Bigg Boss Telugu 6: అన్నం విషయంలో రేవంత్ సీరియస్.. ఒత్తిడి తట్టుకోలేక బిగ్ బాస్ తో మొరపెట్టుకున్న బాలాదిత్య
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ ఎమోషనల్ గా బాగా జరిగింది. అక్టోబర్ 13 గురువారం నాడు ప్రసారమైన 39వ రోజు 40వ ఎపిసోడ్ లో కంటెస్టెంట్ల ఎమోషన్స్ తో టాస్క్ పేరిట గేమ్ ఆడాడు బిగ్ బాస్. ఈ బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ లో భాగంగా సెల్ఫ్ నామినేట్ అయిన రోహిత్, అతని భార్య మెరీనా తప్ప మిగతా కంటెంస్టెంట్లందరికీ తమ ఇళ్ల నుంచి ఏదో ఒక సర్ ప్రైజ్ పొందారు. ఇక ఈ టాస్క్ లో ఒకరు సిగరెట్ల కోసం అల్లాడిపోగా.. అన్నం విషయంలో మరొకరితో రేవంత్ గొడవ పడ్డాడు. పూర్తి వివరాళ్లోకి వెళితే..

మిగిలిన వాళ్లవి ఎమోషన్స్ కావా..
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ తాజా ఎపిసోడ్ లో ఎమోషన్స్ పిండేశాడు బిగ్ బాస్. బాలాదిత్య త భార్యతో ఫోన్ మాట్లాడి ఆ ఎమోషన్స్ ని ఇంటి సభ్యులతో పంచుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. గీతూ రాయల్, ఆదిరెడ్డితో చెప్పుకుంటూ బాధపడిపోయాడు. అయితే ఆర్జే సూర్య మాత్రం మిగిలిన వాళ్లవి ఎమోషన్స్ కావా అని ఇనయా సుల్తానాతో సెటైర్ వేశాడు. తర్వాత సుదీప దగ్గర బాలాదిత్య కన్నీళ్లు పెట్టుకున్నాడు.

బ్యాటరీ రీఛార్జ్ జీరో అయిందని..
తన వల్ల బ్యాటరీ రీఛార్జ్ జీరో అయిందని.. అది తప్పా.. ఒప్పా.. అని ఫీల్ అయ్యాడు. తన కూతురితో మాట్లాడటం అన్నాక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అంటూ తన బాధను చెప్పుకొచ్చాడు బాలాదిత్య. అయితే బాలాదిత్య బ్యాటరీ 80 శాతం ఛార్జ్ అయేందుకు స్మోకింగ్ చేయడాన్ని త్యాగం చేసిన విషయం తెలిసిందే. తర్వాత చాలా సేపు వరకు సిగరెట్లు లేకపోవడంతో ఒత్తిడికి గురయ్యాడు బాలాదిత్య.

టాస్క్ ఆగిపోయిందికదా..
దీంతో బిగ్ బాస్ కెమెరాల వద్దకు వెళ్లి.. ప్లీజ్ బిగ్ బాస్ టాస్క్ ఆగిపోయింది కదా.. నాకు కొన్ని సిగరెట్లు పంపించండి అని రిక్వెస్ట్ చేశాడు. ఆదిరెడ్డితో టాస్క్ ఆగిపోయిందికదా.. పంపించొచ్చు కదా.. నేను ఇలా అడగొచ్చా అని అడిగాడు బాలాదిత్య. దీంతో ఆదిరెడ్డి వాళ్లు పంపించరు బ్రో అని చెప్పాడు. ఆ తర్వాత కూడా బాలాదిత్య మళ్లీ కెమెరాల వద్దకు వెళ్లి ప్లీజ్ బిగ్ బాస్ టాస్క్ ఆపేశారు కదా.

మళ్లీ ఉదయానకి తిరిగి పెట్టేస్తా..
ఈ రాత్రికి పంపండి మళ్లీ ఉదయానకి తిరిగి పెట్టేస్తా అని రిక్వెస్ట్ చేశాడు. అయితే మరోవైపు గీతూ రాయల్ మాత్రం తెగ సంతోషపడింది. నువ్ సిగరెట్ తాగకుండా ఉండటం చూస్తే నాకు భలే హ్యాపీగా ఉందన్న అని చెప్పింది. ఇక అనంతరం కెప్టెన్ రేవంత్ దగ్గరికి వెళ్లిన ఆదిరెడ్డి.. కెప్టెన్ మధ్యాహ్నం పూట రైస్ కాస్త ఎక్కువ పెట్టండి. రైస్ సరిపోవడంలేదు కదా అని అడిగాడు. అందుకు నీకు ఎప్పుడు సరిపోలేదు అని అడిగాడు రేవంత్.

బియ్యం ఎక్కువ ఉన్నాయి కదా బ్రో..
బియ్యం ఎక్కువ ఉన్నాయి కదా బ్రో.. అందుకే అడిగా.. అని ఆదిరెడ్డి అనడంతో రైస్ వేస్ట్ కాకూడదు.. ఇంత కూడా రైస్ వేస్ట్ అయితే ఒప్పుకోను అని రేవంత్ అన్నాడు. దీంతో అదేంటీ బ్రో మీ కెప్టెన్సీ లో అన్నం లేక ఒకరు ఇబ్బంది పడటం మీకు ఇష్టమా అని ఆదిరెడ్డి అనడంతో మీరు ఇబ్బంది పడ్డారా అని కాస్త సీరియస్ అయ్యాడు రేవంత్. రైస్ ఎక్కువ ఉన్నప్పుడు కాస్తా ఎక్కువ పెడితే ఏమౌతుంది బ్రో.. కావాలంటే రాత్రికి తగ్గించుకుందాం ఆదిరెడ్డి అన్నా కూడా సీరియస్ గానే బిహేవ్ చేశాడు.

ఇప్పుడు కాస్తా ఎక్కువ రైస్ పెట్టు..
మధ్యలో శ్రీహాన్ కూడా వచ్చి ఇప్పుడు కాస్తా ఎక్కువ రైస్ పెట్టు.. కావాలంటే నైట్ కు తగ్గించుకోవచ్చు.. రైస్ వేస్ట్ అయ్యే సమస్య రాదు అని చెప్పాడు. అయినా రేవంత్ కొంచెం అతిగానే బిహేవ్ చేశాడు. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఆరో వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో పాల్గొనేందుకు మొత్తం 8 మంది ఆదిరెడ్డి, వాసంతి, ఆర్జే సూర్య, అర్జున్ కల్యాణ్, శ్రీ సత్య, రాజ శేఖర్, రోహిత్, రేవంత్ ఉన్నారు.


Click it and Unblock the Notifications











