For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: తండ్రికి బ్రెయిన్ స్ట్రోక్, బ్లైండ్ చెల్లి, 10 నెలల పాపను భార్యతో అద్దె ఇంట్లో వదిలేసి

  |

  తెలుగులో బిగ్ బాస్ ఎప్పుడు ప్రసారం అయినా భారీ రెస్పాన్స్‌ను అందుకుంటోంది. సీజన్.. సీజన్ కు కొత్త వేరియేషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది బిగ్ బాస్ తెలుగు. ఇందులో భాగంగానే భారీ అంచనాల అంచనాల నడుమ సెప్టెంబర్ 4న బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్‌ను నిర్వహకులు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. నామినేషన్లు, టాస్కులు, ఎలిమినేషన్లతోపాటు సీజన్ మొత్తం కెప్టెన్సీ బ్యాన్ చేయడం వంటి షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ఐదో వారం నామినేషన్ల ప్రక్రియ ఆసక్తికరంగా ప్రారంభమైంది. ఈ ఐదో వారం నామినేషన్లలో మొత్తంగా 8 మంది ఉన్నారు.

   రేటింగ్ ఎలా ఉన్నప్పటికీ..

  రేటింగ్ ఎలా ఉన్నప్పటికీ..

  రేటింగ్ సంగతి ఎలా ఉన్నా.. బిగ్ బాస్ రియాలిటీ షోకి రెస్పాన్స్ మాత్రం అసాధారణంగానే ఉంది. ఇప్పటి వరకు 5 సీజన్లను ఎంతో విజయవంతంగా ప్రేక్షకుల మన్ననలు పొందగా.. సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభమైన బిగ్​బాస్​ ఆరో సీజన్​ బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఈ సీజన్ లో వింతలు, విచిత్రాలు బాగానే జరుగుతున్నాయి. కంటెస్టెంట్ల మధ్య ప్రేమయాణాలు, అలకలు, బుజ్జగింపులే కాకుండా పొట్టి పొట్టి డ్రెస్ లతో గ్లామర్ ను బాగానే చూపిస్తున్నారు. ఇక ప్రతి శని, ఆది వారాల్లో హోస్ట్ నాగార్జున వచ్చి బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ఇంటి సభ్యుల ఆట తీరు, మాట తీరు, ప్రవర్తన తీరుపై రివ్యూలు చేస్తూ రేటింగ్ ఇస్తున్నాడు.

  బేడీలు వేసి ఉంచి వారిలో..

  బేడీలు వేసి ఉంచి వారిలో..

  ఇక బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఐదో వారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇంతకుముందు కంటే ఈసారి ఇద్దరు కంటెస్టెంట్లకు బేడీలు వేసి ఉంచి వారిలో నామినేట్ కాకుండా ఉండటానికి గల అర్హతలు చెప్పాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇంతకుముందులా నామినేషన్లలో ఫైటింగ్ లు గొడవలు లేకుండా బిగ్ బాసే ఇద్దరిని ఎంపిక చేసి వారిలో ఒకరిని నామినేట్ అవ్వాల్సిందిగా చెప్పాడు. అయితే ఎవరు నామినేట్ అవుతారో వారిద్దరే వాదించుకోవాలి. ఈ క్రమంలో ఇంటిలోకి జంటగా, ఇద్దరు ఒక్కరిగా ఆడుతున్న మెరీనా-రోహిత్ లు ఇక నుంచి జోడిగా కాకుండా విడివిడిగా సింగిల్ గా ఆడతారని చెప్పి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. మెరీనా-రోహిత్ లలో ఎవరినో ఒకరిని నామినేట్ అవ్వమని అడిగాడు.

  భర్త కోసం మెరీనా త్యాగం..

  భర్త కోసం మెరీనా త్యాగం..

  వారిద్దరిలో రోహిత్ కోసం మెరీనా త్యాగం చేసి నామినేట్ అయింది. నేను వెళ్లిన పర్వాలేదు కానీ, నువ్ ఉండాలిరా అంటూ తన భర్తను చాలా కష్టంగా ఒప్పించే ప్రయత్నం చేసింది. రోహిత్ కూడా ఒకవేళ తన భార్య మెరీనా ఎలిమినేషన్ అయితే ఎలా అన్నట్లుగా చాలా బాధపడిపోయాడు. వీళ్లద్దరి మధ్య డిస్కషన్, ఎవరికి వారు నామినేట్ అవ్వడానికి ప్రయత్నించడం కొంచెం ఎమోషనల్ గా సాగింది.

  అర్జున్ కు శ్రీసత్య హితబోధ..

  అర్జున్ కు శ్రీసత్య హితబోధ..

  ఇక అర్జున్ కల్యాణ్-శ్రీ సత్య మధ్య మంచి ఆసక్తికర వాదన జరిగింది. గత వారం నీకు చాలా హెల్ప్ చేశాను కదా అని అర్జున్ అంటే.. దానికి నువ్ ఫ్రీగా ఏం చేయలేదు కదా సర్వీస్ చేయించుకున్నావ్ కదా అంటూ చెప్పింది. నువ్ నామినేషన్లలో ఉంటే కచ్చితంగా సేవ్ అవుతావ్ అని నమ్ముతున్నా అని అర్జున్ కల్యాణ్ అన్న మాటలకు.. నువ్ నా మీద పెట్టుకోవడం కంటే నీ మీద నమ్మకం పెట్టుకో అని చెబుతున్నా అని శ్రీసత్య అంది. వీరిద్దరిలో అర్జున్ కల్యాణ్ నామినేట్ అయ్యాడు. నామినేట్ అయిన అనంతరం నువ్ వెళ్లిపోతే ఒక గంట బాధపడి నా ఆట నేను ఆడుకుంటా అని చెబితే నేనే నామినేట్ అయ్యేదాన్ని అని శ్రీసత్య చెప్పింది. నామీద కాకుండా నీ మీద నమ్మకం వచ్చేలా, శ్రీసత్య వల్ల నీ గేమ్ పోయిందనే మాటలు తెచ్చుకోవద్దు అంటూ అర్జున్ కల్యాణ్ కు హితబోధ చేసింది.

  నామినేట్ అవుతున్నావా..

  నామినేట్ అవుతున్నావా..

  తర్వాత వచ్చిన ఇనయా సుల్తానా-శ్రీహాన్ మధ్య ఎప్పటిలానే రసవత్తరంగా మాటలు జరిగాయి. నేను అన్నిట్లో హండ్రెడ్ పర్సంట్ ఇస్తున్నాను.. నేనైతే అస్సలు నామినేట్ అవ్వాలనుకోవట్లేదు అని ఇనయా అంటే.. పనులు చేస్తున్నావ్, గేమ్ ఆడుతున్నావ్.. మరి ఎంటర్ టైన్ మెంట్ ఏమైనా చేస్తున్నావా అని తిరిగి ప్రశ్నిస్తాడు శ్రీహాన్. దీనికి బిగ్ బాస్ అంటే ఎంటర్ టైన్మెంట్ ఒక్కటే కాదు అన్నింట్లో ఉండాలి అని ఇనయ అంటుంది. దీనికి బిగ్ బాస్ సీజన్ సిక్స్.. ఎంటర్ టైన్మెంట్ కి అడ్డా ఫిక్స్ అని ఇనయా సుల్తానాను మాట్లాడకుండా చేస్తాడు శ్రీహాన్. ఫైనల్ గా అడుగుతున్న నామినేట్ అవుతున్నావా అని ఇనయా అడిగితే శ్రీహాన్ అస్సలు అవ్వను అంటాడు. దీంతో బిగ్ బాస్ కనీసం ఫ్రెండ్స్ తో పెట్టిన బాగుండేది అని ఇనయా అంటే నువ్ నా ఫ్రెండే అని శ్రీహాన్ అంటాడు. ఫ్రెండ్ అయితే కెప్టెన్సీకి అర్హత లేదని అంతా ఈజీగా చెప్పరు అని అంటుంది ఇనయా.

  టైటిల్ కొట్టుకొనే వెళతాను..

  టైటిల్ కొట్టుకొనే వెళతాను..


  అప్పుడు కాదు ఇప్పుడు అని శ్రీహాన్ అన్న మాటతో.. ఇప్పుడు ఇచ్చేయాలి కాబట్టి ఫ్రెండ్ అంటున్నావ్.. వావ్.. గ్రేట్ యాక్టర్ అని ఇనయా అంటే థ్యాంక్యూ అని శ్రీహాన్ వెటకారంగా అన్నాడు. దీంతో నేనే నామినేట్ అవుతున్నా.. ఇక్కడే ఉంటాను.. టైటిల్ కొట్టుకునే వెళతాను.. నేను నీకన్న డిజర్వ్ అని చాలా కాన్పిడెంట్ గా నామినేట్ అవుతుంది ఇనయా సుల్తానా. ఆ తర్వాత ఇనయా మాటలకు ఆమెను మెచ్చుకుంటారు. ఈసారి ఇనయాను నామినేట్ చేయాలని లేకుండే, తనే నన్ను ఇంకా ఎన్మీలా చూస్తుంది, పాత విషయాలన్ని ఇంకా కంటిన్యూ చేస్తుంది అని శ్రీహాన్ చెబుతాడు.

  15వ వారం ఉంటానన్న నమ్మకం ఉంది..

  15వ వారం ఉంటానన్న నమ్మకం ఉంది..


  వీళ్ల తర్వాత ఆది రెడ్డికి, రేవంత్ మధ్య నామినేషన్ మొదలవుతుంది. ఇద్దరు పాయింట్స్ చెబుతారు. ఈ క్రమంలో తాను చాలా ఎమోషన్ అవుతున్నాను, ఈసారి నామినేషన్లలో ఉండాలనుకోవట్లేదు, కష్టాలు పడుతున్నాను, మీకన్నా ఎక్కువ డిజర్వ్ అనుకుంటున్నాను, 15వ వారం ఉంటానన్న నమ్మకం నాకుంది అని రేవంత్ చెప్పాడు. కష్టాలు దాటుకుంటూనే వెళ్లాలి, కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో నిరూపించుకోలేదు, 15వ వారం ఉంటానన్న నమ్మకం మీకున్నప్పుడు ఇప్పుడు నామినేట్ అవ్వకపోడవానికి పాయింట్ లేదు అని ఆది రెడ్డి వాదించాడు. ''నాకు ఈ వారం ఉంటానన్న నమ్మకం లేదు. నేను స్టెప్ బై స్టెప్ పోగ్రెస్ తో వెళ్లాలనుకుంటున్నాను'' అని ఆది రెడ్డి చెప్పాడు.

  ఒక తండ్రిగా అర్థం చేసుకోగలను..

  ఒక తండ్రిగా అర్థం చేసుకోగలను..

  ఒక తండ్రిగా మీరు చెప్పిన పాయింట్స్ నేను అర్థం చేసుకోగలను.. ఎవరికి వారికి ప్లాబ్లమ్స్ ఉన్నాయి, అలా అనుకుంటే నేను వదిలేసి వచ్చింది.. అని ఒక్క సెకను ఆది రెడ్డి ఆగితే పర్వాలేదు చెప్పండి అని రేవంత్ అన్నాడు. దీంతో నేను వదిలేసి వచ్చింది రెండు సార్లు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన నాన్నని, బ్లైండ్ చెల్లెలిని, 10 నెలల పాపను మా భార్యకు ఒక అద్దె ఇంట్లో వదిలేసి వచ్చా. సో వాళ్లది డిఫరెంట్ సినారియో. ఎవరి కష్టాలు వారికున్నాయి. అవి మర్చిపోయి స్ట్రెస్ లేకుండా, కాన్ఫిడెంట్ గా ఉంగలగాలి. అలా ఉంటున్నా. ఇంకా ఒక బిగ్ బాస్ రివ్యూవర్ గా అడుగు పెట్టాలంటే గట్స్ ఉండాలి. ఒక రివ్యూవర్ కు ఉన్నంతా నెగెటివిటీ హౌజ్ లో ఏ కంటెస్టెంట్ కు ఉండదు అని ఆది రెడ్డి తన ప్లాబ్లమ్స్ గురించి చెప్పాడు. అయినా చివరికీ రేవంత్ ఒప్పుకోకపోవడంతో ఆది రెడ్డి నామినేట్ అవుతున్నట్లుగా ప్రకటించాడు.

   ఐదో వారం నామినేషన్లలో..

  ఐదో వారం నామినేషన్లలో..

  ఆ తర్వాత ఆది రెడ్డి నామినేట్ అవ్వడం ఇష్టం లేదని, మీరు చెబుతుంటే చివుక్కుమందని, ఒకవైపు తనే నామినేట్ కావాలనిపించిందని కవర్ డ్రైవ్ చేసే ప్రయత్నం చేశాడు. అలాగే ఒక చోట కూర్చుని తనకు రెస్పాన్సిబులిటీ పెరిగిందని మాట్లాడుకుంటూ ఉన్నాడు రేవంత్. ఇక ఈ ఐదో వారం మొత్తం 8 మంది నామినేట్ అయ్యారు. వారిలో ఇనాయా సుల్తానా, మెరీనా, బాలాదిత్య, చలాకీ చంటి, జబర్ధస్త్ ఫైమా, వాసంతి కృష్ణన్, ఆది రెడ్డి, అర్జున్ కల్యాణ్‌లు ఉన్నారు.

  English summary
  Singer Revanth And Adireddy Argument In Bigg Boss Telugu 6 Fifth Week Nominations. And Adireddy Reveals His Family Problems In October 3rd Day 29 Episode 30.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X