twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: మాజీ విన్నర్స్ ఫార్మాట్ లో రేవంత్.. అలా క్లిక్కయితే గెలిచినట్లే!

    |

    బిగ్ బాస్ లో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. ఒక విధంగా బిగ్ బాస్ ఎలిమినేషన్ విషయంలో అయితే ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. బలంగా ఉన్న కంటెస్టెంట్స్ కాస్త చిరాకు తెప్పించిన కూడా బయటకు పంపిస్తున్నారు. అయితే ఇప్పుడు మోస్ట్ ఫేవరెట్ హౌస్ మెట్ గా ఉన్న రేవంత్ కొంత మాజీ ప్లేయర్స్ ఫార్మాట్లో వెళుతున్నట్లు అనిపిస్తోంది. ఒకవేళ ఆ ఫార్మాట్లో క్లిక్ అయితే మాత్రం చివరి వరకు నిలుస్తాడు అని టైటిల్ విన్నర్ గా కూడా నిలిచే అవకాశం ఉంటుంది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

    రిస్క్ తీలుకోవడం లేదు

    రిస్క్ తీలుకోవడం లేదు

    బిగ్ బాస్ 6వ సీజన్ చాలా నీరసంగా కొనసాగుతోంది అనే కామెంట్స్ అయితే చాలానే వస్తున్నాయి. రేటింగ్స్ కూడా అంతగా పెరగడం లేదు అని అందుకే బిగ్ బాస్ టాస్క్ ల విషయంలో చాలా సీరియస్ గా ఉంటున్నాడు అని అర్థమవుతుంది. అదేవిధంగా ఆటలు సీరియస్ ఆడలేని లేని వారు ఏమాత్రం చిరాకు తెప్పించినా కూడా బిగ్ బాస్ అసలు కూడా ఛాన్స్ తీసుకోవడం లేదు. గీతు రాయల్ ఎలిమినేట్ చేయడంతో మిగతా హౌస్ మెంట్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

     నెంబర్ వన్ స్థానంలో

    నెంబర్ వన్ స్థానంలో

    తేడా వస్తే ఇప్పుడు టాప్ 5 లో ఉన్న వారిని కూడా హౌస్ లో నుంచి పంపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనే స్థాయికి బిగ్ బాస్ పరిస్థితి వచ్చింది. అయితే రేవంత్ మాత్రం చాలా దూకుడుగానే ఆడుతున్నాడు. మొదటినుంచి కూడా అతను టైటిల్ ఫేవరెట్ గా క్రేజ్ అయితే అందుకుంటు ఉన్నాడు. ముఖ్యంగా ఓట్ల విషయంలో కూడా అతనికి ప్రతిసారి నెంబర్ వన్ స్థానంలో చోటు దక్కించుకోవడం విశేషం.

    మూల్యం చెల్లించుకోక తప్పలేదు

    మూల్యం చెల్లించుకోక తప్పలేదు

    మొదట అబ్బాయిలలో అయితే ఇప్పుడు రేవంత్ ఫైనల్ లో విన్నర్ అవుతాడు అని ఓవర్గం నేటిజన్స్ నుంచి మద్దతు అందుకుంటున్నాడు. అయితే మొన్నటి వరకు అమ్మాయిలలో గీతూ రాయల్ రేవంత్ కు సరైన పోటీగా నిలుస్తుంది అని కూడా అనుకున్నారు. ఆమె కూడా చివరి వరకు ఫైనల్స్ వరకు ఉంటుంది అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. కానీ మధ్యలో ఆమె కొన్ని తప్పటడుగులు వేయడంతో మూల్యం చెల్లించుకోక తప్పలేదు.

    కౌశల్ తరహాలో కాకుండా

    కౌశల్ తరహాలో కాకుండా

    అయితే ఇప్పుడు రేవంత్ కొంతమంది మాజీ బిగ్ బాస్ విన్నర్స్ తరహాలో కొనసాగుతున్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ప్రతి ఆటలో కూడా అతను అగ్రేషన్ గానే ఆడుతున్నాడు. అంతేకాకుండా ఫిజికల్ టాస్క్ లలో అయితే ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా సీరియస్ గా ముందుకు వెళుతున్నాడు. గతంలో కౌశల్ ముండా కూడా ఇదే తరహాలో వెళ్ళాడు. కానీ ఇక్కడ రేవంత్ మాత్రం పూర్తిగా ఆ స్టైల్ లో కాకుండా ఓ వర్గం వారిని తన వైపుకు తిప్పుకుంటూ మరి కొంతమందికి శత్రువుగా మారుతున్నాడు.

     అర్జున్ రెడ్డి తరహాలో

    అర్జున్ రెడ్డి తరహాలో

    ఇక మూడో సీజన్లో విన్నర్ గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ కూడా కొన్ని సందర్భాల్లో చాలా సీరియస్ గా ముందుకు వెళ్లాడు. కానీ అతను కూడా లాజిక్స్ తో ఆలోచిస్తూ ఫిజికల్ టాస్క్ లలో కోప్పడుతూ ముందుకు వెళ్లాడు. ఆవేశంతో బిగ్ బాస్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయ్యారని లేదు. కానీ వారి క్యారెక్టర్ జనాలకు అర్జున్ రెడ్డి తరహాలో నచ్చాలి. ఇక ఇప్పుడు రేవంత్ కూడా అదే తరహాలో అర్జున్ రెడ్డి అనే తరహాలో గుర్తింపు అయితే అందుకుంటున్నాడు. మరి కౌశల్ మండ, రాహుల్ సిప్లిగంజ్ తరహాలో చాలా కోపంగా అగ్రేషన్ తో వెళ్తున్న రేవంత్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలుస్తాడో లేదో చూడాలి.

    English summary
    Bigg Boss Telugu 6 revanth following formar title winners
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X