Bigg Boss Telugu 6 అతన్ని బాత్రూమ్ లో ఉంచి అలా ఘోరంగా!.. శ్రీసత్యతో రేవంత్ 'గుడ్డు' గొడవ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అనూహ్య పరిణామాలతో దూసుకుపోతోంది. ఎన్నో అనుమానాలు, అంచనాల మధ్య ప్రారంభమైన ఈ సీజన్ దాదాపుగా పూర్తి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌజ్ లో 8 మంది ఉన్నారు. ఇక గత రెండు ఎపిసోడ్స్ లలో టికెట్ టు ఫినాలే టాస్క్ ఆడుతున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్స్ పోటీ పడుతున్నారు. మొదటి రౌండ్ లో శ్రీసత్య, రెండో రౌండ్ లో ఇనయా సుల్తానా తొలగిపోయిన విషయం తెలిసిందే. పాయింట్స్ రూపంలో కంటెస్టెంట్స్ స్థానాలు దక్కించుకోగా ఈ టాస్క్ ఇంకా కొనసాగుతోంది. డిసెంబర్ 1 గురువారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

 బాత్రూమ్ నడుస్తూ కామెడీ..

బాత్రూమ్ నడుస్తూ కామెడీ..

ప్రోమో ప్రారంభంలో ఇడియట్ సినిమాలోని ఓ సాంగ్ పాడుతూ కనిపించారు రేవంత్ అండ్ శ్రీహాన్. అయితే తర్వాత ఆ పాటను సెటైరికల్ గా ఇనయా సుల్తానా వైపు తిప్పారు. దీంతో గొడుగు తీసుకుని రేవంత్ ను కొట్టేందుకు బయలుదేరింది ఇనయా. అప్పుడు రేవంత్ ఉన్న చోటు నుంచి కామెడీ తెప్పించేలా నడుస్తూ బాత్రూమ్ లోకి వెళ్లాడు. రేవంత్ బాత్రూమ్ లోనే ఉండగా దాని లాక్ ని తీసేందుకు ప్రయత్నించారు శ్రీహాన్ అండ్ ఫైమా.

గుడ్డు జాగ్రత్త టాస్క్..

గుడ్డు జాగ్రత్త టాస్క్..

శ్రీహాన్ బాత్రూమ్ లాక్ తీసేందుు ప్రయత్నించగా రేయ్ బాత్రూమ్ లో ఉన్నాన్ రా అంటూ రేవంత్ అరిచాడు. దీంతో అందరు నవ్వారు. తర్వాత ఫైమా, ఇనయా సుల్తానా కలిసి ఆ డోర్ ను అటువైపే ఉండేలా బలం ప్రయోగించారు. అనంతరం టికెట్ టు ఫినాలే పోటీదారులకు మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ పేరు గుడ్డు జాగ్రత్త. ఈ ప్రకటన అనౌన్స్ చేస్తూ కళ్లు పెద్దవిగా చేశాడు శ్రీహాన్.

బాడీకి టచ్ అవ్వొద్దు..

బాడీకి టచ్ అవ్వొద్దు..

కంటెస్టెంట్స్ ముందు గజిబిజిగా వైర్స్ కట్టి ఉంటాయి. వాటిలోనుంచి గుడ్డును ఒక వస్తువుపై పెట్టుకుని కిందపడకుండా ఆ వైర్స్ దాటుకుంటూ వెళ్లాలి. ఆ తర్వాత టైర్స్ లో నుంచి నడుచుకుంటూ వెళ్లాలి. ఈ పోటీలో రోహిత్, రేవంత్, ఆదిరెడ్డి పాల్గొన్నట్లు చూపించారు. ఈ టాస్క్ కు సంచాలకులుగా శ్రీసత్య, ఇనయా ఉన్నట్లు తెలుస్తోంది. టాస్క్ ప్రారంభం కాగానే గుడ్డు బాడీకి టచ్ కావొద్దని శ్రీసత్య సూచనలు ఇచ్చింది.

 కిందపడకుండా ఉండేందుకు..

కిందపడకుండా ఉండేందుకు..

వైర్స్ మధ్యలో ఆదిరెడ్డికి ఇచ్చిన గుడ్డు కిందపడింది. అతని వెనుకాల రేవంత్ ఉన్నాడు. అయితే అతను కోడిగుడ్డును పట్టుకునేందుకు ప్రయత్నించగా నో రేవంత్ అంటూ శ్రీసత్య వారించింది. ముందుగా రోహిత్ వెళ్లగా.. తర్వాత ఆదిరెడ్డి ఉన్నాడు. చివర్లో రేవంత్ ఉన్నాడు. రేవంత్ కోడిగుడ్డు కిందపడకుండా ఉండేందుకు చేతిని అడ్డుగా పెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో రేవంత్ నో అంటూ శ్రీసత్య అంది.

 వేరేవాళ్లు చెబితే నమ్మకూడదు..

వేరేవాళ్లు చెబితే నమ్మకూడదు..

శ్రీసత్య అలా అనడంతో.. ఏంటీ నో.. అని రేవంత్ అంటే టచ్ అవ్వకూడదని శ్రీసత్య అండ్ శ్రీహాన్ అన్నారు. మాకు కనిపించట్లేదు అందుకే నో అంటున్నామని శ్రీసత్య అంది. ఇంతలో రేవంత్ కోడిగుడ్డు కిందపడిపోయింది. అటుతిరిగి ఉన్నప్పుడు మీరు చూడాలి, వేరేవాళ్లు చెబితే నమ్మకూడదు కదా. ఒకసారి టచ్ చేశా ఒప్పుకుంటా.. రెండో సారి టచ్ చేయలేదు. నువ్ చూడాలి అని రేవంత్ అన్నాడు.

నా గేమ్ గొడవ పడతా..

రేవంత్ అలా అనడంతో కనిపించేవాళ్లకు అలానే కనిపిస్తుంది రేవంత్.. దాని మీద గొడవ పడకు అని శ్రీసత్య అంది. కచ్చితంగా గొడవ పడతా నా గేమ్.. గొడవ పడతా నేను అని కోపంగా అన్నాడు రేవంత్. దీంతో శ్రీసత్య షాక్ అయి అలానే చూస్తూ ఉండిపోయింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 13వ వారం నామినేషన్లలో రోహిత్, రేవంత్, ఫైమా, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీసత్య ఆరుగురు ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X