Bigg Boss Telugu 6: కెప్టెన్ గా ఫైమా? కన్నీళ్లు పెట్టుకున్న రేవంత్.. కన్ఫెషన్ రూమ్ కి బిగ్ బాస్ పిలుపు
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ రోజురోజుకి రసవత్తరంగా సాగుతోంది. టాస్క్ ల్లో ఫిజికల్ అవ్వడాలు, వీక్ నెస్ లపై దెబ్బ కొట్టడం, ఫేవరిటిజం చూపించడం వంటి తదితర ఆసక్తకిర అంశాలతో జోరుగా నడుస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో ఇంటి సభ్యుల మధ్య కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తోంది. స్నేక్స్ అండ్ లాడర్స్ గేమ్ ను ఆడించాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో స్నేక్స్ టీమ్ గెలిచి ఆరుగురు కెప్టెన్సీ కంటెండర్స్ గా మరో రౌండ్ కు చేరుకున్నారు. అలాగే లాడర్స్ టీమ్ నుంచి మెరీనా ఎంపికైంది. తాజాగా వీరందరికీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో పక్షపాతం, అగ్రెషన్ స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన నవంబర్ 10 ఎపిసోడ్ ప్రోమో వివరాల్లోకి వెళితే..
Photos Courtesy: Star మా and Disney+Hotstar

21 మందిలో తొమ్మిది మంది..
ఈ బిగ్ బాస్ తెలుగు 6 సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌లు 21 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరిలో తొమ్మిది వారాల్లో షానీ సల్మాన్, అభినయ శ్రీ, నేహా చౌదరి, ఆరోహి రావు, చంటి, సుదీప పింకీ, అర్జున్, సూర్య, చిత్తూరు చిరుత గీతూ రాయల్ ఎలిమినట్ అయి వెళ్లిపోయారు.

కెప్టెన్సీ కంటెండర్ టాస్క్..
బిగ్ బాస్ తెలుగు 6 పదో వారం నామినేషన్లలో బాలాదిత్య, మెరీనా అబ్రహం, కీర్తి భట్, జబర్దస్త్ ఫైమా, వాసంతి కృష్ణన్, సింగర్ రేవంత్, రివ్యూవర్ ఆదిరెడ్డి, శ్రీహాన్ చోటు, ఇనయా సుల్తానా మొత్తం 9 మంది ఉన్నారు. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఇంటి సభ్యులందరికీ స్నేక్స్ అండ్ లాడర్స్ టాస్క్ ఇచ్చారు. వారిలో స్నేక్స్ టీమ్ నుంచి ఆదిరెడ్డి, ఫైమా, రోహిత్, వాసంతి, కీర్తి భట్, వాసంతి కంటెండర్ టాస్క్ కు వెళ్లారు.

పదోవారం కెప్టెన్..
ఇక బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ పదో వారం కెప్టెన్సీ టాస్క్ ప్రారంభమైంది. ప్రతి ఒక్కరు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కెప్టెన్సీ కంటెండర్లుగా మిగిలిన వారికి సంచాలక్ గా రేవంత్ వ్యవహరించాడు. వారిలో చివరిగా ఫైమా, ఆదిరెడ్డి, రోహిత్, శ్రీసత్యకు పోటీ పడినట్లు తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ పదో వారం కెప్టెన్ గా ఫైమా నిలిచినట్లు బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.

బూడిదలో పోసిన పన్నీరు..
నవంబర్ 10 ఎపిసోడ్ నాటి రెండో ప్రోమోలో సింగర్ రేవంత్ చాలా డల్ కనిపించాడు. దీంతో శ్రీ సత్య, శ్రీహాన్ ఓదార్చే ప్రయత్నం చేశారు. నిన్నటి ఆటలో తన తలపైన రేవంత్ ఉన్నాడని శ్రీసత్య అరిచిన విషయం తెలిసిందే. దానికి బాధపడుతున్నాడేమోనని వచ్చి తన వెర్షన్ వినిపించింది. దానికి ఎంత ఆడిన బూడిదలో పోసిన పన్నీరైంది కదా అంటూ బదులిచ్చాడు రేవంత్. తర్వాత అంత కష్టపడి మట్టి తెచ్చి అందరికీ ఇచ్చిన ఫలితం దక్కలేదంటూ తనలో తానే బాధపడుతూ కనిపించాడు.

నాతో నాకే ప్రాబ్లమ్..
రేవంత్ ను అలా బాధపడుతుండగా వచ్చిన ఆదిరెడ్డి.. బ్రో ఎక్కుగా రియాక్ట్ అవద్దు ప్లీజ్ అంటూ కన్నీళ్లు తుడిచాడు. దీనికి తాను ఒక లూజర్ అంటూ మాట్లాడాడు. తర్వాత వచ్చిన మెరీనా కూడా రేవంత్ కన్నీళ్లు తుడిచింది. అనంతరం శ్రీసత్య మరోసారి రేవంత్ దగ్గరికి వెళ్లి ఇలా దయచేసి ఉండొద్దని, తనతో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పమని అడిగింది. దానికి నాతో నాకే ప్రాబ్లమ్ అంటూ ఎమోషనల్ గా చెప్పాడు. దీంతో బిగ్ బాస్ రేవంత్ ను కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు.


Click it and Unblock the Notifications











