twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: వరెస్ట్ పర్ఫామర్ టాస్క్.. రేవంత్-శ్రీసత్యల మాటల యుద్ధం

    |

    అమెరికాలో బిగ్ బ్రదర్ రియాలిటీ షో అక్కడ అత్యంత ప్రేక్షకాదరణ పొందింది. ఈ రియాలిటీ షోను ఇండియాలో బిగ్ బాస్ పేరిట తీసుకొచ్చారు. ముందుగా హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షో కాలక్రమేణా పలు ప్రాంతీయ భాషల్లోకి కూడా వచ్చింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ షో మొదటి సీజన్ సూపర్ హిట్ అయింది. దీంతో వరుసపెట్టి సీజన్లు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ప్రసారమవుతోంది. ఇప్పటికీ 68 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. తాజాగా నవంబర్ 11 శుక్రవారం 68వ రోజు నాటి ఎపిసోడ్ రెండో ప్రోమోను విడుదల చేశారు.

    21 మందిలో 9 మంది ఎలిమినేట్..

    21 మందిలో 9 మంది ఎలిమినేట్..

    ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 6 సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు 21 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరిలో తొమ్మిది వారాల్లో షానీ సల్మాన్, అభినయ శ్రీ, నేహా చౌదరి, ఆరోహి రావు, చంటి, సుదీప పింకీ, అర్జున్‌, సూర్య, చిత్తూరు చిరుత గీతూ రాయల్ ఎలిమినట్ అయి వెళ్లిపోయారు.

     ఆదిరెడ్డి వర్సెస్ శ్రీసత్య..

    ఆదిరెడ్డి వర్సెస్ శ్రీసత్య..

    ఇక బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ పదో వారం కెప్టెన్సీ టాస్క్ లో ప్రతి ఒక్కరు గట్టి పోటీ ఇచ్చారు. కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ లో చివరిగా ఫైమా, ఆదిరెడ్డి, రోహిత్, శ్రీసత్యకు పోటీ పడ్డారు. వీరిలో రోహిత్ అవడంతో శ్రీసత్య, ఆదిరెడ్డి, ఫైమాకు పోటి పడింది. ఇవాళ్టి మొదటి ప్రొమోలో శ్రీసత్యను టార్గెట్ చేసిన ఆదిరెడ్డి ఆమె బ్యాగ్ మొత్తం చించివేశాడు. దీంతో శ్రీసత్య అవుట్ అయిపోయింది. ఫైనల్ గా ఆదిరెడ్డికి ఫైమాకు ఇంటి కెప్టెన్ టాస్క్ పోటి పడింది.

    వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు..

    వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు..

    ఆదిరెడ్డి, ఫైమా వీరిద్దరిలో బిగ్ బాస్ పదో వారం కెప్టెన్ గా ఫైమా నిలిచినట్లు బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. ఇక ఇంటి కెప్టెన్ ఎన్నిక అయ్యాక వారంలో ఎవరు వరస్ట్ కంటెస్టెంట్ ను ఎన్నుకుంటారన్న విషయం తెలిసిందే. అలాగే బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ 10వ వారం కూడా వరెస్ట్ కంటెస్టెంట్ ను ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటూ తగిన కారణాలు చెప్పారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

     పర్సనల్ విషయంతో గేమ్..

    పర్సనల్ విషయంతో గేమ్..

    ఇందులో సంబంధం లేని విషయంలో తల దూర్చారంటూ ఇనయాను నామినేట్ చేశాడు ఆదిరెడ్డి. మీ పాయింట్స్ మీరే కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నావ్ అని ఆదిరెడ్డి అంటే.. మా ఒపినీయన్ మీకు చెప్పానా అంటూ ఇనయా వాదించింది. ఇలా ఆదిరెడ్డి, ఇనయా మధ్య మాటల యుద్ధం నడిచింది. తర్వతా పర్సనల్ విషయంతో గేమ్ ఆడావనిపించిందని మళ్లీ ఇనయానే నామినేట్ చేశాడు రోహిత్. ఇనయా వివరణ ఇచ్చుకుంటే నువ్ చెప్పింది నాకర్థం కాలేదని రోహిత్ అన్నాడు.

     లావు అయ్యానా..

    లావు అయ్యానా..

    తర్వాత శ్రీసత్య వచ్చి రేవంత్ ను నామినేట్ చేసింది. ముందుదానికి చూసుకుంటే ఈ వారం కొంచెం మారినట్లు అనిపించిందని శ్రీసత్య అంటే.. దానికి రేవంత్ ఏ చేంజ్ కనిపించింది. ఏమైనా లావు అయ్యానా అని అన్నాడు. దీంతో ఈ వెటకారమే నచ్చలేదని శ్రీ సత్య తెలిపింది. తర్వాత వచ్చిన రేవంత్ శ్రీసత్యను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఎవరు ఎంత అరుస్తారో నాకు తెలుసు.. నాతో పోల్చుకోకు అని రేవంత్ అన్నాడు.

    నోరు ఉందిగా.. దాంతో చెప్పు..

    రాత్రి మీ గురించే మాట్లాడుకుంటున్నా అని అన్నావ్ కదా.. అది నీ భ్రమ అని రేవంత్ అన్నాడు. దీంతో ఆశ్చర్యపడినట్లుగా కనుబొమ్మలు ఎగిరేసింది శ్రీ సత్య. దీనికి అలా కనుబొమ్మలు ఎగిరేయకు.. నోరు ఉందిగా.. దాంతో చెప్పు అని రేవంత్ సీరియస్ అయ్యాడు. దీనికి నాకు నార్మల్ గా కూడా నవ్వితే ఐ బ్రోస్ ఎగురుతాయ్ అని శ్రీసత్య వివరణ ఇచ్చింది. నాకు అలా నచ్చదని రేవంత్ చెప్పడంతో ప్రోమో ముగిసింది.

    English summary
    Bigg Boss Telugu 6 Season 10th Week Worst Performer Fight Between Revanth And Sri Satya In November 11 Episode Promo Released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X