Bigg Boss Telugu 6: హౌజ్ లో హద్దు దాటుతున్న రొమాన్స్.. ఒకరి నోట్లోది ఒకరు పెట్టుకుంటూ
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ కంప్లీట్ అయింది. ఈ టాస్క్ తర్వాత బిగ్ బాస్ పెట్టిన బాల్ గేమ్ లో గెలిచి 8 మంది కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కు ఎంపికయ్యారు. అయితే బిగ్ బాస్ తెలివిగా పెట్టిన బ్యాటరీ రరీఛార్జ్ టాస్క్ లో మెరీనా రోహిత్ కు తప్ప మిగతా కంటెంస్టెంట్లందరికీ తమ ఇళ్ల నుంచి ఏదో ఒకటి పొందారు. అందరూ కూడ చాలా తెలివిగా గేమ్ ఆడారు. కానీ త్యాగం చేసిన రోహిత్ అండ్ మెరీనాకు ఆశించిన ఫలితం దక్కలేదు. ఇదిలా ఉంటే ఈ టాస్క్ జరుగుతున్న క్రమంలో ఇద్దరి కంటెస్టెంట్ల రొమాన్స్ పీక్స్ కి వెళ్లింది. వాళ్ల చేష్టలు చూస్తుంటే మరి చిరాకు తెప్పించేలా ఉన్నాయి. తాజాగా బిగ్ బాస్ తెలుగు 6 అక్టోబర్ 13 గురువారం 39వ రోజు 40వ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

ఏమాత్రం ఎమోషన్స్ లేకుండా..
ఒకసారి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఎక్కువ రోజులు ఉండాలి అని కంటెస్టెంట్స్ అందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏమాత్రం ఎమోషన్స్ లేకుండా టాస్కులలో ఆడితేనే ఇక్కడ నిలదొక్కుకుంటారు. అయితే కొందరు అదే తరహాలో గేమ్ ఆడుతున్నప్పటికీ మరికొందరు మాత్రం అనవసరమైన వివాదాలతో నెగిటివ్ కామెంట్స్ అందుకుంటున్నారు. ఇక తాజాగా పెట్టిన బ్యాటరీ టాస్క్ అయితే పూర్తిగా ఎమోషనల్ కు సంబంధించిన టాస్క్.

బ్యాటరీ ఛార్జ్ టాస్క్..
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ 39వ రోజు 40వ ఎపిసోడ్ లో కూడా బ్యాటరీ ఛార్జ్ టాస్క్ కొనసాగింది. ఈ టాస్క్ లో భాగంగా ఇప్పటికే శ్రీహాన్, శ్రీ సత్య, సుదీప, బాలాదిత్య, ఇనయా సుల్తానా, అర్జున్ కల్యాణ్, ఆదిరెడ్డి, గీతూ రాయల్ కు సర్ ప్రైజ్ లు అందాయి. వారు ఎంచుకున్న ఆప్షన్ ను బట్టి ఇంటిసభ్యులతో ఆడియో కాల్, వీడియో కాల్, ఫొటో ఫ్రేమ్, ఫుడ్ అందుకున్నారు. మిగిలిన హౌజ్ మేట్స్ కూడా సర్ ప్రైజ్ లు అందుకున్నారు.

రెండు వారాలు సెల్ఫ్ నామినేట్..
బ్యాటరీ ఛార్జ్ 5 శాతానికి పడిపోవడంతో 100 శాతం రిఛార్జ్ అయేందుకు రోహిత్ లేదా వాసంతి ఇద్దరిలో రెండు వారాలు సెల్ఫ్ నామినేట్ కావాలని బిగ్ బాస్ తెలిపాడు. చివరిగా సెల్ఫ్ నామినేట్ అయ్యేందుకు రోహిత్ ఒప్పుకున్నాడు. దీంతో 100 శాతం బ్యాటరీ రీఛార్జ్ అయింది. టెలిఫోన్ బూతు నుంచి కాల్ రాగా ముందుగా రేవంత్ లిఫ్ట్ చేశాడు. 10 శాతం రీఛార్జ్ తో భార్య ఫొటో సెలెక్ట్ చేసుకున్నాడు.

అమ్మ లేఖను అందుకున్న ఆర్జే సూర్య..
తర్వాత ఫైమా 25 శాతం రీఛార్జ్ తో వాళ్ల అమ్మతో వీడియో కాల్ మాట్లాడింది. 15 శాతంతో కీర్తి భట్ కు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ మానస్ నుంచి ఆడియో మెసేజ్ వచ్చింది. వాసంతి 15 శాతం రీఛార్జ్ తో అక్క కూతురి ఫొటో ఎంపిక చేసుకుంది. రాజ్ 15 శాతం రీఛార్జ్ ఉపయోగిస్తూ ఆడియో కాల్ తీసుకున్నాడు. ఇక ఆర్జే సూర్య 20 శాతం బ్యాటరీతో అమ్మ లేఖ అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఆర్జే సూర్య, ఇనయాల రొమాన్స్ హద్దు దాటుతోందనిపిస్తుంది.

ఉదయం పూట టెలీఫోన్ బూతు దగ్గర..
ఇప్పటివరకు వాళ్లిద్దరు ఒకరి పక్కనే ఒకరు ఉంటూ ఫెవికాల్ లా అతుక్కుపోయేవారు. వాళ్లకు వాళ్లు తినడం మానేసి ఒకరినొకరు తినిపించుకుంటున్నారు. కలిసే పడుకుంటున్నారు. ఇక ఈ బ్యాటరీ టాస్క్ జరిగే క్రమంలో ఉదయం పూట టెలీఫోన్ బూతు దగ్గర ఒకరి లాలీపాప్ ను మరొకరు చప్పరించారు. ఇనయా తను చప్పరించిన లాలీ పాప్ ను సూర్యకు ఇస్తే అతను కూడా అదే లాలీపాప్ ను చప్పరిస్తాడు. మొన్నటి వరకు ఆరోహి రావుతో ఆర్జే సూర్య కనపడిన దానికంటే ఎక్కువగా ఇనయాతో కనిపిస్తున్నాడు ఫెమినిస్ట్ ఆర్జే సూర్య.

అందరికీ సర్ ప్రైజ్ లు.. కానీ,
ఇలా ప్రతి విషయంలో ఏదో ఒకటి చేస్తూ కాస్తా చిరాకు తెప్పిస్తున్నారు ఆర్జే సూర్య, ఇనయా సుల్తానా. ఇదిలా ఉంటే హౌజ్ లో అందరికీ సర్ ప్రైజ్ లు అందాయి కానీ, సెల్ఫ్ నామినేట్ అయిన రోహిత్, మెరీనాలకు అవకాశం రాకుండానే బ్యాటరీ రీఛార్జ్ మొత్తం అయిపోయింది. ఇక ఈవారం బిగ్ బాస్ సభ్యులందరికీ కూడా కెప్టెన్సీ పోటీదారులు అవ్వడానికి సమానమైన అవకాశాలను ఇవ్వాలనుకుంటున్నట్లు నోటీసు వచ్చింది.

దెబ్బలు తగిలినా లెక్క చేయకుండా..
ఇక టాస్క్ లో భాగంగా అందరూ కూడా ఒకేసారి బంతులను అందుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు చాలా తీవ్రంగా పోటీపడి ఆ బంతులను పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు.
కొందరికి దెబ్బలు కూడా తగిలాయి. దెబ్బలు తగిలినా లెక్క చేయకుండా, పట్టు వదలకుండా గేమ్ ఆడారు. మొత్తానికి ఈ పోటీలో ఆదిరెడ్డి, వాసంతి, ఆర్జే సూర్య, అర్జున్ కల్యాణ్, శ్రీ సత్య, రాజ శేఖర్, రోహిత్, రేవంత్ మొత్తం కలిపి 8 మంది కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కు ఎంపికయ్యారు. మరి ఈ పోటీలో ఎవరు ఈరోజు కెప్టెన్సీ టాస్క్ లో గెలుస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











