For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: నామినేషన్లలో ఏడ్చేసిన లేడి కంటెస్టెంట్లు.. బల్ల గుద్ది కోపం చూపించిన రేవంత్

  |

  బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ మంచి జోరుగా సాగుతోంది. అరుపులు, గొడవలు, వాగ్వాదాలు, ట్విస్ట్ లు, ఓవరాక్షన్ లతో రసవత్తరంగా ఉంది. ఇక సోమవారం వచ్చిందంటే చాలు నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. అయితే ఎప్పటిలా తమకు నచ్చని, అర్హత లేని కంటెస్టెంట్లను నామినేట్ చేయడానికి బదులు ఇద్దరిని బిగ్ బాస్ ఎంపిక చేసి వారిలో ఎవరు నామినేట్ అవ్వాలనుకుంటారు, కాదు అనుకుంటారు అని తేల్చుకోవాల్సిందిగా ఆదేశించాడు బిగ్ బాస్. దీంతో ఈ నామినేషన్స్ ప్రక్రియ గొడవకంటే ఎవరి బలాలు, బలహీనతలు చెప్పుకుంటూ ఎమోషనల్ గా సాగింది. ఈ క్రమంలోనే జోడిగా ఎంపిక అయిన ఇద్దరు లేడి కంటెస్టెంట్లు వాదించుకుని తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత పనిష్ మెంట్ విషయంలో రేవంత్, కీర్తి భట్ మధ్య గొడవ జరిగింది.

  కొత్త కంటెంట్‌తో..

  కొత్త కంటెంట్‌తో..

  తెలుగులో బిగ్ బాస్ ‌షో ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దాన్ని గతంలో ఎన్నడూ చూడని కొత్త కంటెంట్‌తో ప్రసారం చేస్తున్నారు. దీంతో ఇది మరింత కొత్తగా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతోంది. కానీ, ఈ సీజన్‌కు గతంలో వాటికి మాదిరిగా రేటింగ్ మాత్రం స్పందన మాత్రం దక్కట్లేదు. దీంతో రేటింగ్ క్రమంగా పడిపోతోంది.

  4 వారాల్లో నలుగురు..

  4 వారాల్లో నలుగురు..

  ఆరో సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు హౌస్‌లోకి ప్రవేశించారు. వీరిలో నాలుగు వారాల్లో షానీ, అభినయ, నేహా, ఆరోహి ఎలిమినేట్ అయ్యారు.

  కొంచెం ఎమోషనల్ గా, ఇంకొంచెం వాగ్వాదాలు..

  కొంచెం ఎమోషనల్ గా, ఇంకొంచెం వాగ్వాదాలు..


  ఇక బిగ్ బాస్ తెలుగు 6 అక్టోబర్ 3 సోమవారం నాడు ప్రసారమైన 29వ రోజు 30వ ఎపిసోడ్ కొంచెం ఎమోషనల్ గా, ఇంకొంచెం వాగ్వాదాలు, గొడవతో రసవత్తరంగా సాగింది. ఎప్పటిలానే బిగ్ బాస్ తెలుగు 6 ఐదోవారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇంతకుముందు కంటే ఈసారి ఇద్దరు కంటెస్టెంట్లకు బేడీలు వేసి ఉంచి వారిలో నామినేట్ కాకుండా ఉండటానికి గల అర్హతలు చెప్పాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు.

  ఒకరిని నామినేట్ అవ్వాల్సిందిగా..

  ఒకరిని నామినేట్ అవ్వాల్సిందిగా..

  ఇంతకుముందులా నామినేషన్లలో ఫైటింగ్ లు గొడవలు లేకుండా బిగ్ బాసే ఇద్దరిని ఎంపిక చేసి వారిలో ఒకరిని నామినేట్ అవ్వాల్సిందిగా చెప్పాడు. అయితే ఎవరు నామినేట్ అవుతారో వారిద్దరే వాదించుకోవాలి. ఈ క్రమంలోనే సుదీప-వాసంతి ఇద్దరిని ఎంపిక చేసిన బిగ్ బాస్ వారిలో నామినేట్ ఎవరు అవుతారో చెప్పాల్సిందిగా కోరాడు. ఈ క్రమంలో సుదీప, వాసంతి వాదించుకున్నారు.

   ఒకరు ముందుకు వెళ్లాలి ఒకరు ఆగాలి..

  ఒకరు ముందుకు వెళ్లాలి ఒకరు ఆగాలి..


  గేమ్ లో ఆడటానికి వచ్చాం. సో గేమ్ లో ఒకరు ముందుకు వెళ్లాలి ఒకరు ఆగాలి. సో ముందుకు వెళ్లాలంటే మనం చూపించుకోవాలి, మనం ఛాన్స్ తీసుకోవాలి. నేను ఇప్పటివరకు అలానే ఛాన్స్ తీసుకుంటూ వస్తున్నాను, తాను టెన్షన్ జోన్లకు వెళ్లాలనుకోవట్లేదని, ఎలాంటి టెన్షన్ లేకుండా ఈవారం గేమ్ ను ఆడి తనేంటే నిరూపించుకోవాలనుకుంటున్నట్లు సుదీప చెబుతుంది. తనకు ఒక్క అవకాశం ఇస్తే నిరూపించుకుంటానని, మీకైనా కొంచెం ఫేమ్ ఉంది. నాకు అది కూడా లేదు. ఈసారి నామినేట్ అయితే నేను ఈ హౌజ్ లో కొనసాగకపోవచ్చు అని వాసంతి చెబుతుంది. దీంతో ఇదేం ఒక కప్పు కాఫీ కాదు కదరా అడిగితే ఇచ్చేయడానికి అని సుదీప ఆన్సర్ ఇస్తుంది.

   మీకు అడ్వాంటేజ్ ఉంది..

  మీకు అడ్వాంటేజ్ ఉంది..


  మీకు అడ్వాంటేజ్ ఉంది అని వాసంతి అంటే.. అడ్వాంటేజ్ ఉన్నా రిస్క్ తీసుకోలేను, నామినేట్ అయ్యామనే స్ట్రెస్ వారం మొత్తం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, నేను గేమ్ ఆడి నిరూపించుకోవాల్సింది ఇంకా ఉంది, నామినేట్ అయితే నా గేమ్ పై ఫోకస్ పెట్టలేను ఆ పాయింట్ పెడుతున్నాను తప్పా.. నువ్ ఉండకూడదు చేయకూడదు అనేది నా పాయింట్ కాదు అని సుదీప చెప్పడంతో సంకెళ్లు తీసేసుకుని వెళ్లిపోయి ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకుంటుంది వాసంతి.

  ఏడిపించాలని ఇంటెన్షన్ కాదు..

  ఏడిపించాలని ఇంటెన్షన్ కాదు..

  అలా వెళ్లిన వాసంతిని ఓదారుస్తుంది సుదీప. ఈ క్రమంలో తనను ఏడిపించాలని తన ఇంటెన్షన్ కాదన్నట్లుగా చెప్పుకొస్తుంది సుదీప. అదంతా ఏం లేదు అక్క యూ ఆర్ మై ఫేవరేట్ అంటుంది వాసంతి. దీని తర్వాత మెరీనా దగ్గరకు వెళ్లి హగ్ చేసుకుని ఏడుస్తుంది సుదీప. మరోవైపు గేమ్ అంతగా ఆడనప్పుడే నన్ను ఆడియెన్స్ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు మరింత గేమ్ ఆడితే డెఫినెట్ గా హౌజ్ లో ఉంచుతారు అని వాసంతి అనుకుంటుంది.

   ఎరైనా ఉన్నారా..

  ఎరైనా ఉన్నారా..

  ఇదిలా ఉంటే నామినేషన్ల తర్వాత బిగ్ బాస్ హౌజ్ బయట పలు సౌండ్లు వినిపించడంతో రేవంత్, ఫైమా, ఆర్జే సూర్య స్పందిస్తారు. ఎరైనా ఉన్నారా అని రేవంత్ అంటాడు. దీంతో బయట విషయాలకు స్పందించకూడాదు అని ముగ్గురికి చెబుతాడు బిగ్ బాస్. దీంతో రేవంత్ సారీ చెబుతాడు. ఇదంతా ఇంటి కెప్టెన్ గా చూసుకునే బాధ్యత మీదే కీర్తి అని చురక అంటిస్తాడు బిగ్ బాస్. దీంతో తను బాధ్యత పనిష్ మెంట్ తీసుకోవాలనుకుంటుంది కీర్తి. దీంతో రేవంత్ అలా ఎలా తీసుకుంటారు. చూసుకునే బాధ్యత మీది అన్నారు కానీ పనిష్ మెంట్ తీసుకోవాల్సిందిగా చెప్పలేదు. అర్థం చేసుకోకుండా ఎలా తీసుకుంటారు అని రేవంత్ అంటాడు.

   కెప్టెన్ గా ఇది నా నిర్ణయం..

  కెప్టెన్ గా ఇది నా నిర్ణయం..


  నా పేరు వచ్చింది కాబట్ట నేను తీసుకుంటాను, కెప్టెన్ గా ఇది నా నిర్ణయం అన్నట్లుగా మాట్లాడిన కీర్తితో నువ్ కెప్టెన్ కాబట్టి అది నీ ఇష్టం అంతేగా అనుకుంటూ కోపంగా బల్లను గుద్ది వెళ్లిపోతాడు రేవంత్. అలా టేబుల్ ను కొట్టి వెళ్లటం కచ్చితంగా తప్పు. మీరు నాకు విలువ ఇస్తారో తెలియదు గానీ, కెప్టెన్ గా మాత్రం ఇవ్వాలి. నా పేరు చెప్పింది కాబట్టి నేను చెప్పింది వినాలి అని కీర్తి అంటుంది. మీకు లాంగ్వేజ్ కారణంగా అర్థం కాలేదు అన్న రేవంత్ పై ఫైర్ అవుతుంది కీర్తి. అలా ఎలా అంటారు. నాకు భాష అర్థం కాకుంటే ఇక్కడ ఎందుకు ఉంటాను. నేను కెప్టెన్ గా ఉన్నప్పుడు బిగ్ బాస్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసేలా ప్రవర్తించకండి అని అంటుంది కీర్తి. ఇలా కొద్దిసేపు హీట్ తర్వాత రేవంత్ వచ్చి కీర్తికి సారీ చెప్పి వెళ్లిపోతాడు.

  English summary
  Singer Revanth And Keerthi Bhat Argument In Bigg Boss Telugu 6 After Fifth Week Nominations. And October 3rd Day 29 Episode 30 Highlights.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X