద్వారా బుల్లితెరపైన కనిపించింది. నిన్నే పెళ్లాడుతా, అత్తారింట్లో అక్కాచెల్లెలు, త్రినయని సీరియల్స్‌లో నటించి మెప్పించింది.
లవ్ స్కెచ్, తరుణం, అంతా భ్రాంతియేనా? తొందరపడుకు సుందర వదన షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లో నటించింది.


Click it and Unblock the Notifications











