Bigg Boss Telugu 6: ఎవరిది ఏ ర్యాంక్.. అసలు గేమ్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్.. ఇక రచ్చ రచ్చే!

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న కొద్ది కూడా ఎంతో ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇప్పటివరకు చాలా బలంగా పోరాడుతూ వచ్చారు. ఇక చివరి వరకు ఎవరు నిలుస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే బిగ్ బాస్ ముగింపు దశలోనే అసలైన గొడవలను సృష్టిస్తున్నాడు. ఇక ఎవరికి ఎవరు ఎంత ర్యాంక్స్ ఇచ్చుకుంటారు అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. ఇక నేడు ప్రచారం కాబోయే ఎపిసోడ్ లోని హైలెట్స్ లోకి వెళ్తే..

ర్యాంక్స్ గొడవ

ర్యాంక్స్ గొడవ

బిగ్ బాస్ ఇంకా కేవలం రెండు వారాలు మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు హౌస్ మెంట్స్ అందరూ కూడా ఎవరికి వారు వారి పెర్ఫార్మన్స్ ను బట్టి ర్యాంక్స్ ను అడగాల్సి ఉంటుంది. అయితే ఎవరెవరు ఏ స్పాట్ దక్కించుకుంటారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రతి ఒక్కరు కూడా నెంబర్ వన్ స్థానంపై కన్నేసినట్లు కూడా అనిపిస్తోంది. మరికొందరు మాత్రం వారి ఆటకు తగ్గట్టు స్థానాలను అడుగుతున్నారు.

శ్రీహన్ vs శ్రీసత్య

శ్రీహన్ vs శ్రీసత్య

శ్రీహన్ ఒక్కడే టికెట్టు ఫినాలే టాస్క్ లో గెలిచి ఫైనల్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో అతని క్లోజ్ ఫ్రెండ్ శ్రీ సత్య మధ్యలో కూడా విభేదాలు మొదలయ్యాయి. ఆమె అన్నం తినేటప్పుడే శ్రీహాన్ తను తీసుకున్న నిర్ణయం గురించి మాట్లాడుతూ గొడవ పడ్డాడు. అయితే శ్రీ సత్య మాత్రం అలకతో శ్రీహన్ చేసిన తప్పుల గురించి మాట్లాడింది. వీడియోలు అడిగితే ఎవరెవరు ఎలాంటి నిర్ణయాలు చెప్పారో అర్థమవుతుంది అని అసలు రంగులు బయటపడతాయి అనే విధంగా మాట్లాడింది.

వేరే అమ్మాయితో చాలా క్లోజ్

వేరే అమ్మాయితో చాలా క్లోజ్

మొన్నటి వరకు క్లోజ్ ఫ్రెండ్స్ గా కనిపించిన శ్రీహన్ శ్రీ సత్య ఇప్పుడు మీరు మీరు అన్నట్లుగానే మాట్లాడుకుంటున్నారు. నేను కొన్ని విషయాల్లో హార్ట్ అయ్యాను అని కూడా శ్రీ సత్య చెప్పుకొచ్చింది. ఇక శ్రీహన్ కూడా అదే తరహాలో మొన్నటి వరకు నాతో ఉండి ఇప్పుడు వేరే అమ్మాయితో చాలా క్లోజ్ అయ్యావు అని చెప్పాడు. అయితే తనకు నచ్చినట్లు నిర్ణయాలు తీసుకోకపోతే ఈరోజు నా దగ్గర టికెట్ టూ ఫినాలే ఉండేది కాదు అని శ్రీహాన్ చెప్పడంతో ఎవడు గెలిస్తే నాకు ఏంటి అని శ్రీ సత్య మొహం మీదే కొట్టినట్టు చెప్పేసింది.

అందరితోనూ ఒకేలా ఉంటాను

అందరితోనూ ఒకేలా ఉంటాను

ఇక శ్రీ సత్య అయితే నాకు అందరు సమానమే అన్నట్లుగా మాట్లాడింది. ఇకనుంచి తాను కూడా అలానే ఉంటాను అని కూడా శ్రీహన్ చెప్పాడు. మొన్నటి వరకు ఒక అమ్మాయి గురించి మరోలా చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయితోనే నువ్వు జెల్ అయిపోయావు అని కూడా శ్రీహన్, శ్రీ సత్య చేసిన పొరపాట్ల గురించి చెప్పాడు. అయితే నేను అందరితోనూ ఒకేలా ఉంటాను అని శ్రీ సత్య చెప్తే ఇది నాకు ముందే చెప్పాల్సింది అని మళ్ళీ అతను కౌంటర్ ఇచ్చాడు. అయితే నేను మాత్రం నీలా ఉండలేను శ్రీహాన్ అని శ్రీసత్య చెప్పింది.

మొదటి నుంచి 7 వరకు

అయితే తాను మాత్రం కొంచెం కూడా మారలేదు అని నువ్వే మార్చేసావు అని శ్రీ సత్య పై శ్రీహన్ నింద వేశాడు. ఇక ఇంట్లో ఒకటి నుంచి ఏడు వరకు ఉన్న ర్యాంక్స్ నుంచి ఎవరు ఏ స్థానానికి అర్హులో ఆ స్టాండ్ వెనుక నిలబడాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ చెప్పడంతో అందరూ కూడా వారికి నచ్చినట్లు కారణాలను చెబుతూ స్టాండ్ వెనకాల నిలుచున్నారు. ఇక ఈ ఆటలో అయితే శ్రీ సత్య శ్రీహాన్ మధ్య గట్టిగానే వివాదాలు చోటు చేసుకున్నట్లు అనిపిస్తోంది. మరి మొదటి స్థానం కోసం ఎవరెవరు ఏ తరహాలో మాట్లాడతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X