Bigg Boss Telugu 6: టాప్ 5లో ఉండాల్సిన సూర్య వెళ్లిపోవడానికి కారణాలు ఇవే.. బిగ్ వార్నింగ్!

బిగ్ బాస్ లో ఊహించిన విధంగా ఎలిమినేషన్స్ కొనసాగుతున్నాయి. టాప్ 5 వరకు ఉంటారు అనుకున్న కంటెస్టెంట్స్ కొందరు ముందుగానే వెళ్ళిపోతూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బిగ్ బాస్ అయితే ఆటపై నిర్లక్ష్యం వహించిన వారిని ఏమాత్రం క్షమించడం లేదు. వారి కారణంగా రేటింగ్స్ తగ్గిపోతున్నాయి అని అనుమానం వస్తే వెంటనే హౌస్ లో నుంచి తీసివేస్తున్నారు. ఇక ఈసారి సూర్య వెళ్లిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒక విధంగా ఇది మిగతా వారికి హెచ్చరిక అని చెప్పవచ్చు. ఆ వివరాల్లోకి వెళితే..

చివరి వరకు ఉండాలని

చివరి వరకు ఉండాలని

బిగ్ బాస్ మొదటి రెండు మూడు వరాలు ఎలిమినేషన్స్ అయితే పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేకపోయాయి. హౌస్ లో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు ఉండాలి అని పట్టుదలతోనే వస్తారు. అయితే వారు తెలియకుండా చేసే కొన్ని కారణాలను కూడా ఎలిమినేషన్ కు దారితీస్తాయి. ఇక సూర్య కూడా దాదాపు అదే తరహాలో హౌస్ లో నుంచి వెళ్లిపోయినట్లుగా అర్థమవుతుంది.

ఓట్లు తగ్గాయి

ఓట్లు తగ్గాయి

సూర్య హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు మొదట్లో అయితే జనాల నుంచి మంచి క్రేజ్ అందుకున్నాడు. ముఖ్యంగా అయితే అతనికి టాప్ 5 లో చోటు దక్కడం ఖాయమని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వినిపించాయి. ఇక ప్రతివారం అతనికి కూడా భారీ స్థాయిలో ఓట్లు దక్కుతూ వచ్చాయి. కానీ గత రెండు వారాలు మాత్రం సూర్యకు ఓట్లు చాలా వరకు తగ్గుతూ వచ్చాయి.

మిమిక్రీ తో హైలెట్

మిమిక్రీ తో హైలెట్

ఆర్ జె సూర్య బిగ్ బాస్ ద్వారా ఒక విధంగా మంచి క్రేజ్ అందుకున్నాడు అని చెప్పవచ్చు. ముఖ్యంగా అతని మిమిక్రీ టాలెంట్ తోనే షోలో ఒక వైపు ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తూ వచ్చాడు. అందరికంటే విభిన్నమైన టాలెంట్ కలిగిన సూర్య మొదట్లో తన మిమిక్రీ టాలెంట్ బాగానే చూపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం దాన్ని పెద్దగా హైలైట్ చేయలేకపోయాడు.

చేపల చెరువు టాస్క్ లో

చేపల చెరువు టాస్క్ లో

బిగ్ బాస్ మొదట సెలెక్ట్ చేసుకున్నప్పుడే డిఫరెంట్ టాలెంట్ ఉంటే వారికి చాలా అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఇక దాదాపు 8 వారాలపాటు ఆర్ జె సూర్య ఎలిమినేషన్ కాకుండా జాగ్రత్త పడినప్పటికీ చివరలో అతను టాస్క్ లో పెద్దగా పోరాట పటిమ చూపించలేదు. దీంతో ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ముఖ్యంగా చేపల చెరువు టాస్క్ లో సూర్య ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.

ఆ విధంగా సక్సెస్ కాలేకపోయాడు

ఆ విధంగా సక్సెస్ కాలేకపోయాడు

సూర్య తన మిమిక్రీతో మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తాడు అనుకుంటే గత రెండు మూడు వారాలు కూడా అతను తన టాలెంట్ ను పెద్దగా హైలెట్ చేయలేకపోయాడు. కంటెస్టెంట్స్ అందరూ కూడా వారి టాలెంట్ ఉపయోగించుకుని ఒకవైపు టాస్కులలో పోరాడుతూ మరొకవైపు ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తూ ఉండాలి. కానీ ఈసారి సూర్య ఆ విధంగా సక్సెస్ కాలేకపోయాడు. ఎంతసేపు అమ్మాయిలతో రొమాన్స్ చేసేందుకు ప్రయత్నం చేశాడు. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. ఒక విధంగా సూర్య లాంటి బలమైన కంటెస్టెంట్ వెళ్లిపోవడం అంటే మిగతా వారికి ఇది హెచ్చరిక అనుకోవచ్చు. మరి ఎలిమినేషన్ నుంచి మిగతా వాళ్ళు ఏం నేర్చుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X