twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6 నేరుగా ఫినాలేకు వెళ్లేందుకు కొత్త టాస్క్.. శ్రీసత్యపై రేవంత్ ఫైర్!

    |

    బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అనూహ్య పరిణామాలతో దూసుకుపోతోంది. ఎన్నో అనుమానాలు, అంచనాల మధ్య ప్రారంభమైన ఈ సీజన్ దాదాపుగా పూర్తి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌజ్ లో 8 మంది ఉన్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో వీరి మధ్య పెట్టిన నామినేషన్ల పర్వం వాడివేడీగా జరిగింది. ఈ వారం మధ్యలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే డైరెక్ట్ ఫినాలేకు వెళ్లిపోయేందుకు హౌజ్ మేట్స్ కు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ ను నవంబర్ 29 మంగళవారం ఎపిసోడ్ లో చూపించనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన 86వ రోజు ప్రోమోను విడుదల చేశారు.

    ప్రస్తుతం 8 మంది..

    ప్రస్తుతం 8 మంది..

    బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఇప్పటికీ ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ (నాన్ స్టాప్) వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఆరో సీజన్ కూడూ దాదాపు పూర్తి దశకు వచ్చింది. ఇప్పటికీ బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 85 రోజులు 86 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ కి 21 మంది కంటెస్టెంట్లు రాగా ప్రస్తుతం 13వ వారానికి 8 మంది మిగిలారు. 12వారం ఎలిమినేషన్ కింద మోడల్ రాజశేఖర్ బిగ్ బాస్ హౌజ్ వీడి వెళ్లిపోయాడు.

    ఆ ఇద్దరు సేఫ్..

    ఆ ఇద్దరు సేఫ్..

    ఇక ప్రతి సోమవారం నామినేషన్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 13వవారం నామినేషన్స్ ప్రక్రియ మరింత వాడీ వేడిగా సాగింది. ఈ వారం నామినేషన్లలో కెప్టెన్ అయినా కారణంగా ఇనయా సుల్తానా, ఎవరు నామినేట్ చేయనందున శ్రీహాన్ సేఫ్ అయ్యాడు. దీంతో మిగతా ఇంటి సభ్యులు అయినా రోహిత్, రేవంత్, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీ సత్య, కీర్తి భట్ ఆరుగురు నామినేట్ అయ్యారు. వీరంత ప్రస్తుతం నామినేషన్ లో ఉన్నారు.

    టికెట్ టు ఫినాలే టాస్క్..

    టికెట్ టు ఫినాలే టాస్క్..

    ఇదిలా ఉంటే తాజాగా నవంబర్ 29 మంగళవారం నాటి 86వ రోజు ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో ఇంటి సభ్యులు నేరుగా ఫినాలేకు వెళ్లేందుకు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. బిగ్ బాస్ విన్నర్ గా నిలవడానికి ఫినాలే వీక్ కి చేరుకుని మొదటి ఫైనలిస్ట్ అనే అపురూపమైన గౌరవం సొంతం చేసుకోవడానికి బిగ్ బాస్ మీకు ఇస్తున్న టాస్క్ 'టికెట్ టు ఫినాలే' అని శ్రీహాన్ చేత చెప్పించారు.

     ఇనయా నుంచి లాక్కున్న ఫైమా..

    ఇనయా నుంచి లాక్కున్న ఫైమా..

    'టికెట్ టు ఫినాలే'లో భాగంగా బిగ్ బాస్ పంపించే స్నో మ్యాన్ పార్ట్స్ ను కలెక్ట్ చేసుకుని వాటితో వారి వారి స్నో మ్యాన్ ను కట్టి ఆ పార్ట్స్ ని ఇతర ఇంటి సభ్యుల నుంచి కాపాడుకోవాల్సి ఉంటుంది. దీంతో స్నో పార్ట్స్ కోసం అందరూ పోటీ పడ్డారు. ఇనయా సుల్తానా నుంచి లాక్కునేందుకు ఆదిరెడ్డి, ఫైమా చాలా ట్రై చేశారు. ఇంకా పడతాయి ఫైమా అని ఇనయా సుల్తానా చెప్పిన ఆమె వినిపించుకోలేదు.

    విరిగిన పార్ట్ తో అతికిస్తూ..

    విరిగిన పార్ట్ తో అతికిస్తూ..

    శ్రీసత్య విరిగిన స్నో పార్ట్ ను అతికించి పెడుతుంటే.. అలా చేసేది కౌంట్ లోకి రాదు సత్య అని సంచాలక్ గా ఉన్న రేవంత్ చెప్పాడు. ఇప్పుడేమైనా అతికించినట్లు తెలుస్తుందా. కౌంట్ చేయకపోతే నీ ఇష్టం. ఏదో అతికించుకుంటున్న కదా అని శ్రీసత్య అంది. అయితే ఆ అతికించిన పార్ట్ కిందపడిపోయింది. దీంతో తన స్నో మ్యాన్ పార్ట్స్ మీకు ఎవరికైనా కావాలా అని శ్రీసత్య అడిగింది.

    చెప్పకముందే లాజిక్స్ ఏంటీ..

    చెప్పకముందే లాజిక్స్ ఏంటీ..

    తన స్నో మ్యాన్ పార్ట్స్ ఎవరికైనా కావాలా అని శ్రీసత్య అడగడంతో నాకివ్వురా అవి నావే కదా అని ఫైమా అంది. దీంతో అలా ఇచ్చుకోవడాలు లేవు. నేను సంచాలక్ అని రేవంత్ అన్నాడు. అది ఎవ్వరైనా అని శ్రీసత్య అంటుంటే.. నన్ను ఫస్ట్ చెప్పనివ్వు.. నేను చెప్పకముందే అన్ని నువ్ లాజిక్ పాయింట్స్ మాట్లాడితావేంటీ నాకు అర్థం కాదు ప్రతిసారీ అని రేవంత్ ఫైర్ అయ్యాడు. నేను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు.. ఎవరి దగ్గరి నుంచైనా తీసుకోవచ్చు అని శ్రీసత్య అంటే ఇచ్చుకోవడాలు లేవని సంచాలక్ రేవంత్ తేల్చి చెప్పాడు.

    తొలగిపోయే సభ్యులు ఎవరు..

    తొలగిపోయే సభ్యులు ఎవరు..

    రేవంత్ అలా చెప్పిన వెంటనే.. ఈ రౌండ్ లో పోటీ నుంచి తొలగిపోవాల్సిన సభ్యులు ఎవరో.. బిగ్ బాస్ కి చెప్పండి అని బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయాడు రేవంత్. అలాగే ఎవరు తొలగిపోతారా అని ఇంటి సభ్యుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇలా ఈ ఎపిసోడ్ మొదటి ప్రోమో ముగిసింది. అసలు ఏమైందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే.

    English summary
    Revanth Serious On Sri Satya In Bigg Boss Telugu Season 6 Ticket To Finale Task And November 29 Episode Promo Released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X